కొల్హాపూర్ మహాలక్ష్మి 2 డేస్ యాత్ర +పండరిపూర్,విత్ 3 దత్త క్షేత్రాలు గాన్గాపూర్,అక్కల్ కోట్,హోమ్నాబాద్ బై ఎ.సి.కార్. ఒక్కరికి రూ.5500

కొల్హాపూర్ మహాలక్ష్మి 2డేస్ మిని యాత్ర  

బై 8 సీటర్ ఎ.సి.కార్ తేధి — శనివారం ఉదయం 6.30 గంటలకు KPHB Metro Station/Bus Station నుండి రిటర్న్ Next Day ఆధివారం— రాత్రి 10గంటలకు Drop @KPHB Metro Station/Bus Station .

కొల్హాపూర్ మహాలక్ష్మీ టెంపుల్

5 క్షేత్రాలతో 1) కొల్హాపూర్ మహాలక్ష్మి మందిరం(7వ అష్టాదశ శక్తిపీఠం)-మహారాష్ట్ర 2) పండరిపురం పండరినాధుడు(ముఖ దర్శనం ) -మహారాష్ట్ర + 3 దత్త క్షేత్రాలు – 1) గాన్గపూర్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్త క్షేత్రం- కర్ణాటక.2)శ్రీ అక్కల్ కోట్ సమర్థ మహారాజు 3)హోమ్నబాద్ –మాణిక్ ప్రభు దత్త క్షేత్రం- కర్ణాటక.. బై ఎ.సి.కార్+ 1 రాత్రి కోల్హాపూర్ లో – నాన్ ఎ.సి.రూంలతో నైట్ స్టే, విత్ భోజనంతో (ఉదయం టీ,టిఫిన్+ మధ్యాహ్న భోజనం,సాయంత్రం టీ, రాత్రి ఏదేని టిఫిన్/ అల్హాహారం(లైట్ ఫుడ్ = నాట్ డిన్నర్) ఒక్కరికి రూ.5,500*కారులో ఫ్రంట్ సీట్ రిజర్వేషన్ రూ.500 అదనం .

నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా ఒక్కరు రూ.3000 పేచేయవలెను. Google Pay to – 8985246542 Shree Tours . శ్రీటూర్స్ – 8985246542 (గమనిక* యాత్ర బై 8సీటర్ ఎ.సి. మహీంద్రా మరాజో కార్లో) బ్యాలెన్స్ రూ.2500 క్యాష్ గా యాత్రలో పేచేయవలెను.యాత్ర క్షేత్రాలు, స్థల పురాణం విశేషాలు వివరంగా చదువడానికి మా వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. https://shreetours.in/kolhapur-mahalakshmi-yatra-pandarpur-ganugapur-akkalkot-homnabad-

యాత్ర క్షేత్రాల విశేషాలు.
1) కొల్హాపూర్ మహాలక్ష్మి మందిరం**ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షిస్తే.. నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీ అమ్మవారు తన కరములతోపైకి ఎత్తిందట! అందుకే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందట! ఈ మందిరానికి అవిముక్తేశ్వర క్షేత్రమని కూడా పేరుంది.. వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు తపమాచరించినట్టు..అమ్మవారికి పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి..సమస్త మానవాళికి శక్తిని… ఉత్సాహాన్ని… ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ.

ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు తన హృదయంలో నిలుపుకుంటాడు.. నారాయణిగా పేరుగాంచిన ఆ సిరి దేవత ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలకు లోటు ఉండదు.. స్వయంగా లక్ష్మీదేవి తపమాచరించి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకే ఇక్కడ పేదరికం ఉండదట!ఈ క్షేత్రానికి ఒకటిరెండు స్థలపురాణాలు కూడా ఉన్నాయి. ఆగస్త్యమహాముని ప్రతి ఏటా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునేవాడు.. వయసుమీరిన తర్వాత ఆగస్త్యుడికి కాశీకి వెళ్లడం కష్టమయ్యింది.. దాంతో శివుడి గురించి తపస్సు చేశాడు.. శివుడు ప్రత్యక్షమై….వరం కోరుకోమన్నాడు.. కాశీకి ప్రత్యామ్నాయ క్షేత్రాన్ని చూపించాలని వేడుకుంటాడు ఆగస్త్యుడు.. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారని.. ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీలో తనను దర్శించుకున్నంత ఫలమని శివుడు చెబుతాడు..

పరమేశ్వరుడి ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని స్థలపురాణం చెబుతోంది. ఈ నగరానికి కోల్‌పూర్ … కోల్‌గిరి … కొలదిగిరి పట్టణ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. . కొల్లా అంటే లోయ! పూర్‌ అంటే పట్టణం. ఈ క్షేత్ర ప్రాంతం ఛత్రపతి శివాజీ ఏలుబడిలో ఎంతగానో అభివృద్ధి చెందింది.ఆమె విశ్వం యొక్క అసలైన సృష్టికర్త, పరిశీలకుడు మరియు నాశనం చేసేది. ఆమె సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి దేవితో పాటు బ్రహ్మ, విష్ణు మరియు శివ అనే త్రిమూర్తులను సృష్టించింది. కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి దేవిని దర్శించకుండానే శ్రీ బాలాజీ దర్శనం అసంపూర్తిగా ఉంటుందని ఒక నమ్మకం .
2) గాన్గపూర్ – శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్త క్షేత్రం- . గాన్గపూర్ నరసింహ సరస్వతి -పద్నాలుగో శతాబ్దంలో జన్మించాడు. అతను దత్తాత్రేయ యొక్క రెండవ అవతారంగా పరిగణించబడ్డాడు గంగాపూర్‌లో స్థిరపడిన ఒక ఋషి మరియు గురువు. దత్తాత్రేయ భగవానుడు గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని నాథ్ సంప్రదాయ ప్రజలు, అఘోర్‌లు, నాగ సాధువులు మరియు లక్షలాది మంది భక్తులకు మొదటి గురువు.

3) శ్రీ పాండురంగస్వామి ఆలయం… పండరీపురం( పండరిపురంలో ముఖ దర్శనం మాత్రమే స్పర్షదర్శనం కాదు.) ! భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్వక్షేత్రం పండరీపురం.మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్వక్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు.

ఓం నమో పాండురంగాయ..ఓం నమో పుండరీక వర్మయా..ఓం నమో నారాయణాయ..ఓం నమో ఆశ్రుత జన రక్షకాయ..అంటూ శ్రీ పాండురంగ స్వామి వారు లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం.పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాధించడానికి గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించడాని పురాణాల ద్వారా అవగతం అవుతున్నది.
4) హోమ్నాబాధ్ మాణిక్ ప్రభు దత్తక్షేత్రం. మాణిక్ ప్రభు దేవాలయం సన్యాసి శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ సంజీవని సమాధిపై నిర్మించబడింది. అతను గొప్ప సాధువు మరియు దత్తాత్రేయ భగవానుని నాల్గవ అవతారంగా నమ్ముతారు. అతను 1817లో జన్మించాడు మరియు 1865లో సమాధిని పొందాడు.

సాధువు తన ఆధ్యాత్మిక శక్తులకు ప్రసిద్ధి చెందాడు, దీని ద్వారా తన ఆశీర్వాదం కోసం వచ్చిన అనేక మంది భక్తుల బాధలు మరియు బాధలను తొలగించాడు. సాధువు భక్తి మార్గాన్ని అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ బ్రహ్మదేవునికి అంకితం చేయబడిన అనేక కవితా రచనలను కలిగి ఉన్నారు. సన్యాసిని అన్ని వర్గాలు గౌరవించి గౌరవించడంతో సకలమాతాచార్య అనే బిరుదు పొందారు.
5) శ్రీ అక్కల్ కోట్ సమర్థ మహారాజు: ఒక దివ్య గురువు.శ్రీ అక్కల్ కోట్ సమర్థ మహారాజు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత గౌరవనీయమైన మరియు ఆరాధించబడే గురువులలో ఒకరు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న అక్కల్ కోట్ పట్టణం ఆయన నివాస స్థలం మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు ఆయన్ని దత్తాత్రేయ స్వామివారి అవతారంగా ప్రగాఢంగా విశ్వసిస్తారు.సమర్థ మహారాజు జీవిత తొలినాళ్ల గురించి నిర్దిష్ట వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన అకస్మాత్తుగా అక్కల్ కోట్ లో ప్రత్యక్షమై, అక్కడ స్థిరపడి భక్తులకు మార్గనిర్దేశం చేశారని భక్తులు నమ్ముతారు. అక్కల్ కోట్ అప్పటి నుండి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారింది.

ఇక్కడ భక్తులు ఆయన సమాధిని దర్శించుకుని ఆశీర్వాదం పొందుతారు.ఆయన బోధనలు చాలా సరళమైనవి మరియు సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేవి. ఆత్మజ్ఞానం పొందడం, భగవంతునిపై దృఢమైన విశ్వాసం ఉంచడం, సత్య ధర్మాన్ని పాటించడం వంటి వాటికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. “శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ” అనే నామాన్ని జపించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చని ఆయన ఉపదేశించారు.

ఈ మంత్రం నేటికీ ఆయన భక్తులచే నిరంతరం జపించబడుతూ ఉంటుంది.సమర్థ మహారాజు అనేక మహిమలు చూపారని, భక్తుల కష్టాలను తీర్చి వారికి అండగా నిలిచారని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన దర్శనం మరియు ఆశీర్వాదం కోసం భారతదేశం నలుమూలల నుండి భక్తులు అక్కల్ కోట్ కు తరలివస్తుంటా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top