కొల్హాపూర్ మహాలక్ష్మి, పండరీపురం + 3 పవిత్ర దత్త క్షేత్రాలైన గాన్గపూర్, అక్కల్ కోట్, మరియు హోమ్నబాద్ ల యాత్ర , ఒక్కరికి రూ.5,500 (If 7 members booked rs.5500 each, if 6 members booked rs.6000 each)కారులో ఫ్రంట్ సీట్ రిజర్వేషన్ రూ.500 అదనం . నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా ఒక్కరు రూ.3000 పేచేయవలెను. Google Pay to – 8985246542 Shree Tours . శ్రీటూర్స్ – 8985246542 (గమనిక యాత్ర బై 8సీటర్ ఎ.సి. మహీంద్రా మరాజో కార్) బ్యాలెన్స్ క్యాష్ గా యాత్రలో పేచేయవలెను
హోటల్ రూం నైట్ స్టే. : కొల్హాపూర్ లో ఒక రాత్రి నాన్ ఎ.సి. హోటల్ రూంలో వసతి.
ఆహారం: ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, మరియు రాత్రికి టిఫిన్/అల్పాహారంతో సహా. మద్యహ్నం డైలి 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్.
యాత్ర ఖర్చు: ఒక్కరికి: ₹5,500/-
ఈ ఆధ్యాత్మిక యాత్రలో దర్శించుకునే పుణ్యక్షేత్రాలు
1. కొల్హాపూర్ మహాలక్ష్మి మందిరం (7వ అష్టాదశ శక్తిపీఠం) – మహారాష్ట్ర ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని రక్షించినట్లు, ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీ అమ్మవారు తన చేతులతో పైకి ఎత్తిందని ప్రతీతి. అందుకే దీనికి కరవీర క్షేత్రం అని పేరు. వేల సంవత్సరాలుగా మహర్షులు తపస్సు చేసిన, అమ్మవారికి పూజలు చేసిన పవిత్ర భూమి ఇది. సమస్త మానవాళికి శక్తి, ఉత్సాహం, ఐశ్వర్యం ప్రసాదించే రజోగుణాధీశ్వరి మహాలక్ష్మి. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవి ఇక్కడ స్వయంగా తపమాచరించి వెలసింది, అందుకే ఈ క్షేత్రంలో పేదరికం ఉండదని నమ్మకం. కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యామ్నాయంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. కొల్హాపూర్ మహాలక్ష్మి దేవిని దర్శించకుండా శ్రీ బాలాజీ దర్శనం అసంపూర్ణంగా ఉంటుందని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది.
2. పండరిపురం పండరినాథుడు (ముఖ దర్శనం మాత్రమే – స్పర్శదర్శనం కాదు) – మహారాష్ట్ర భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ లేదా ‘వితోబా’ పేరుతో ఇక్కడ కొలువై ఉన్నారు. భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్ధిని ప్రసాదించడానికి పాండురంగడుగా అవతరించిన క్షేత్రమిది.
3. గాన్గపూర్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్త క్షేత్రం – కర్ణాటక పద్నాలుగో శతాబ్దంలో జన్మించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి, దత్తాత్రేయ భగవానుడి రెండవ అవతారంగా పరిగణించబడతారు. ఈ క్షేత్రం దత్తాత్రేయ భగవానుడి భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం.
4. హోమ్నబాద్ మాణిక్ ప్రభు దత్త క్షేత్రం – కర్ణాటక శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ సంజీవని సమాధిపై నిర్మించిన ఈ ఆలయం దత్తాత్రేయ భగవానుడి నాల్గవ అవతారంగా నమ్మబడుతుంది. భక్తి మార్గాన్ని అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన గొప్ప సాధువు ఈయన. ‘సకలమాతాచార్య’ అనే బిరుదు పొందిన ఈ సన్యాసిని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారు.
5. శ్రీ అక్కల్ కోట్ సమర్థ మహారాజు – మహారాష్ట్ర దత్తాత్రేయ స్వామివారి అవతారంగా లక్షలాది మంది భక్తులు విశ్వసించే ఈ దివ్య గురువు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న అక్కల్ కోట్ లో వెలసి, భక్తులకు మార్గనిర్దేశం చేశారు. “శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ” అనే నామాన్ని జపించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చని ఆయన ఉపదేశించారు. అనేక మహిమలు చూపిన ఆయన భక్తుల కష్టాలను తీర్చి అండగా నిలిచారని ప్రతీతి.