శ్రీటూర్స్ తరుపున మహారాష్ట్ర యాత్రకు 18-12-22 న వస్తున్న యాత్రికులందరికి స్వాగతం. ( ఈ దిగువన యాత్ర సూచనలు గతం లో మహారాష్ట్ర యాత్రకు పంపినదే కేవలం 18-12-22 అని డేట్లు మార్చి పంపడం జరుగుతుంది. ఎక్కడైనా పొరపాటున పాత డేట్లు కనపడితే ఈ కొత్త తేధిల ప్రకారమే అర్థం చేసుకోగలరు)
*యాత్ర జాగ్రత్తలు- సూచనలు*
1) 18-12-22 న రాత్రి 10.30 కు ట్రైన్ నాంపల్లి(హైదరాబాదు రైల్వేస్టేషన్ లో బయలుదేరుతుంది.( ట్రైన్ నేమ్, నెంబర్ HYB AWB EXP -17649) ఈ ట్రైన్ ఖైరతాబాదు,బేగంపేట, సనత్ నగర్, లింగంపల్లిలో కూడా ఆగుతుంది. యాత్రికులు తమ సౌకర్యం మేరకు ఎక్కడైనా ఎక్కవచ్చును.కాని బయలుదేరేది నాంపల్లి నుండి కాబట్టి ఎక్కువ టైమ్ ఆగుతుంది,మిగితా స్టేషన్ లలో 1 నిమిషం మాత్రమే ఆగుతుంది. మీ బోగి మరియు బెర్త్ వివరాలు ఇప్పటికే మీకు టికెట్లు అన్ని పంపాను. ఆవి ఆన్ లైన్ లో బుక్ చేసిన టికెట్లు కాబట్టి ట్రైన్ లో టిటిఐకు అవి చూపిస్తే సరిపోతుంది. మరోసారి ఈ రోజు మరియు యాత్రకు బయలుదేరే రోజు కూడా గ్రూప్ లో ఆ టికెట్లన్ని పెడుతాను. యాత్రకు బయలుదేరే రోజు చార్టుగా ఇస్తాను . ఫాస్ట్ గా ఎక్కేవారు మిగితా స్టేషన్ లలో ఎక్కవచ్చును లేదంటా అంతా నాంపల్లి రైల్వేష్టేషన్ కు రాత్రి 10గంటలకు రావాలి.
2) 19-12-22 న పర్లివైధ్యనాధ్ లో ఉదయం 6.30 కు దిగుతాం, 19-12-22 నుండి 22-12-22 మద్య 4 రోజులు మహారాష్ట్ర లో ఎ.సి. బస్ ద్వార యాత్ర ఉంటుంది.22-12-22 న రాత్రి 10 గంటలకు (ఔరంగాబాదు రైల్వేస్టేషన్ కు సిటిలో ట్రాపిక్ లో ప్రయాణం కాబట్టి 8-9గంటలకే ఔరంగాబాదు రైల్వేస్టేషన్ చేరుకోవాలి) రిటర్న్ ట్రైన్ ఎక్కి 23-12-22 న ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో దిగుతాం.
3) 18-12-22 నైట్ వచ్చే ముందే ఇంటి దగ్గర భోజనం చేసి రావాలి.ఖచ్చితంగా రాత్రి 10గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్ వచ్చి నా నెంబర్ కు కాల్ చేయగలరు, రైల్వేస్టేషన్ మేయిన్ ఎంట్రెన్స్ గేట్ దగ్గర ఉంటాను.(లగేజి స్కానింగ్ కౌంటర్ పక్కన) మేయిన్ ఎంట్రేన్స్ ఉంటుంది. ట్రైన్ జనరల్ గా 1వ నెంబర్ ప్లాట్ ఫాం మీద అగుతుంది. నాకు ఫోన్ చేసి హాజరు వేయించుకున్న తరువాత ట్రైన్ లో మీ భోగిలో సీట్లలోకి వెళ్ళి కూర్చోవచ్చును. ( ట్రైన్ నేమ్, నెంబర్ HYB AWB EXP -17649)
4) లగేజి లైట్ గా ఒక్కరు 10 కేజిల బ్యాగ్ మించకుండా ఎవరి బ్యాగ్ వారు మాత్రమే మోసుకునేంత మాత్రమే లగేజి తెచ్చుకోగలరు.5 జతల బట్టలు,టవల్,బెడ్ షీడ్, రెగ్యుల్ గా వాడే మెడిసిన్స్,వాంమ్టింగ్స్,మోషన్స్,ఫివర్, డోలో 650 లాంటివి తెచ్చుకోగలరు.విలువైన బంగారం గొలుసులు తెచ్చుకోవద్దు.ఎక్కడైన పూజ,అభిషేకాలు ఉన్నదగ్గర అవసరానికి మగవాళ్ళు ఒక పంచె,ఉత్తరీయం ,ఆడవాళ్ళు సాంప్రదాయ చీరెలు తెచ్చుకోండి.
5) పార్కింగ్ ప్లేసులో బస్ ఆగిన తరువాత ఎక్కడైనా టెంపుల్స్ కు సమీప దూరాలకు షేరింగ్ ఆటోల చార్జీలు, పూజలు,అభిషేకాలు, ప్రత్యేక ఎంట్రెన్స్ టికెట్స్ , స్పెషల్ దర్శనాలు యాత్రికులు పెట్టుకోవాలి.
6) మనం 18-12-22న నైట్ ట్రైన్ లో జర్నీ చేసి 19-12-22 న పర్లివైధ్యనాధ్ రైల్వేస్టేషన్ లో ఉదయం దిగుతాం.ట్రైన్ దిగేముందే లగేజిని బస్ లో ఎక్కించే ముందరే పర్లివైధ్యనాధ్ లో స్నానం చేయడానికి ఆడ, మగ వారు విడి విడిగా ఒక ప్లాస్టిక్ కవర్ లో ఒక జత బట్టలు టవల్ , సోప్, ఖచ్చితంగా పెట్టుకోవాలి.(ఖచ్చితంగా విడివిడిగా పెట్టుకోవాలి) స్నానం తరువాత విడిచిన బట్టలు,టవల్ ప్లాస్టిక్ కవర్ బస్ లో మీ సీటు పైన పెట్టుకోవాలి. టెంపుల్ దగ్గరలో స్నానం చేసే బాత్ రూమ్స్ లో వేడినీళ్ళ స్నానం చేయడానికి సౌకర్యం ఉంటుంది.(హోటల్ రూం కాదు) మాతరుపున 40 మందికి అందరికి స్నానం చేయడానికి ముందుగానే అక్కడివారికి పేచేస్తాం. లేదంటే విడిగా హోటల్ రూంకు వెళ్ళి స్నానం చేయదలుచుకుంటే దగ్గరలోనే హోటల్స్ ఉంటాయి, మీరు విడిగా హోటల్ రూం వెళ్ళి స్నానం చేయదలుచుకుంటే అక్కడి హోటల్ రూం లో స్నానం చేయడానికి అదనం చార్జీలు మీరు స్వంతంగా పేచేసి స్నానం చేసి రావచ్చును.మిగితా నైట్స్ హోటల్ రూంలలోనే ఉంటాము,ఉదయమే హోటల్ రూంలలనే స్నానంచేస్తాం కాబట్టి మిగితా ఎక్కడ ప్రాబ్లంలేదు( 19 వ తేధిన నైట్ కోల్హాపూర్ లో మరియు 20,21, తేధి నైట్స్ షిర్డిలోనైట్ స్టే , 22-12 రాత్రి రిటర్న్ ట్రైన్ జర్నీలో ఉంటాము.)
7) ప్రతిరోజు ఉదయం 6గంటలకే మన యాత్ర మొదలవుతుంది.మీకు నిత్యం అవసరం ఉండే టాబ్లెట్స్,మెడిసిన్స్,ఫుడ్- స్నాక్స్ లాంటివి ఏవైనా విడిగా హ్యండ్ బ్యాగులో పెట్టుకోవాలి.లేడిస్ అంతా మనిపర్స్ విడిగా తెచ్చుకోవాలి(చాలా టెంపుల్స్ లలో హ్యండ్ బ్యాగ్స్ తో దర్శనానికి అనుమతి ఉండదు కాబట్టి ఈ జాగ్రత్త పాటించాలి.లేడిస్ చాలా చిన్న సైజు మనిపర్సు తెచ్చుకోవాలి) విడిగా తెచ్చుకునే హ్యండు బ్యాగు బస్ లోనే పెట్టి దర్శనానికి వెళుతామని గమనించగలరు.ప్రతిరోజు ఒకసారి బస్ లో లగేజి పైకి ఎక్కించాక మా లగేజి దాంట్లో ఏదో మర్చిపోయాం తీయమంటే వీలుపడదు,తిరిగి నైట్ హోటల్ రూంకు వెళ్ళాక మాత్రమే మీ లగేజి దింపబడుతుందని గమనించగలరు.
8) మీ ఆధార్ కార్డు ఒరిజినల్ (లేదా కలర్ జిరాక్స్ లామినేషన్ కాపి) +3 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి. వీలైతే వాక్సినేషన్ కాపి కూడా ఉంటే తెచ్చుకోండి.మాస్కులు, శానిటైజర్ దగ్గర పెట్టుకోంటే మంచిది.
ఇట్లు.రవీందర్. శ్రీటూర్స్-8985246542
Comment (0)