అమర్ నాధ్ యాత్ర చౌకలో ఎలా దర్శించుకోవాలి?
శ్రీటూర్స్ తరుపున ముందుగా అనౌన్స్ చేసిన అమర్ నాధ్ యాత్ర 1-7-24 ఈరోజున కేన్సిల్ చేయడం జరిగింది. కారణం కొద్దిమంది మాత్రమే బుక్ కావడం వలన.. 5 రోజుల యాత్రకు రూ.41,000 చాలా ఎక్కువ అని యాత్రికులు భావించడం కూడా మరొక కారణం…అందుకే చౌకలో అమర్ నాధ్ యాత్రకు ఎవరంతట వారు ఎలా వెళ్ళాలి అనే పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నాము. ఇంకా ఏ టూర్ ఆపరేటర్ తో సంబందం లేకుండా మీరే స్వంతంగా అమర్ నాధ్ యాత్రకు వెళ్ళవచ్చును. అందుకు వరుసగా ఈ సూచనలు పాటించండి. ధన్యవాధములతో. రవీందర్, శ్రీటూర్స్.8985246542 . Date 25-4-24
1) యాత్రకు 13 నుండి 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. యాత్ర కు వెళ్లడానికి అర్హతలు యాత్ర పూర్తి గైడ్ లైన్స్ ఈ లింక్ లో . chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://jksasb.nic.in/Yatra2024/Guidelines/Guidelines%20for%20Advance%20Registration%20for%20Yatra%202024%20V1.3.pdf
2) ఈ లింక్ లోని ఫి.డి.ఎఫ్ పైల్ సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని ఫ్రింట్ తీసుకుని ఫాం ఫిలప్ చేసి కలర్ ఫోటో అతికించి తరువాత మాత్రమే డాక్టర్ల దగ్గరకు వెళ్ళండి. యాత్ర ఫిట్ నెస్ ఫాం లింక్ chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://jksasb.nic.in/Yatra2024/Forms2024/English%20CHC.pdf
3) యాత్రకు ముందుగా హైదరాబాదులోని గాంధి,లేదా ఉస్మానియా హస్పటిల్ కు వెళ్ళి అమర్ నాధ్ యాత్ర కోసం ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కావాలని అడగండి. అక్కడ కొద్దిమంది ప్రత్యకించిన డాక్టర్స్ యాత్రకు వచ్చేవారిని 5 రకాల పరిక్షలు చేసి మీరు ఫిట్ గా ఉంటే సర్టిఫికెట్ ఇస్తారు. హైదరాబాదులోని బ్యాంకుల లిస్ట్, మరియు తెలంగాణ లోని ప్రభుత్వ ఆసుపత్రులు , డాక్టర్స్ లిస్ట్ ఈలింక్ లో చెక్ చేసుకోండి. http://chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://jksasb.nic.in/Yatra2024/List%20of%20Doctors%202024/Telangana%202024.pdf
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులు , డాక్టర్ల పేర్లతో ఉన్నవివరాల లింక్. http://chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://jksasb.nic.in/Yatra2024/List%20of%20Doctors%202024/Andhra%20Pradesh%202024%20V1.1.pdf
4) తరువాత మీరు https://jksasb.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్ళి మీరు ఏతేధిన ఏ రూట్ లో ( 2 రూట్ లు 1- బాల్తాల్, 2-పహల్ గామ్ ) అమర్ నాధ్ యాత్రకు వెలుతారు అనేది తెలియపర్చి డాక్టర్లు ఇచ్చిన ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను , మీ ఫోటోను అప్ లోడ్ లోడి ముందుగా ఫీజు పేచేసి యాత్ర పర్మిట్ తీసుకోవాలి. లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కొన్ని నియమిత బ్రాంచీలలో డైరెక్టుగా వెళ్ళి యాత్ర పర్మిట్ తీసుకోవచ్చు.. దేశం లోని అన్ని బ్యాంకుల లిస్ట్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://jksasb.nic.in/Yatra2024/Bank%20Branches%202024/List%20of%20Bank%20Branches%202024%20New%20V1.1.pdf మీ యాత్ర పర్మిట్ +3 జిరాక్స్ కాపీలు, 3 పాస్ పోర్టు సైజు పోటోలు, 3 ఆధార్ జిరాక్స్ కాపీలు యాత్రకు రెడిగా పెట్టుకోండి.యాత్రకు ఒరిజినల్ ఆధార్ కూడా తప్పక తీసుకువెళ్ళాలి.
5) యాత్రకు వెళ్ళేముందు కనీసం ఒక నెల రోజుల ముందునుండి ఖచ్చితంగా డైలి 1 గంట స్పీడ్ నడుక, ప్రాణయామ బ్రీతింగ్ ఎక్స్ ర్ సైజులు తప్పక చేయాలి. అమర్ నాధ్ దాదాపు సముద్రమట్టానికి 4 కిలోమీటోర్ల ఎత్తులో ఉన్న కారణంగా అక్కడ అక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఈ ఎక్సర్ సైజులు లేకుంటే అక్కడ చాలా ఇబ్బండి పడుతారు.
6) తరువాత బై ట్రైన్ ద్వారా మీ యాత్ర పర్మిట్ కు 3-5 రోజులు ముందుగా జమ్ము చేరుకోండి. కాచిగూడ నుండి ప్రతి బుధవారం రోజున జమ్ముకు డైరెక్టు ఎ.సి. ట్రైన్ ఉన్నది. ఒక్కరికి రూ. 2485 KACHEGUDA TO JAMMU TRAIN ( JAT HUMSAFAR -22705) కాచిగూడ లో ఉదయం 8.50 కు బయలు దేరితే మర్నాడు సాయంత్రం 6గంటలకు జమ్ము చేరుకుంటుంది.33గంటల పైన ప్రయాణం ఉంటుంది.
ఇదే ట్రైన్ రిటర్న్ లో జమ్ము నుండి సికింద్రాబాదుకు ప్రతి శుక్రవారం ఉదయం 5.45కు ఉంటుంది. మర్నాడు సాయంత్రం 6గంటలకు సికింద్రాబాదుకు చేరుకుంటాము. 36గంటల ప్రయాణం . చార్జి సేమ్…రూ.2485 (అప్ డౌన్ 33+36= 69 నుండి 72 గంటల ప్రయాణం సుమారు 3రోజులు అప్ డౌన్ ట్రైన్ ప్రయాణంలోనే గడుస్తుంది.
7) మర్నాడు జమ్ము రైల్వేస్టేషన్ లో సాయంత్రం దిగాక ఆటోవారిని పట్టుకుంటే అమర్ నాధ్ యాత్ర బేస్ కాంపుకు తీసుకువెళ్ళమంటే అక్కడే 5,6 కి.మీ.దూరంలోని బేస్ కాంపుకు చార్జీలతో తీసుకువెళుతారు.అక్కడ యాత్రకౌంటర్ లో ముందుగా రిపోర్టు చేసి మీ యాత్ర పర్మిట్ జిరాక్స్ కాపిని వారికి అందచేయండి. దాన్ని తీసుకుని వారు మీకో సీరియల్ నెంబర్ స్లిప్ ఇస్తారు. మీకో యాత్ర ఐ.డి.కార్డు ఇక్కడ ఇస్తారు. . అక్కడే బస్ కోసం మరియు అక్కడే డార్మిటరి హాల్ లో ఉండడం కోసం చార్జీలు పేచేయండి. తరువాత వారు కొన్ని బస్ లను మర్నాడు లేదా ఆ మర్నాడు యాత్ర బస్ లను 2 రూట్ లలో గ్రూప్ ఆఫ్ వెహికిల్స్+బస్ లతో నడిపిస్తారు. మీయాత్ర పర్మిట్ బాల్తాల్ రూట్ లేదా పహల్ గామ్ రూట్ ఏ ప్రకారంగా యాత్ర పర్మిట్ తీసుకుంటే ఆప్రకారంగా బస్ లలో కూర్చోవాలి. జమ్ము నుండి పహల్ గామ్ లేదా బాల్తాల్ బేస్ కాంపులకు డైరెక్టుగా ఈ బస్ లను గ్రూపుగా పంపిస్తారు. చేరుకోవడానికి మాములుగా ఒక రోజు పడుతుంది. యాత్రలో మద్య మద్యలో భక్తులు కల్పించిన భండార్ లలో ఉచిత టీ,టిఫిన్స్,భోజనాలు లభిస్తాయి.
8) మీ యాత్ర పర్మిట్ ప్రకారం బాల్తాల్ లేదా పహల్ గామ్ బేస్ కాంపులో రిపోర్టు చేసాక ఇక్కడ అక్కడినుండి నడక లేదా గుర్రం, లేదా డోలి లేదా హెలికాప్టర్ (ముందుగా మీరు హెలికాప్టర్ బుక్ చేసుకుని ఉంటే ఆప్రకారంగా) ద్వారా అమర్ నాధ్ యాత్ర మొదలుపెడుతారు. బాల్తాల్ రూట్ శ్రీనగర్ దాటాక సోనమార్గ్ దగ్గర దగ్గరి దారిలో 16 కిలోమీటర్లే ఉంటుంది. అదే పహల్ గామ్ రూట్ లో 32 కిలోమీటర్లు ఉంటుంది. పరమేశ్వరుడు ఇదే దారిలో అన్ని వదిలేసి అమర్ నాధ్ చేరుకున్నాడని ఈ సాంప్రదాయ దారిలో వెళ్ళడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీరు హెలికాప్టర్ ల ఏ రూట్ లో వెళ్ళిన కూడా పంచతరణి వరకే హెలికాప్టర్ లో వెళ్ళగలరు. మళ్ళి అక్కడ దిగి 5 కిలోమీటర్లు నడుక లేదా గుర్రాల ద్వార అమర్ నాధ్ గుహ చేరుకోవాలి. గుర్రాలు గుహకు 1 కిలోమీటర్ ముందే ఆగుతాయి. అక్కడినుండి గుహవరకు వెళ్ళలేకుంటే తిరిగి అక్కడ 1 కిలోమీటర్ కు కూడా డోలీలు తీసుకోవాలి.
9)ఇంతటితో మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అమరనాధుని మంచు శివలింగ దర్శనం పూర్తవుతుంది. యాత్రలో ఇన్ని రోజులుగా మీరు పడ్డకష్టం అంతా తీరిపోతుంది. దర్శనం అయ్యాక గుహలో పరమేశ్వరుడి ద్వార పార్వతిదేవికి చెప్పినప్పడు అమర కథ విని అమరులుగా ఉన్న జంటపావురాలను ఓపిగ్గా కపపడే వరకు వెదకండి. మీకు అద్రుష్టం ఉంటే ఆ జంటపావురాలు కనపడుతాయి.
10) దర్శనం అయ్యాక రిటర్న్ హెలికాప్టర్, డోలీలు, గుర్రాల ద్వార రిటర్న్ ప్రయాణం మొదలుపెట్టండి. తిరిగి బల్తాల్, పహల్ గామ్ లలోని బేస్ కాంపులకు చేరుకుని అక్కడ రిపోర్టు చేసి రిటర్న్ బస్సుల ద్వార తిరిగి జమ్ము చేరకుని రిటర్న్ ట్రైన్ లో ప్రయాణం కావాలి. ప్రతి శుక్రవారం జమ్మునుండి రిటర్న్ ట్రైన్ ఉన్నది.
11) యాత్ర మొత్తంలో అసలు కిటుకు మొత్తం ఇక్కడే ఉన్నది. మిరు రిటర్న్ ట్రైన్ కు రిజర్వ్ చేసుకుని ఉంటారు. కాని ఆటైంకల్లా రిటర్న్ చేరుకుంటారా లేదా అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జమ్ము టూ శ్రీనగర్ దారి మొత్తం ఎత్తైన కొండల గుండా ఘాట్ రోడ్ ప్రయాణం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కొండచరియలు విరిగిపడి, రోడ్లు బ్లాక్ అయ్యి యాత్ర ఎన్ని రోజుల్లో పూర్తయ్యి రిటర్న్ వచ్చేది తెిలియదు. ఆలస్యంగా రిటర్న్ వస్తే ట్రైన్ రిజర్వేషన్ దొరకదు. అందుకే వారం తరువాతే రిటర్న్ రిజర్వేషన్ పెట్టుకోండి. అక్కడ 7రోజులు + ట్రైన్ లో ప్రయాణం 3రోజులు మొత్తం 10 రోజులు గడుస్తుంది. మీరు ఇంత ప్రయాణం చేసి వెళ్ళిన కేవలం అమర్ నాధ యాత్ర మాత్రమే పూర్తి చేస్తారు తప్ప అక్కడ కాశ్మీర్ లో ఉండే అందమైన గుల్ మార్గ్ కాని శ్రీనగర్ లోని దాల్ లేక్, కీర్ భవానిటెంపుల్, శంకరాచార్య టెంపుల్ లాంటివి ఏది చూడలేరు. మద్యలో మిమ్మల్ని బస్ నుండి దిగనివ్వరు. జమ్ము బేస్ క్యాంపు నుండి డైరెక్టుగా బాల్తల్ లేదా పహల్ గాం బేస్ కాంపులకు మళ్ళి తిరిగి అక్కడినుండి రిటర్న్ జమ్ము బేస్ కాంపుకు మాత్రమే బస్ నుండి దిగకుండా వెళ్ళాలి. కాశ్మీర్ లో మిగితా చూద్దం అనుకుంటే వీలుపడదు.మరోసారి వెళ్ళల్సిందే.
12) లేదా శ్రీనగర్ కు డైరెక్టుగా ఫ్లైట్ ద్వారా వెళ్లి డైరెక్టుగా టాక్సి మాట్లాడుకుని ఐనా అమర్ నాధ్ యాత్ర పూర్తి చేయవచ్చును. హైదరాబాదు నుండి శ్రీనగర్ కు అప్ డౌన్ ఫ్లైట్ చార్జి సుమారు రూ.24,000 ఉంది. ఇంకా అక్కడ దిగాక టాక్సి చార్జీలు , హోటల్ రూం చార్జీలు , ఫుడ్ చార్జీలు అన్ని అదనం. శ్రీటూర్స్ ద్వారా అమర్ నాధ్ యాత్ర 2022లో పెట్టినప్పుడు వెళ్ళేప్పడు ట్రైన్ రిటర్న్ టో శ్రీనగర్ నుండి ఫ్లైట్ ద్వారా రూ.35000 యాత్ర ప్యాకేజిగా పెట్టడం జరిగింది. (విత్ ఆగ్రా,డిల్లి,అమ్రుత్సర్,జ్వాలముఖి,వైష్ణోదేవి,గుల్ మార్గ్,శ్రీనగర్,బాల్తాల్ నుండి అమర్ నాధ్ కు(పంచతరణివరకు) బై హెలికాప్టర్ ద్వారా వెళ్ళాము.ఈ యాత్ర తేధికి 2 రోజుల ముందు వరకు కూడా జమ్ము టూ శ్రీనగర్ రోడ్ వర్షాల కారణంగా రోడ్స్ బ్లాక్ అయ్యి 5,6 రోజులు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. (యాత్రలో ఎప్పుడు వాటర్ బాటిల్స్,ఫుడ్ ఐటంస్ స్పేర్ లో పెట్టుకోండి)జమ్ము టూ శ్రీనగర్ బై రోడ్ రూట్ లో ఇదే అతి పెద్ద ఇబ్బంది, అమర్ నాధ్ యాత్ర కాదుగదా రోడ్ల జామ్ లో ఇరుక్కుంటే శ్రీనగర్ లో రిటర్న్ ఫ్లైట్ కు అందుకుంటామా లేదా అనేదే పెద్ద టెన్షన్ ఉంటుంది. అందుకే 2023లో డైరెక్టుగా హైదరాబాదు టూ శ్రీనగర్ డైౌరెక్ట్ ఫ్లైట్ పెట్టి అమర్ నాధ్ యాత్ర పెట్టాం కేవలం 13గురు యాత్రికులు మాత్రమే వచ్చారు.
13) హైదరాబాదు టూ శ్రీనగర్ అప్ డౌన్ ఫ్లైట్ చార్జీలే రూ.25000 అవుతుంటే యాత్ర ప్యాకేజి హోటల్ రూంలు, ఫుడ్, వెహికిల్,గుల్ మార్గ్,శ్రీనగర్ పర్యటనలతో సహా 5 రోజుల యాత్రకు రూ.41000 ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ఇది ఎక్కవని యాత్రికులు భావించడంతో ఈ సారి అంతకంటే కూడా చాలా తక్కువగా బుక్ అయ్యారు కాబట్టే ఈ సంవత్సరం అమర్ నాధ్ యాత్రను కేన్సిల్ చేసాము. 4గురు యాత్రికులు వచ్చిన 40మంది యాత్రికులు వచ్చిన టూర్ ఆపరేటర్ మాతోమపాటే అన్ని ఖర్చులు ఫ్లైట్ చార్జీలు , హోటల్ రూంల చార్జీలు పెట్టుకోవాలని మర్చిపోకండి.
14) యాత్ర ఖర్చు ఎక్కువయిన పర్వాలేదు హైదరాబాదు టూ శ్రీనగర్ ఫ్లైట్ ద్వారానే వెళ్ళోస్తాం అనే వారు హైదరాబాదులోని ఆర్.వి.టూర్స్ వారి ఫ్లైట్ ప్యాకేజిలో వెళ్ళి రావచ్చు. ఒక్కరికి రూ.60,000.వివరాలు దిగువన.
15) ఈ ఆర్టికల్ మీకు లేదా మీ స్నేహితులు, బంధువులు , తెలిసిన వారు ఎవరు వెలుతున్నా అమర్ నాధ్ యాత్రకు సంబందించిన ఈ పూర్తి సమాచారాన్ని , ఈ లింక్ ను వారికి వాట్సప్ లో షేర్ చేయండి. అమర్ నాధ్ యాత్ర మీకు శుభంగా జరుగాలని కోరకుంటూ ఆ పరమేశ్వరున్ని ప్రార్థిస్థున్నాను. దన్యవాధములతో ,రవీందర్,శ్రీటూర్స్. 8985246542.
శ్రీటూర్స్ ద్వార నిర్హహించే అన్ని యాత్రల సమచారం కోసం మా వెబ్ సైట్ హోంపేజి మీద క్లిక్ చేసి , https://shreetours.in/ తరువాత ఆయా యాత్ర ల మీద క్లిక్ చేయండి , ఆ యా యాత్రల పూర్తి వివరాలు మీకు అక్కడ లబిస్తాయి. https://shreetours.in/.
Comment (0)