Biggest Update Information for Train Journeys …Ravinder, Shree Tours.8985246542 

       పుణ్యక్షేత్రాల యాత్రలకు హైదరాబాదు నుండి ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు చుట్టుపక్కల రాష్ట్రాలైతే ట్రైన్ ద్వార దేశంలో బహు  దూరంగా  ఉన్న రాష్ట్రాలైతే ఫ్లైట్ ద్వార యాత్రలకు వెళుతుంటాం.కాని రైల్వేమంత్రిత్వ శాఖ 1నవంబర్ -2024 నుండి ట్రైన్ రిజర్వేషన్ లో మార్పులు చేసింది. అంతక్రితం ఏ ట్రైన్ లోనైనా రాబోయే 4 నెలలవరకు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. దాన్ననవంబర్ 1 నుండి 2 నెలల సమయానికి కుదించారు.4 నెలలవరకు రిజర్వేషన్  ఉన్నప్పడు ఎవరికి ఎలా సౌకర్యంగా అలా అన్ని నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకునేవారు.రిజర్వేషన్స్ చేసుకునేప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు.కాని రైల్వేరిజర్వేషన్స్ చేసుకున్నాక చాలాసార్లు యాత్రికులు రిజర్వేషన్స్ కేన్సిల్ చేసుకుంటున్నారు(కేన్సిలేషన్స్ ఎక్కువ ఉంటే రైల్వే మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కేన్సిల్ చార్జీలు రిఫండ్ చేయడం, వేయిటింగ్ లిస్ట్ ను అప్ డేట్ చేయడం  తదితర ఎన్నో) అని రైల్వే మంత్రిత్వశాఖ ఈ టైంను 2 నెలలకు కుదించింది. దాంతో రైల్వేలో మాములుగా ప్రయాణాలకు వెళ్ళేవారికి,యాత్రలకు వెళ్ళేవారికి వచ్చిన అతి పెద్ద ఇబ్బంది ఏమంటే 2నెలల స్లాట్ ఓపెన్ అయ్యింది అయినట్లుగా వెంటనే ట్రైన్ లో రిజర్వేషన్ష్ పూర్తి అవుతున్నాయి. ఉదా.ఈరోజు తేది 10-1-25..  రెండు నెలల వరకు రిజర్వేషన్ చేసుకోవచ్చు అంటే 10-3-25 తేది వరకు ఈ రోజు బుక్ చేసుకోవచ్చును. కాని 10-3-25 స్లాట్ ఓపెన్ అయిన వారంలోగానే అంటే వచ్చే వారం 17-1-25లోగానే చాలవరకు ట్రైన్ టికెట్స్ అన్ని రిజర్వేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి.

     యాత్ర 3నెలల ముందుగా పెడితే అబ్బో చాలా టైం ఉంది అని యాత్రికులు రిజర్వ్ చేసుకోవడం లేదు.కనీసం 2 నెలల ముందుగా కూడా రిజర్వ్ చేసుకోక పోవడంతో ట్రైన్స్ కు రిజర్వేషన్  దొరకడం లేదు. ఉదా.జనవరి 5 న కర్ణాటక యాత్ర ఎప్పుడో 2 నెలల క్రితం పెట్టాం.వారంరోజుల్లో నే ట్రైన్ రిజర్వేషన్ష్ పూర్తి అయ్యింది.ఆలోగా 6గురే బుక్ కావడంతో యాత్రను కేన్సిల్ చేసి తిరిగి ఫిబ్రవరి 16న పెట్టాం. పిభ్రవరి 16 కు కూడా రిజర్వేషన్స్ చివరి కొన్ని సీట్లే మిగలడంతో కర్ణాటక యాత్రకు నిన్న(9-1-25) చివరి తేధి అని పెట్టాం.దాంతో నిన్న ఇద్దరు బుక్ చేసుకున్నారు.అడ్వాన్సు పంపారు.కాని ట్రైన్ లో లోయర్ బెర్త్ లు లేవని చెప్పడంతో తిరిగి అమౌంట్ రిఫండ్ తీసుకున్నారు.ట్రైన్ లో ఉన్నవే 4,5 బెర్త్ లు అయితే చివరి సమయంలో కూడా ట్రైన్ లో లోయర్ బెర్త్ లు దొరకుతాయా అని యాత్రికులు దయచేసి ఆలోచించగలరు. యాత్ర అనౌన్స్ చేసిన 3,4 రోజుల వరకు  బుక్ చేసుకుంటే మాత్రమే లోయర్ బెర్త్ లు దొరికే అవకాశం ఉంటుంది.మార్చి 8వ తేధి తమిళనాడు యాత్ర మొన్న 2 రోజుల క్రితం పెట్టాం. ఈ రెండు మూడు రోజుల్లో బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్ లు దొరకుతాయి.అలా కాకుండా చివరి వరకు వేయిట్ చేసి లాస్ట్ మూమెంట్ లో మాకు ట్రైన్ లో లోయర్ బెర్త్ లు కావాలంటే ఎప్పుడు సాధ్యం కాదు. లేదంటే చాలసార్లు మాకు అనుభవం అయ్యే విషయం ఏమంటే ట్రైన్ రిజర్వేషన్లు ఇక బెర్త్ లు ఈ రోజు దాటితే దొరకవు అని గ్రూపులో మెసేజ్ పెట్టినప్పడు కూడా స్పందించకుండా యాత్రకు వారం ముందగా ఇంకా ఏమైనా సీట్లు ఉన్నాయా మేము వస్తాం అని అడుగుతారు. టూర్ అంటే కనీసం నెల రోజుల పైనే ముందుగా ట్రైన్,ఫ్లైట్ రిజర్వేషన్స్ అన్ని పూర్తయ్యి ఇంతటితో ఇంతమంది వస్తున్నారని ఫైనలైజ్ అయ్యి, యాత్రకు ఎంతమంది వస్తే అన్ని సీట్ల వెహికిల్,హోటల్ రూంలు రిజర్వ్ చేసుకుని ఉంటాం.వారం ముందు యాత్రకు వస్తాం అంటే వెహికిల్ లో సీట్లు స్పాట్లో పెరగవు,ఎక్కువ సీట్లు ఉన్న వెహికిల్ దొరకదు,
హోటల్ రూంలు కూడా అప్పటికప్పడు దొరకవు ,ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టే ఏ యాత్రకైనా ఏనాటికైనా కనీసం 1నెల,2 నెలలపైబడి ముందుగా రిజర్వేషన్ చేస్తేనే దొరుకుతుంది అని దయచేసి గమనించగలరు.

*****సమయం సందర్భం వచ్చింది కాబట్టి లోయర్ బెర్త్ ల గురించి వివరంగా ఇక్కడ చెప్తాను.మా పర్సనల్ ఐ.డిల మీద ఆన్ లైన్ లో సీనియర్స్ కు లోయర్ బెర్త్ లు బుక్ చేయవచ్చు, కాని ఎన్ని ఎక్కువలో ఎక్కవ ఒక నెలలో 12-16 మందివరకు మాగ్జిమం.మిగితా రిజర్వేషన్స్ అన్ని రైల్వేరిజిర్వేషన్ సెంటర్ కు వెళ్ళి మాత్రమే చేయాలి. యాత్రలకు వచ్చేవారు మాగ్జిమం సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సీనియర్ కోటాలో బుక్ చేయాలంటే ఇద్దరి పేర్ల మించి ఒక ఫాంలో ఫిల్ చేయరాదు(ఆఫ్ లైన్ లో రిజర్వేషన్ సెంటర్స్ లోనైనా , ఆన్ లైన్ లో ఐనా సరే ఒక బుకింగ్ లో ఇద్దరిని మించి ఎట్టి పరిస్థితుల్లోను బుక్ చేయడం వీలుపడదు.ఒకే ఫాంలో 6 గురి పేరు రాస్తే,అందరు 70,80 ఏండ్ల వయసున్నా కూడా అందరికి కూడా అప్పర్ బెర్త్ లే దొరకవచ్చు. అరే అందరి వయసు 70,80 ఏండ్లు ఉన్నాయి అప్పర్ బెర్త్ లు ఎలా వస్తాయి అని ఆశ్చర్యపోయే,లేదా గొడవపడితేనే లాభం లేదు. సీనియర్ కోటా లో లోయర్ బెర్త్ లు రావలంటే ఆన్ లైన్ లో లేదా రిజర్వేషన్ సెంటర్ లో రిజర్వేషన్ ఫాంలో ఖచ్చితంగా ఇద్దరి పేర్లు  రాసి మాత్రమే బుక్ చేయాలి. 3వ పేరు రాసిన కూడా సీనియర్ కోటా వర్తించదు.ఇది లెక్క..

ఈ లెక్కన అస్సాం కామాఖ్య,ఒరిస్సా యాత్రలో 5,6 ట్రైన్స్ 40 మంది యాత్రికులం వెళుతున్నాం అనుకుంటే దాంట్లో దాదాపు 30 మంది సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా ఉంటారు.అలెక్కన 30 మందికి 15 ఫాంలలో ఇద్దరి పేర్లు రాస్తే మాత్రమే లోయర్ బెర్త్ వస్తుంది.ఆలెక్కన  5 ట్రైన్స్ లో 15×5=75 ఫాంల లలో ఇద్దరి పేర్ల చొప్పన రాయాలి. రిజర్వేషన్ సెంటర్ లలో 1 ఫాం లేదా రిక్వెస్ట్ చేస్తే 2 ఫాంల మించి ఒకసారి రిజర్వేషన్ చేయరు.ఆవి రిజర్వేషన్  పూర్తయిన తరువాత మళ్ళి లైన్ లో వెనక్కి వెళ్ళి నిలబడితే మళ్ళి కౌంటర్ దగ్గరకు రావడానికి 1గంట పడుతుంది సుమారుగా ఆలెక్కన 75 ఫాంలు బుక్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో మీరే సుమారుగా లెక్కవేసుకొండి. కాబట్టి సినియర్ సిటిజన్స్ అందరికి లోయర్ బెర్త్ లు బుక్ చేయడం గ్రూపు యాత్రల్లో అసాధ్యం…ఆన్ లైన్ లో బుక్ చేసేప్పుడు 2 పేర్లు రాసిన లేదా 6మంది పేర్లు రాసిన 1 టికెట్ బుకింగ్ లోకి వస్తుంది.నెలకు 24 టికెట్స్ మాత్రమే ఒక యుసర్ ఐ.డి.పేరు మీదుగా ఉంటాయి. ఆలెక్కన కూడా టికెట్ కు ఇద్దరు చొప్పునే బుక్ చేయడం అసలు వీలుపడదు. మేము సాధారణంగా సికింద్రాబాదుకు వెళ్ళి గ్రూపు రిజర్వేషన్ చేస్తుంటాము.గ్రూపు రిజర్వేషన్ లో ఎవరికి ఏ బెర్త్ వచ్చేది కౌంటర్ లో ఉన్న రిజర్వేషన్ చేసే వ్యక్తికి కూడా ముందుగా తెలియదు.కంప్యూటర్ సాఫ్ట్ వేరే ఆ భోగిలో అల్రెడి బుక్ అయిన బెర్త్ లను వదిలేసి వరుసగా రిజర్వేషన్ చేస్తు పోతుంది. అప్పుడు 80 ఏళ్ల వయసున్న వారికి అప్పర్ బెర్త్ , 15 ఏళ్ళ వయసు ఉన్నవారికి లోయర్ బెర్త్ కూడా దొరకవచ్చును. అందుకే మేము వీలైనంతగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ఏజ్ ఎక్కువగా ఉంటే ఆన్ లైన్ సీనియర్ కోటాలో అన్ లైన్ లోనే లోయర్ బెర్త్ లు బుక్ చేస్తుంటాము.మిగితా వారికి 6మందికి ఒక టికెట్  చొప్పున మిగితా వారికి టికెట్స్ బుక్ చేస్తుంటాము.ఆలస్యంగా బుక్ చేసుకున్నప్పడు ఎట్లాగు అసలు ట్రైన్ లోనే లోయర్ బెర్త్ లు ఉండవు.అలాంటప్పుడు ఇక ఏరకంగా లోయర్ బెర్త్ లు దొరకుతాయి.

ఇందుకు మరొక పరిష్కారం ముందుగా యాత్రకు అడ్వాన్సు పేచేసాక మీకు అప్ డౌన్ ట్రైన్ వివరాలు పంపిస్తాము.మీరు రిజర్వేషన్ సెంటర్ కు వెళ్ళి స్వయంగా లోయర్ బెర్తులు (అందుబాటులో ఉంటే) బుక్ చేసుకోవచ్చు. లేదా https://www.irctc.co.in/ వెబ్ సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఈ మేయిల్ ఐడితో మీరే ఒక అకౌంట్ ను స్వంతంగా బుక్ చేసుకుని స్వయంగా మీరే టికెట్ బుక్ చేసుకోవడం…  లేదా మేము బుక్ చేసినట్లు రావడమే పరిష్కారం తప్ప మాకు ఇంత ఏజ్ ఉంది బుక్ చేసినవాడికి లోయర్ బెర్త్ లు ఇవ్వాలని తెలియదా అని గొడవలు పెట్టుకుంటే ఏ లాభం లేదు(గతంలో ఇలాంటి అవగాహన రాహిత్యంతో పెట్టుకున్న గొడవలు జరిగాయి కాబట్టే ఇంత లోతుగా వివరించి రాస్తున్నాను.)  

** సీనియర్ సిటిజన్స్ కన్షీషన్ రేటు గురించి**-  కరోనా సమయం నుండి మొత్తానికే సీనియర్ సిటిజన్ కన్షీషన్ తీసివేసారు.కరోనాకంటే ముందు వచ్చిన యాత్రికులతో ఇదో పెద్ద వాగ్వాదంగా ఉండేది , మేము సీనియర్స్ మాకు కన్సీషన్ వస్తుంది అని. మీకు కన్షిషన్ వస్తుంది అని మీతోపాటు మాకు కూడా తెలుసు.యాత్రకు వచ్చేవారు 70శాతం సినియర్స్ కాబట్టి ఆ వచ్చే కన్షీషన్ కూడా లెక్కలోకి వేసుకునే యాత్ర ప్యాకేజి ప్రైస్ పెట్టడం జరుగుతుంది.అంతే తప్ప చాలమంది అపోహా పడ్డట్లు టూర్ అపరేటర్లు సినియర్స్ సిటిజన్స్ కు వచ్చే కమీషన్ ను తీసుకోవడంగా అర్థం చేసుకునేవారు.(మేము కావలంటే టూర్ ప్రైస్ ఎక్కువ పెట్టి సినియర్స్ వస్తే మీకు ఉన్న కన్షిషన్ ఇంత రిటర్న్ వస్తుంది అని చెప్పవచ్చు కూడా.అలా చెప్పక పోవడానికి ఏకైక కారణం టూర్ ప్రైస్ తక్కువ పెడితె మాత్రమే అందరికి అట్రాక్షన్ ప్రైస్ గా కనపడుతుంది చాలమంది వస్తారు అనే ఏకైక కారణం మాత్రమే) మీరు వ్యక్తిగతంగా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మాత్రమే సినియర్స్ కన్షిషన్ అది కూడా కరోనా కంటే ముందు కాలంలో వర్తించేది.ఇప్పుడు మొత్తానికే ఆ కన్సీషన్ తీసివేసారు కాబట్టి ఏ అపోహా లేదు.

**మరొక అతిముఖ్యమైన విషయం…మీరు ఏయాత్రకు బుక్ చేసుకున్న కూడా కనీసం 10మంది అడ్వాన్స్ పేచేసాకమాత్రమే ట్రైన్ అండ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం.ఆతరువాత ఎలాగు యాత్రికులు పెరుగుతారులే అనే ఉద్దేశ్యంతో.మీరు ఎప్పుడు అడ్వాన్స్ పేచేసిన కనీసం వారం తరువాతే టికెట్స్ బుక్ చేయడం వెనుక ఉన్న ఉద్ధేశ్యం ఇదే. ఒక్కోసారి నలుగురు,ఐదుగురు మాత్రమే బుక్ అవుతారు.40 మందితో ప్లాన్ చేసిన బడ్జెట్ తో 4గురు వెళితే యాత్ర ఖర్చు ఒక్కోక్కరికి డబుల్ అవుతుంది.అందుకే తక్కువ మంది బుక్ అయినప్పుడు యాత్రలు పోస్ట్ పోన్ చేసి తరువాత డేట్స్కు ఒక్కసారి ఈ ఒక్క కారణంతోమాత్రమే మారుస్తుంటాము.ఆ కొత్త తదనంతరం  తేది యాత్రికులకు వీలుపడకుంటే వారు పేచేసిన అడ్వాన్స్ ఫుల్ అమౌంట్ రిఫండ్ పంపిస్తాము.ఒక్కసారి ట్రైన్,బస్,లేదా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసామంటేనే అర్థం యాత్రలో వెహికిల్,హోటల్ రూంస్ తో సహా అన్ని బుక్ చేసామని అర్థం.ఒకసారి ట్రైన్,బస్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాక అడ్వాన్స్ గా పేచేసిన అమౌంట్ క్లియర్ గా అది నాన్ రిఫండబుల్ అమౌంట్ మాత్రమే. యాత్రకు రాకుంటే మీరు పేచేసిన అడ్వాన్స్ మీరు లాస్ కావడం కాదు,మిగితా అమౌంట్ మీరు పేచేయాల్సింది పేచేయకుంటే ఆ అమౌంట్ మేము లాస్ అవుతాము అని గమనించగలరు.

**టిప్** ట్రైన్ లో ఏ ప్రయాణంలో ఏ  బెర్త్ దొరికినా కూడా ట్రైన్ లో కూర్చున్నాక చుట్టుపక్కల వారితో కొంచెం పరిచయం పెంచుకుని, యంగ్ ఏజ్ వారు కనపడితే వారికి పది,ఇరువై ఖర్చుపెట్టి చాయ్,బిస్కెట్ తినిపించి రాత్రిపడుకునేప్పుడు..నాది అప్పర్ బెర్త్ .. కొంచెం పైకి ఎక్కుబాబు అమ్మా..అంటే దాదాపు నో అనే వారు ఎవరు ఉండరు..మీ భవిష్యత్తు ట్రైన్ ప్రయాణాల్లో ఈ కిటుకుని ఉపయోగించి చూడండి….

దన్యవాధములతో.రవీందర్.శ్రీటూర్స్.8985246542

ట్రైన్ రిజర్వేషన్ సంబందితంగా  అందరి అపోహాలను దూరం చేసే   యూస్ ఫుల్ లింక్స్.

https://www.ixigo.com/what-are-the-different-quotas-story-1183533