నేపాల్ యాత్ర సూచనలు.. నేపాల్ లో ముక్తినాధ్ 3000 మీటర్ల పైన మంచు కొండల దగ్గర ఉంటుంది,మనకు ముక్తినాధ్ లో మనం వెళ్ళే తేదికి మంచు కనపడుతుంది. చల్లటి వాత వరణం తట్టుకోవడానికి ప్రిపరేషన్ గా ప్రతిరోజు అందరు ఖచ్చితంగా చెమట వచ్చేలా 1గంట స్పీడ్ వాకింగ్ చేయండి. ఊపిరితిత్తులు క్లీన్ గా ,శ్వాస ఫ్రీగా ఉండడం కోసం అందరు బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయండి. https://www.youtube.com/watch?v=-H0QaRCs2CQ , అలాగే యాత్రకు వచ్చేటప్పుడు కర్పూరం, దూది వెంట తెచ్చుకోండి. యాత్ర మొత్తంలో ముక్తినాధ్ దగ్గర చల్లగా ఉంటుంది.ముక్తినాధ్ అంటే జీవిత ముక్తిని ప్రసాదించే విష్ణుమూర్తి- నారాయణుడి టెంపుల్. టెంపుల్ వెనుక భాగంలో 108 దివ్య జలదారాల్లో వేగంగా నడుస్తు స్నానం చేస్తుంటారు. నీళ్ళు చల్లగా ఉంటాయి.అలాగే టెంపుల్ ఎదురుగా రెండు నీటి కుండాలు ఉంటాయి.ఒకటి పాప కుండం,మరొకటి పాపకుండం వీటిల్లో కూడా మునిగి బయటకు వస్తారు. దానికి సంబంధించిన వీడియోలు దిగువన జాగ్రత్తగా చూడండి. బట్టలు,స్నానం చేస్తే బెటర్.అందుకు ఉదయం పూట ఇంట్లో కూడా చన్నీళ్ళ స్నానం ఇప్పటి నుండే సాధన చేయండి. మీరు 108 దీవ్య జలధరాల్లో,పాప,పుణ్య కుండాల్లో స్నానం ఆసక్తి,చలిని తట్టుకోగలిగేవారు మాత్రమే చేయండి.లేదంటే కేవలం ముక్తినాధ్ టెంపుల్ లో విష్ణుమూర్తిని దర్శించుకున్న చాలు.

నేపాల్ యాత్ర సూచనలు..May9th-2025 నేపాల్ యాత్రకు స్వాగతం.అందరు ఆరోజు మార్చి 9th ఉదయం 6.15 గంటలకల్లా హైదరాబాదు ఏయిర్ పోర్టుకు చేరుకోవాలి. 8.20కు ఫ్లైట్ .అంతా ఇంటి దగ్గర స్నానం చేసే బయలుదేరి రావాలి. కాశిలో విడిగా మళ్ళి హోటల్ రూంలో స్నానం లేదు.కాశిలో నైట్ ఉండము.మొదటిరోజు నైట్ గోరక్ పూర్ లో ఉంటాము. కాశికి వెళ్ళాక ఆసక్తి ఉన్నవారు వారు గంగా నధిలో స్నానం చేయవచ్చును.. అంతా 6జతల బట్టలు పెట్టుకోండి.చలికి రక్షణగా స్వెట్టర్ష్,హండ్ గ్లోవ్స్,మఫ్లర్ లాంటివి తెచ్చుకోండి( యాత్ర మొత్తంలో ముక్తినాధ్ ఒక్క దగ్గరే చలి ఉంటుంది). 13 సీటర్ లేదా మెంబర్స్ పెరిగితే 17 సీటర్ టెంపో ట్రావెలర్ వస్తుంది.లగేజి డైలి టెంపో ట్రావెలర్ పైన ఎక్కిస్తారు. కాశిలో ఏయిర్ పోర్టులో దిగినదగ్గరనుండి తిరిగి అయోద్యలో ఫ్లైట్ ఎక్కేవరకు నేపాల్ యాత్రతో సహా మొత్తం యాత్ర ఒకే వెహికిల్ టెంపో ట్రావెలర్ ఉంటుంది. కాని పోక్రానుండి ముక్తినాధ్ వెళ్ళిరావడానికి 2 రోజులకు మాత్రం అక్కడ వేరే లోకల్ వెహికిల్ లో వెళ్ళి వస్తాం. డైలి నైట్ స్టే ఉంటుంది.ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఫుల్ సైజుది తప్పక తెచ్చుకోండి(కలర్ ప్రింట్ తీసి లామినేట్ చేసిన ఆధార్ కార్డులు,హఫ్ సైట్ పి.వి.సి.కార్డులు కాకుండా ఒరిజినల్ ఫుల్ సైజు ఆధార్ కార్డ్సు+6 ఆధార్ జిరాక్స్ కాపీలు తెచ్చుకోండి.

భోజనం* డైలి మధ్యహ్నం భోజనం మాత్రం హైదరాబాదు నుండి తెచ్చే రైస్ కుక్కర్ లో రైస్,కర్రీ,పెరుగు,పచ్చడి తో ఉంటుంది.(విడిగా మీ ఇష్టమైన చిన్న పచ్చడి సీసా తెచ్చుకోండి) డైలి మద్యహ్నం లంచ్ తో పాటు మాత్రమే మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. మిగితా సమయాల్లో మీరే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. ఉదయం టిఫిన్,టీ బయట హోటల్స్ లలో, సాయంత్రం టీ,రాత్రికి ఏదైన అల్పాహారం -రోటి చపాతి లాంటివి ఉంటాయి,

*పెండింగ్ బ్యాలెన్స్ అందరు క్యాష్ గానే పేచేయవలెను.పెండింగ్ బ్యాలెన్స్ కాకుండా అంతా రూ.10000 అదనంగా క్యాష్ పెట్టుకోండి.(నేపాల్ ముక్తినాధ్ పర్మిట్ రూ.1000+మనోకామన 4 కీ.మీ. రోప్ వే అప్ డౌన్ రూ.700+డ్రైవర్ టిప్ రూ.100=రూ.1800 ఒక్కరికి చొప్పున అదనంగా పేచేయాలి) నేపాల్ లో మన గూగుల్ పే,ఫోన్ పేలు నడవవు. అలాగే మన ఫోన్స్, మన సిమ్ లు నడవవు.అదనంగా మీ ఫోన్ సిమ్ సర్వీస్ ప్రోవైడర్ ను బట్టి ఇం టర్నేషనల్ నేపాల్ రోమింగ్ ప్యాకేజి కాని అక్కడ లోకల్ నేపాల్ సిమ్(రూ.300)సి మ్ కాని తీసుకోవాలి. అప్పుడే మీ ఫోన్స్ అక్కడ పనిచేస్తాయి. (ఉదా .జియో ప్రిపేయిడ్ సిమ్ నేపాల్ రోమింగ్ కు 2వారాలకు రూ.1400 ఉంది. Airtel rs.900, వేరే నెట్ వర్క్ లో తక్కువగా ఉండవచ్చును. మనం నేపాల్ లో సొనౌలి బార్డర్ లో ఎంటర్ కాగానే అక్కడి నేపాల్ సిమ్ లను మనం ఆధార్ కార్డుతో తీసుకోవచ్చు.రూ.300 కు వారం వ్యవధితో లబిస్తాయి.అక్కడి సిమ్ ఇంటర్ నెట్ వాడుకుని వాట్సప్ కాల్స్ ను ఉపయోగించి కాల్స్ వాడవచ్చును. ఏ అప్షన్ అనేది మీ చాయిస్ …

  • కరెన్సి* మన రూ 500 నోటు,రూ.100 నోటు అక్కడ అంతటా నడుస్తాయి , ఎవరైనా ఒక్కరు మాత్రం రూ.100 నోట్ల కట్ట రూ.10000 కు తెండి.(మనోకామన రోప్ వే ఎంట్రన్స్ కు రూ.100 నోటు మాత్రమే నడుస్తుంది) ఇండియన్ రూపి=1.6 నేపాలి రుపాయాలు. 1వందకు రూ.160, Indian Rs.1000= Nepali Rs.1600. అలా అని అక్కడ చీప్ అనుకోకండి మనదగ్గరికంటే అన్ని అక్కడ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి,అన్ని ఇండియానుండే ఎక్కువగా వెళుతాయి కాబట్టి.టూరిస్ట్ సెంటర్స్ లలో మాగ్జిమం మన ఇండియన్ కరెన్సి అంతటా తీసుకుంటారు.డైలి స్పీడ్ వాకింగ్,ప్రాణాయమ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయండి. ముక్తినాధ్ లో ప్లాస్టిక్ షూస్,ఫ్లాస్టిక్ చెప్పులు లాంటివి వాడండి.బ్యాగులో అదనంగా 4,5 ప్లాస్టిక్ కవర్స్ పెట్టుకోండి.ఏ అవసరం కోసమైన పనికి వస్తాయి. రేయిన్ కోటు, లేదా గొడుగు కూడా పెట్టుకోండి.

** ముక్తినాధ్ లో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఉత్తమమైన తెల్ల కర్పూరం బిల్లలు ,వాము కలిపి వాసన చూస్తే బ్రీతింగ్ సులభంగా నడుస్తుంది.అలాగే కూడా తెల్లటి దూది కూడా పెట్టుకొండి(చల్లదనం నుండి రక్షణకు చెవుల్లో పెట్టుకోవడానికి) కాశిలో రేపు ఉదయం 10.30 కు ఫ్లైట్ దిగేసరికి గోరక్ పూర్ నుండి వచ్చిన 20 సీటర్ టెంపూ ట్రావెలర్ వారణాసి ఏయిర్ పోర్టులో రెడిగా ఉంటుంది .వెహికల్ లో లగేజి పెట్టుకొని సాయంత్రం 5వరకు కాశి దర్శిస్తాము. అంతా ఉదయం స్నానం చేసి హైదారాబాదు ఏయిర్ పోర్టుకు 6గంటలకు రండి.కాశిలో తిరిగి గంగా నదిలో స్నానం చేద్దామనుకునేవారు ఒక ప్లాస్టిక్ కవర్లో విడిగా జత బట్టలు+టవల్ పెట్టుకోండి. అలాగే ప్రతినిత్యం లగేజి ఒక్కసారి టెంపో ట్రావెలర్ పైకి ఎక్కించాక మళ్ళి నైట్ హోటల్ రూం చేరుకున్నతరువాతనే లగేజి కిందకు దింపబడుతుంది.డే టైంలో ఏది అవసరం ఉన్నా టాబ్లెట్లు తదితరాలు తప్పనిసరిగా మీ సీటు దగ్గరే విడిగా హ్యండ్ బ్యాగ్ లో పెట్టుకోండి.

Hyderabad Airport Entry step by step. 1) రేపు ఉదయం హైదరాబాదు ఏయర్ పోర్టులో 6గంటలకు వచ్చాక ఏదో ఒక గేట్ నుండి మీ టికెట్ ఆధార్ కార్డు ఒరిజినల్ పోలీస్ స్టాప్ కు చూపించి, ఏయిర్ పోర్టులో ఎంటర్ కండి.2) Akash Air కౌంటర్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ మీ లగేజి అప్పచెప్పి బోర్డింగ్ పాస్ తీసుకోండి.(ఇక్కడ అరగంట పడుతుంది) 3) తరువాత సెక్యూరిటి చెకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి(ఇక్కడ మరో అరగంట గడుస్తుంది).4) బోర్డింగ్ పాస్ లో ఇచ్చిన మెన్షన్ చేసిన గేటు నెంబర్ దగ్గరకు వెళ్ళండి(మరో పావుగంట గడుస్తుంది), 4) ఇక్కడ మీరు తెచ్చుకున్న హోంపుడ్ తినండి.పావుగంట గడుస్తుంది(లేదా ఫ్లైట్ లో కూర్చున్నాక అయిన తినవచ్చును). .టిపిన్ +వాటర్ బాటిల్ లోపలికి మీ వెంట్ తెచ్చుకోవచ్చును. 5) తరువాత అక్కడ 40 నిమిషాల ముందుగా గేటు ఓపెన్ చేసి మీ బోర్డింగ్ పాస్ చెక్ చేసి , ఫ్లైట్ లోకి పంపిస్తారు.(ఇక్కడ మరో అరగంట గడుస్తుంది) 6) ప్లైట్ రన్ వే దగ్గరకు వెళ్ళి టేకాఫ్ కావడానికి మరో పావుగంట గడుస్తుంది.7) ఫ్లైట్ చివరకు 8.25 గాల్లోకి టెకాప్ అవుతుంది. 10.20 కు వారణాసిలో దిగుతాము.ముఖ్య గమనిక ఏయిర్ పోర్టుకు చేరుకునే టైం కాని, ఫ్లైట్ ఎక్కేవరకు మద్యలో ఎక్కడ లేట్ చేయకుండా కరెక్టు టైం మేయింటేన్ చేయండి. ఫ్లైట్ ఎక్కేవరకు మీదే స్వంత బాధ్యత. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా అని కొందరు ఏయిర్ పోర్టు మద్యలో టైంపాస్ చేస్తుంటారు.మీరు ఫ్లైట్ ఎక్కకుంటే ఎవరు విడిగా మీకు కాల్ చేయరు.మీ స్వంత బాధ్యత మీదనే ఫ్లైట్ ఎక్కాలని గమనించగలరు. నేను బొర్డింగ్ పాస్ లో ఇచ్చిన గేట్ దగ్గర అందరిని కలుస్తాను. ఇట్లు రవీందర్.శ్రీటూర్స్. 8985246542

డేవైస్ ప్రోగ్రాం.-తరువాత పంపించడం జరుగుతుంది.