👨🦰👩🦰ప్రియమైన యాత్రికులందరికి ముఖ్య గమనిక. 🤏 కరోనాకంటే ముందు ప్లైట్, ✈️ట్రైన్ 🚆ద్వారా యాత్రలకు వచ్చిన కొందరు ,అప్పుడు రావాలని ప్లాన్ చేసుకుని రాలేకపోయిన వారి నుండి మాకు రెగ్యులర్ గా కొన్ని కాల్స్, మెసేజ్ లు వస్తుంటాయి ,కరోనాకంటే ముందు అంత చీప్ గా ఉండేవి కదా ఇప్పుడెందుకు ఇంత రేట్లు పెరిగాయి అంటూ …ఇంకా చాలమందికి ఇదే సందేహాలు ఉండవచ్చును.అందరి సందేహాలకు ఇక్కడ క్లియర్ గా క్లారిఫికేషన్ ఇస్తున్నాను గమనించండి.✈️ ఫ్లైట్ చార్జీలు కరోనాకంటే ఇప్పుడు రెట్టింపు పెరిగాయి. గతంలో గుజరాత్ యాత్రకు ఫ్లైట్ ద్వార వెళ్ళి వస్తే రూ.6000 దాటక పోయేది, వైష్ణోదేవి ,చార్ ధామ్ యాత్రలకు డిల్లి వెళ్ళి వచ్చినా అప్ డౌన్ ప్లైట్ చార్జీలు రూ.6000-7000 వరకే ఉండేది.✈️ అలాంటిది ఇప్పడు కనీసం గుజరాత్ ,డిల్లి ఎక్కడికి వెళ్ళిరావడానికి కూడా అప్ డౌన్ కనీసం రూ.10,000 నుండి రూ.12000 అవుతుంది, అదికూడా కనీసం 2-3 నెలలు ముందుగా బుక్ చేసుకుంటేనే.ఫ్లైట్ లో డైనమిక్ ఫేర్ (డిమాండ్ బట్టి రేటు పెరగడం) ఉంటుంది. ప్రయాణం తేధికి దగ్గరైన కొద్ది చార్జీలు రెండింతలు ,మూడింతలు ఫ్లైట్ చార్జీలు పెరుగుతుపోతుంటాయి. పెరిగిన ఫ్లైట్ చార్జీలతో అప్ డేట్ యాత్ర ప్రైస్ చెపితే అబ్బా ఇంతా చార్జీనా అంటారు.అందుకే కాశి యాత్ర ఫ్లైట్ ద్వారా 12-2-22 న, వైష్ణోదేవి యాత్ర 11-3-22 న ఎప్పుడో నెల ముందే అనౌన్స్ చేసాం. యాత్ర కోసం అడిగిన,అడుగుతున్న వారు ఇంకా చాలా టైం ఉంది కదా తరువాత చూద్దాం అని వేయిట్ చేస్తున్నారు.ఈలోగా ఫ్లైట్ చార్జీలు పెరగుతాయి,తద్వారా యాత్ర ఖర్చు పెరుగుతుంది.కాశి యాత్రకు బుక్ చేసుకోవడానికి అందుకే చివరి తేధి పెడుతున్నాం. 10-12-22 వరకు మాత్రమే కాశి యాత్ర మరియు వైష్ణోదేవి యాత్ర బుక్ చేసుకోవడానికి చివరి తేధిగా తెలియచేస్తున్నాం. వైష్ణోదేవి యాత్రకు కూడా ముందుగానే ఎందుకు బుక్ చేసుకోవాలంటే వైష్ణోదేవి కొండపైకి వెళ్ళడానికి హెలికాప్టర్🚁 టికెట్స్ చాలా అడ్వాన్సుగా బుక్ చేసుకుంటనే దొరకుతాయి….లాస్ట్ మూమెంట్ లో వైష్ణోదేవి యాత్రకు బుక్ చేసుకోవాడానికి ముందుకు వచ్చి తీరా ఇప్పడు హెలికాప్టర్ టికెట్స్ దొరకవంటే యాత్రకు తరువాత చూద్దాంలే అనుకునేవారు చాలామంది ఉన్నారు. మీర్ పేట నుండి ఒకరు 2016 నుండి వైష్ణోదేవి యాత్రకు అడుగుతున్నారు.వారికి ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తుంది. ఒకరు ఖైరతాబాదు నుండి 5 ఏండ్లనుండి గుజరాత్ యాత్ర అడుగుతున్నారు.ప్రతి సారి అడుగుతారు, ఏదో కారణం చెప్పి(వర్షాలు అని చలి అని ఎండలు అని) వాయిదా వేసుకుంటారు.. (మరో కోణంలో అర్థం చేసుకుంటే యాత్రలను వారు వాయిదా వేయడం కాదు, అక్కడనుండి మీకు ఇన్విటేషన్ అహ్హనం అందలేదని అర్థం.అది అమ్మవారి నుండైనా కావచ్చు లేదా కైలాస నాధుడి నుండైనా కావచ్చు..ఈ విషయంలో డౌట్ ఉన్నవారు కావాలని కాశి యాత్ర ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి… అసలు వెళ్ళలేరు..కాశి క్షేత్ర పాలకుడి కాలబైరవుడి అనుమతి ఉంటే కాశి విశ్వనాధుడుని ఎవరు దర్శించుకోలేరు,డౌట్ ఉన్నవారు ప్రయోగం చేసి చూడవచ్చు) …..పెరిగిన ఫ్లైట్ చార్జీలతో విమాన కంపెనీలు బలే లాభం సంపాదిస్తున్నారని మీరు అనుకోవచ్చు.మనందరం రెగ్యులర్ గా వెళ్ళే ఇండిగో ఫ్లైట్ వారి 2022 ఆర్ధిక సంవత్సరం లాస్ అక్షరాల 6161 కోట్ల రూపాయలు. (2021 లో రూ. 5800 కోట్ల లాస్,2020లోనైతే ఏకంగా రూ. 15,000 కోట్ల లాస్ అంటే నెలకు రూ.1200 కోట్ల లాస్ ) విమాన యాన కంపెనీలు లాభ సాటిగా నడువాలంటే మీరు స్వంతంగా విమాన కంపెని పెట్టిన కూడా దూరంతో నిమిత్తం లేకుండా ఒక ఏయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకుని మరో ఏయిర్ పోర్టులో లాండ్ కావాలంటే కనీసం 100 యు.ఎస్.డాలర్లు ఉంటేనే లాభసాటి.. 100 యు.ఎస్. డాలర్లు అంటే రూ.8000. అంటే విమాన చార్జి ప్రపంచ వ్యాపంగా ఎక్కడైనా కూడా కనీసం రూ.8000 ఉంటేనే విమాన కంపెనీలకు లాభసాటి. మరి వారు లాస్ తో ఎందుకు నడిపిస్తున్నారు అంటే పోటి తత్వం వలన..వారి మద్యలో ఉన్న పోటి కారణంగా ఇనేండ్లు చౌకలో ప్రయాణించాం.2018లో ఐతే మధ్యప్రధేష్ ఉజ్జయిని , ఓంకారేశ్వర్ యాత్ర 2 రోజుల టూర్ బై అప్ డౌన్ ఫ్లైట్ ద్వార కేవలం రూ.7000 కు పెట్టాను.(ఏయిర్ ఏషియా ఫ్లైట్ ద్వారా ఈ యాత్ర ఉండేది. ఏయిర్ ఏషియా వారు (మలేషియా బేస్డ్) చివరకు నష్టాలను తట్టుకోలేక ఇండియా సర్వీసులన్ని టాటాలకు అమ్మారు. ఇక ఏయిర్ ఇండియా ఐతే భారత ప్రభుత్వమే నడుపలేక 60వేల కోట్ల నష్టాలతో రీసెంట్ గా టాటాలకు అమ్మేసింది.) ఇవన్ని వాస్తవాలు.డౌట్ ఉన్న వారు గూగుల్ లో సెర్చి చేసుకుని చూడండి…🚌 ఇక బస్సుల్లో డిజిల్ రేటు కూడా కరోనా కంటే ముందు రూ.70 ఉండేది,ఇప్పడు దాదాపు రూ.100 గా ఉంది. బస్ రేట్లు పెరిగే సరికి బస్ అపరేటర్లు పెరిగిన డిజిల్ ఖర్చుతో పంపిస్తు ఉండే సరికి యాత్ర ఖర్చు కూడా కనీసం 30శాతం పెరిగింది…అంటే అంతకు ముందు యాత్ర ఖర్చు రూ.10,000 ఉంటే ఇప్పుడు రూ.13,000 అవుతుంది. బస్ లకే కాదు పెట్రోల్, డిజిల్ ఖర్చు పెరిగే సరికి లారి,ట్రక్ అన్నింటి మీద పడుతుంది.హైదరాబాదు సిటిలోనే చూడండి అంతకు ముందు 10 కిలోమీటర్లు వెళ్ళడానికి రూ.20 తో సిటి బస్ లో వెళ్ళేవారు ఇప్పుడు కనీసం రూ.35 టికెట్ తో వెళుతున్నారు. మీ వీధి చివరన టిఫిన్ సెంటర్ లో కరోనా కంటే ముందు 20 రుపాయలతో ప్లేట్ టిఫిన్ తినేవారు ఇప్పుడు కనీసం రూ.35 పెట్టాల్సి వస్తుంది. ట్రాన్స్ పోర్టు ఖర్చు పెరిగే సరికి కూరగాయలు నిత్యవసర ఖర్చులు అన్ని పెరిగాయి.తద్వారా హోటల్స్ లతో టిఫిన్స్, భోజనం ఖర్చులు పెరిగాయి… దాంతో పాటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్స్ కు కూడా 30శాతం జీతాలు,పెన్షన్స్ కూడా పెరిగాయి.ఇంట్లో కరెంటు ప్లాబ్లమో ,ప్లంబింగ్ ప్రాబ్లం వచ్చి ఎలక్ట్రీషియన్ కు , ప్లంబర్ కు కాల్ చేస్తే కరోనాముందకు ఇప్పుడు డబుల్ చార్జీలు తీసుకుంటున్నారు…ఇలా సొసైటిలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా చార్జీలు పెరిగిన కూడా యాత్రలు కూడా ఇంకా కరోనా కంటే ముందు రేట్ల తోటి నడపడం సాధ్యమవుతుందా? దయ చేసి ఆలోచించగలరు.. ఎప్పుడో దశాబ్దం కింద 10 ఏండ్లకు ముందు మహారాష్ట్ర యాత్ర రూ.10వేలకు పెట్టేవాళ్ళం..అలాంటిది 10 ఏండ్ల తరువాత కూాడా ఎన్నో , ఎన్నెన్నో అడ్జస్ట్ మెంట్స్ , ప్లానింగ్ లు చేసి ఇప్పటికి కూడా రూ.10,000 మహారాష్ట్ర యాత్ర పెడితుంటే దాన్ని కూడా చాలా ఎక్కువ అనే వారు ఉన్నారు. ఒక్క షిర్టి కి పోయి వస్తేనే ఒక్కరికి కనీసం రూ. 4000 ఖర్చు వస్తుంది. అలాంటిది టోటల్ మహారాష్ట్ర యాత్ర అంతా రూ.10,000 చౌకనా ఎక్కువనా???? 2017,2018లలో వైష్ణోదేవి యాత్ర కేవలం డిల్లి వరకు అప్ డౌన్ ప్లైట్ తో రూ.20,000 ఉండేది….అలాంటిది రాబోయే మార్చిలో అమ్రుత్ సర్ వరకు వెళ్ళేప్పుడు ఫ్లైట్,రిటర్న్ జమ్ము నుండి ఫ్లైట్ తో కేవలం రూ.5000 పెంచి ఎన్నెన్నో అడ్జస్ట్ మెంట్లతో రూ.25000 పెడితే అది కూడా చాలా కాస్ట్ లి టూర్ అని కొందరు ఫోన్లో అంటున్నారు…కాశి యాత్ర స్లీపర్ క్లాస్ ట్రైౌన్లో బిహార్ , జార్కండ్ లేబర్ అంతా స్లీపర్ క్లాస్ ట్రైన్ లో పడుకోవడానికి కూడా లేకుండా ఉన్న సందర్బాల్లో ట్రైన్లో పోవడానికి రోజున్నర,రావడానికి రోజున్నర మొత్తం కలిపి ప్రయాణానికే 3 రోజులు టైం తీసుకుని నాన్ ఎ.సి.బడ్జెట్ రూంలు, నాస్ ఎ.సి.బస్ లో గతంలో మాదిరిగా రూ.13000 పెడితే బాగుంటుందా ?? సౌకర్యంగా అప్ డౌన్ ఫ్లైట్ తో ఎ.సి.రూంలతో, ఎ.సి బస్ తో కేవలం డబుల్ ఖర్చు అనగా రూ.26000 వెళ్ళి వస్తే సౌకర్యంగా ఉంటుందా? ప్లైట్ ద్వార పెట్టిన యాత్రలు ఎక్కువ ఖర్చు అని ఫీలయ్యేవారికే ఇంత పెద్ద సుదీర్గ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే వైష్ణోదేవి కి , కాశికి ఫ్లైట్ యాత్రలో రూ.20000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అనేసరికి అది మొత్తం మేమే తీసుకుంటాం అని ఫీలయ్యేవారు ఉన్నారు. రూ.20వేలలో ఫ్లైట్ చార్జే రూ.12000 అయినప్పడు మీరు కట్టిన అమౌంట్ ప్లైట్ కేన్సిల్ చేసుకుంటేవస్తుందా? అక్కడికి అక్కడ సరిపోతుంది.అలాగే ముందుగా రూంలు బుక్ చేసుకోవాలి,యాత్రికుల సంఖ్యను తగ్గట్లు వెహికిల్ బుక్ చేసుకోవాలి. మద్యలో ఏది కేన్సిల్ చేయడం వీలుకాదు.(మరీ ధీర్గ వివరణ ఇక్కడ ఇవ్వదలచుకోలేదు.ఏకవాఖ్యంలో కేన్సిల్ చేయడం వీలు కాదు అంతే…బయలు దేరడానికి ముందు వారం మందు యాత్రకు రావడం లేదంటే అప్పటికి ప్లైట్ చార్జీలు ఏ రెడింతలు , మూడింతలు పెరిగిపోయి ఉంటాయి, పెరిగిన రేట్లతో వేరే వారు రాలేరు,పాత వారు కేన్సిల్ చేసుకుంటే అంతకు నెల ముందే వెహికిల్ ప్రయాణీకుల సంఖ్యకు తగ్గట్లు వెహికిల్ మాట్లాడి ఉంటాం కాబట్టి మీరు రాకున్నా బస్ లో సీట్లు అలాగే ఖాళీగా ఉంటాయి…కేవలం హైదరాబాదు నుండి బస్ బయలు దేరితే మాత్రమే చివరి నిమిషం వరకు కూడా ఎవరైనా కేన్సిల్ అయితే మరొకరు లేదా ఒకరి ప్లేసులో మరొకరు రావడానికి అవకాశం ఉంటుంది వేరే రాష్ట్రాలకు ఫ్లైట్ , ట్రైన్ ద్వారా వెళ్ళినప్పడు ఇలాంటి ఉండదు..ఇంక భోజనం గురించి చెప్పి ఇంతటితో ముగిస్తాను. తీర్థ యాత్రలకు బయటకు వెళ్ళినప్పడు హైదరాబాదు నుండి బస్ బయలు దేరినప్పడు మాత్రమే వంట మనిషి, గ్యాస్ , స్టౌ,వంట సరకుులతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాని ఉత్తరా ఖండ్ లో 5 ఏండ్ల కింద గ్యాస్ సిలండర్ పేలిపోయి వెహికిల్ లో ఉన్న 20 మంది చనిపోయారు. అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది కూడా బస్ లో గ్యాస్ సిలండర్ పేలిపోయి చాలామంది చనిపోయారు. మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం ప్రయాణికుల వాహానంలో గ్యాస్ సిలండర్ తీసుకెళ్ళడం చట్ట రీత్య నేరం…బస్ లో వెనుక డిక్కిలో చెక్ చేసి గ్యాస్ సిలండర్ కనపడితే 25వేల ఫైన్ లేదంటే బస్ సీజ్ చేసే అధికారం పోలీస్ వారికి ఆర్.టి.వో కు ఉంటుంది. పోయిన నెల మేము మహారాష్ట్రా యాత్రకు విత్ గ్యాస్ సిలండర్,వంట మనిషితో వెళ్ళినప్పుడు పూణేలో పోలీస్ వారు చెక్ చేసి వారిని కన్వీన్స్ చేసి ఏదో కొంచెం సమర్చించుుంటే కాని వదిలి పెట్టలేదు..అందుకే ఇకపై ఏ యాత్రల్లో కూడా వంట మనిషి,గ్యాస్ సిలండర్ తోవంట మాయాత్రలో ఉండదని దయచేసి గమనించగలరు..రోమ్ పోయినప్పుడు రోమన్ లెక్క మాత్రమే ఉండాలి. ప్రపంచంలో ఎవరు తినే అహార పదార్థమైన కేవలం బియ్యం,గోదుమ, బార్లి, పప్పు దినుసులు,కూరగాయలతో మాత్రమే ఉంటుంది. కేవలం ఫ్లెవర్ మాత్రమే ఒక్కో ఏరియాకు తేడా వస్తుంది. బయటి ప్రదేశాలకు వెళ్లినప్పడు ఏదో నాలుగు రోజులు అక్కడి లోకల్ ఫుడ్ వెరైటీలు చెక్ చేయాలనే ఆసక్తి ఉండి అక్కడి టేస్ట్ లు కూడా చూడాలే తప్ప ఎప్పుడు మనం తినే ఇడ్లి ,వడ,దోసలే అక్కడ కూడా ఉండాలని ఆశించవద్దు… మరో ముఖ్య విషయం పుణ్య క్షేత్రాల యాత్రలో ఏ టూర్ ఆపరేటర్ టూర్ల్లోనైనా సాయంత్రం లైట్ ఫుడ్ అంటే అల్పాహారం మాత్రమే ఉంటుంది.అల్పాహారం అంటే 2 సమోసాలు ఇచ్చిన కూడా అల్పాహారం మేము ఇచ్చినట్లే…అంతే తప్ప ఏ పుణ్య క్షేత్రాల యాత్రలో కూడా డిన్నర్ ఉండుదు.డిన్నర్ ఉండే యాత్రలు చాలా కాస్టలి ఉంటాయని గమనించగలరు.అంతగా…కావాలంటే మీరు విడిగా బిల్ పేచేసి డిన్నర్ తినవచ్చును. కాని యాత్రల్లో తిరిగేప్పుడు రోజుకు కనీసం 300-400 కీలోమీటర్లు బస్ లో ప్రయాణం చేసేప్పుడు లైట్ ఫుడ్ తో మాత్రమే ప్రయాణం చేయాలి లేదంటే బస్ లో ఉన్న ప్పుడు వాంతులు ,వీరోచనాలు, మోషన్స్ అవుతుంటాయి…గతంలో వీటన్నింటి అనుభవంతో మాత్రమే యాత్రల్లో అల్పాహారం ఇస్తుంటారు.ఇది చాలా మంది మిస్ అండర్ స్టాండ్ చేసుకుని మాకు రాత్రి భోజనం పెట్లలేదని అనుకుంటూంటారు. ఇక ఉదయం టిఫిన్ కూడా మేము పెట్టే బడ్జెట్ యాత్రల్లో ఉదయం టిఫిన్ రోడ్ పక్కన ఏ టిఫిన్ సెంటర్లోనో, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ లోనే టిఫిన చేయడం ఉంటుంది. మొన్న పంచారామాలకు వచ్చిన ఒక మహిళ యాత్రికురాలు పీఠాపురం దగ్గర ఉదయం టిఫిన్ పెట్టిస్తే మాకు ఫుట్ పాత్ టిఫిన్ పెట్టించావని గొడవపెట్టింది…మరి వంటమనిషితో బస్ లో వెళ్ళినప్పడు ప్రతిసారి బస్ ఎక్కడో రోడ్ పక్కన ఆపుకుని ఫుట్ పాత్ పక్కనే ఏ చెట్టు,పుట్ట కిందనో నిలబడే తినాలి కదా? టిఫిన్ కూడా రెస్టారెంట్ లో తినేలా ప్లాన్ చేస్తే మేము కూడా కాస్ట్ లి టూర్స్ పెట్టాలి. మరి అంత ప్రైస్ అందరు పెట్టగలరా? బస్ లో వంట మనిషి, వంటతో వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లాబ్లంస్ ఉన్నాయనే మేము ఏ యాత్రలు పెట్టిన కూడా వంటమనిషితో యాత్రలు పెట్టము.ఎక్కడికి వెళ్ళిన అక్కడి లోకల్ ఫుడ్ తో మాత్రమే టైం టూ టైం టిఫిన్,భోజనంకు ఏదో ఒక హోటల్ దగ్గర ఆగి తింటుంటాము.. వంటమనుషులతో వెళ్ళినప్పడు అన్నింటి కంటే పెద్ద సమస్య వంట ప్రిపేర్ చేయడంలో టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇక యాత్రలో తిరిగేప్పుడు నాన్ ఎ.సి. రూంలు అంటే అర్థం లిఫ్ట్ ఉండని హోటల్లు అని అర్థం . కొన్ని చోట్ల ఉంటే ఉండవచ్చును,చాలవరకు ఉండవు.అలాంటప్పుడు పస్ట్ లేదా సెకండ్ , థర్డ్ ఫ్లోర్ వరకు కూడా మెట్లు ఎక్కి వెళ్ళాలి. అదే ఎ.సి.రూం హోటల్లో లిఫ్టి ఉన్న వి ఉంటాయి.వెస్ట్రన్ టాయిలెడ్ ఉంటాయి. నాన్ ఎ.సి.రూం రూ.1000 కు వస్తే ఎ.సి.హోటల్ రూం రూ.2000 కు ఉంటుంది.ఎ.సిహోటల్ రూం అంటే నైట్ ఎ..సి. వేసుకోవడానికి అనే కాదు విత్ లిఫ్ట్ , వెస్ట్రన్ టాయిలెట్ అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేది అని అర్థం. నాన్ ఎ.సి.హోటల్ రూంప్యాకేజి బుక్ చేసుకుని ఇక్కడ హోటల్ లో లిఫ్ట్ లేదా అని కొందరు గొడవపెడతుంటారు.అలాంటి వారికి క్లారిటి కోసం ఇంత వివరంగా తెలియచేస్తున్నాను. లిఫ్ట్ తో సహా ఉండే హోటల్స్ కావాలంటే ఎ.సి.రూంల ప్యాకేజి మాత్రమే ఎంచుకోండి…మేము రెగ్యులర్ గా యాత్రలు పెట్టే దగ్గర చాలవరకు నాన్ ఎ.సిహోటల్స్ ప్యాకేజిలో కూడా లిఫ్ట్ ఉన్న హోటల్స్ లలోనే బుక్ చేస్తాం.ఎక్కడో ఒకటి అరా హోటల్స్ లో లిఫ్ట్ లేకుంటే గొడవపడే వారికోసం ఇంత క్లారిటిగా చెపుతున్నాను. కాబట్టి చివరగా సారాంశం పుణ్య క్షేత్రాలకు, తీర్థ యాత్రలకు గ్రూప్ యాత్రలకు వచ్చేవారు అంతా దయచేసి చివరగా ఒకటే గుర్తుంచుకోగలరు..బడ్జెట్ టూర్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఖరిదైన టూర్లకు వెళ్ళేవారు సదరన్ ట్రావెల్స్ ,ఐ.ఆర్.సి.టి.సి. టూర్లకు(క్రితం సారి వారి గుజరాత్ యాత్ర ప్యాకేజి ఎంత అనే లింక్ లు పంపించాను చెక్ చేసుకుని బుక్ చేసుకోగలరు.అంతే తప్ప బడ్జెట్ యాత్రలకు వచ్చి హై స్టాండర్స్ సౌకర్యాలు ఆశించి భంగపడవద్దు..అలాంటి వారు దయచేసి విడిగా మాత్రమే ప్లాన్ చేసుకుని సోలో గా వెళ్ళాలి…మీరు సోలోగా వెళితే గ్రూప్ యాత్రలకు వచ్చిన దానికంటే డబుల్ ఖర్చు వస్తుంది , డబుల్ టైం పడుతుంది, పైగా ప్రతిది కనుక్కుంటూ వెళ్ళాలి అని కూడా మర్చిపోకండి. ఇట్లు.రవీందర్.శ్రీటూర్స్….8985246542
Comment (0)