17-1-2025 ఒరిస్సా,కామాఖ్య వస్తున్న యాత్రికులందరికి స్వాగతం.సుస్వాగతం.. రవీందర్.శ్రీటూర్స్. 8985246542. ఈ యాత్రకు 24 మంది యాత్రికులం వెలుతున్నాం.
ఈ యాత్రకు మొత్తం 24మంది యాత్రికులం వెళుతున్నాం ,( నాతో సహా 24మంది)
తేధి 17-1-25న సికింద్రాబాదు నుండి సాయంత్రం 4.30 గంటలకు ( Train Name Vishaka Express , Train number- 17016) బయలుదేరితే మర్నాడు మద్యహ్నం 3.30 కు భువనేశ్వర్ కు చేరుకుంటాం. (All tickets will be post in group once again.) వరుసగా రాష్ట్రం వారిగా ముందుగా ఒరిస్సా , వెస్ట్ బెంగాల్ కలకత్తా , జార్కండ్ బైధ్యనాధ్, ,భూటాన్, మేఘాలయ, అస్సాం-గౌహతి -కామాఖ్య టెంపుల్ దర్శించి,24-1-25 గౌహతి టూ హైదరాబాదు డైరెక్ట్ ఫ్లైట్ ద్వారా రిటర్న్ వస్తాము.
(ఈ యాత్రలో ఖమ్మంలో సంతోష్ , శ్రీదేవి గార్లు ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్ లో 17-1-25న ఉదయం 11.30 ఎక్కుతున్నారు. అలాగే మర్నాటి తేధి అనగా 18-1-25 న సుదాకర్ , కామాక్షి గార్లు బెంగుళూరునుండి బై ఫ్లైట్ లో వస్తున్నారు. అలాగే కె.రామచందర్ రావు , కె.సులేఖ గార్లు విశాఖపట్నంలో 18న ఉదయం ట్రైన్ ఎక్కుతున్నారు.( Train Name Vishaka Express , Train number- 17016) అలాగే లక్షణ మూర్తి గారి గ్రూపు అంతా 18 న ఉదయం హైదరాబాదు నుండి ఫ్లైట్ కు వస్తున్నారు.)
1) ముఖ్య గమనిక*** ఖమ్మంలో సంతోష్ , శ్రీదేవి గార్లు మర్నాడు ఉదయం 5గంటలకే భువనేశ్వర్ చేరుకుంటారు. ట్రైన్ దిగాక ట్రైన్ ఇంజన్ వైపు నడిస్తే పక్కనే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి 1 నెంబర్ ఫ్లాట్ ఫాం బయటకు వెళితే స్టేషన్ కు పక్కనే 50 మీటర్ల దూరంలో Ruchi Hotel ఉంటుంది. (హోటల్ ఫోన్ నెంబర్ -9437012316) హోటల్ కు వెళ్ళి Hyderabad – Ravinder 13 Rooms Group Booking అని చెపితే మీ ఆధార్ జిరాక్స్ లు తీసుకుని రూమ్ ఇస్తాడు.ఫ్లైట్ లో ఉదయం 8.30 కు భువనేశ్వర్ లో దిగినవారు కూడా ఇదే హోటల్ రూంకు ఏయిర్ పోర్టు నుండి టాక్సి తీసుకుని వెళ్ళాలి.(మీ స్వఖర్చులతో) హోటల్ ఎదురుగానే ఇడ్లి , వడ దొరికే టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ టిఫిన్ ,టీ తీసుకోండి. అక్కడ కూడా Hyderabad – Ravinder group అని చెప్పండి టిఫిన్ ఇస్తాడు (నేను ముందే ఫోన్ చేసి చెపుతాను) మద్యహ్నం లంచ్ కు చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయి. మేము ట్రైన్ లో 3.40 కు భువనేశ్వర్ కు చేరుకునేవరకు మీరు లీజర్ గా గడుపవచ్చును.18న బెంగుళూరు , హైదరాబాదు,నుండి ఫ్లైట్ లో వచ్చేవారు ఉదయం ఇంటి దగ్గర స్నానం చేయకుండా బయలుదేరండి. ఫ్లైట్ టైంకు ఖచ్చితంగా 2.30గంటల ముందే ఏయిర్ పోర్టులో తప్పనిసరిగా ఉండాలి. ఓరిజినల్ ఆధార్ కార్డు తప్పని సరిగా చూపించాలి, ఫ్లైట్ టికెట్ మొబైల్ లో చూపించిన సరిపోతుంది. హైదరాబాదు నుండి ఉదయం 6.40 కు ఫ్లైట్ అంటే మీరు ఖచ్చితంగా ఉదయం 4గంటలకే ఏయిర్ పోర్టులో ఉండాలి. ఎక్కువలో ఎక్కువ ఆలస్యం అయినా లాస్ట్ కు కనీసం 4.30 కన్నా ఏయిర్ పోర్టులో ఉండాలి. ఏయిర్ పోర్టులో ఎంటర్ అయిన తరువాత AIR INDIA EXPRESS కౌంటర్ ఎక్కడుందో చూసుకుని మీ టికెట్ చూపించి మీ లగేజి అక్కడ అప్పచెప్పి,బోర్డింగ్ పాస్ విత్ సీటు నెంబర్ అక్కడే ఇస్తారు. ఇక్కడే క్యూలైన్ లో కనీసం అరగంట పైన పడుతుంది తరువాత సెక్యూరిటి చెకింగ్ దగ్గర మరో అరగంట , గంట గడుస్తుంది.( సెక్యూరిటి చెకింగ్ లో మీ వొంటి మీద డ్రెస్ తప్ప మరేం ఉంచకుండా స్కానింగ్ కోసం ట్రేలలో పెట్టాలి, స్కానింగ్ అవగానా అన్ని మర్చిపోకుండా తీసుకోండి. సెక్యూరిటి చెకింగ్ కాగానే మీ బొర్డింగ్ పాస్, బోర్డింగ్ పాస్ ల ఏ గేట్ నెంబర్ ఇచ్చారో చూసుకుని ఆ గేట్ నెంబర్ దగ్గరకు వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. బోర్డింగ్ పాస్ ఇచ్చారు, సెక్యూరిటి చెకింగ్ అయిపోయింది ఇక రిలాక్స్ అని మీరు మధ్యలో షాపులు చూస్తు ఆలస్యం చేస్తే మీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని ఒకటికి రెండు సార్లు మరి మరి జాగ్రత్తలు చెపుతున్నాను.గతంలో ఇలాంటివి యాత్రల్లో జరిగాయి …బోర్డింగ్ పాస్ లో ఇచ్చిన గేట్ నెంబర్ దగ్గరకు ఖచ్చితంగా ఉదయం 6గంటలకు చేరుకోవాలి.(హైదరాబాదు ఏయిర్ పోర్టు సైలెంట్ఏయిర్ పోర్టు మీరు టైంకు గేట్ దగ్గరకు చేరుకోకుండా ఫ్లైట్ దాని ప్రకారం అది వెళ్ళిపోతుంది తప్ప మీకోసం మైక్ లో అనౌన్స్ చేయరని గమనించగలరు. గేటు దగ్గరకు చేరుకున్న తరువాత మరో పావుగంట గేట్ దగ్గరనుండి ఫ్లైట్ దగ్గరవరకు బస్ లో తీసుకెళ్ళడం , ఫ్లైట్ డోర్స్ 6.15 కల్లా క్లోస్ కావడం, ఫ్లైట్ ఇన్ స్ట్రక్షన్స్ తరువాత రన్ వే ముందు కు స్లో గా వెళ్ళడం ఇదంతా మరో 25 నిమిసాలు గడుస్తుంది.6.40 కు ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. సో ఫ్లైట్ 6.40 కు అంటే అర్థం మీరు అరగంట ముందు వెళ్ళడం కాదు..ఖచ్చితంగా 2నుండి 2.30 గంటల ముందే ఏయిర్ పోర్టుకు చేరుకోవాలి.అలాగే ట్రైన్ టైంకు సికింద్రాబాదు స్టేషన్ కు 1గంట ముందే చేరుకోవాలి.
*2) ట్రైన్,ఫ్లైట్ టికెట్స్ అన్ని ఒకేరోజు పెడితే కనఫ్యూజన్ గా ఉంటాయి కాబట్టి ఏరోజు టికెట్స్ ఆరోజే వరుసగా పెడుతానని గమనించగలరు.
*3) 3 రాత్రులు హోటల్ రూం నైట్ స్టేస్ @ హషిమార 1 నైట్,గౌహతి 2 రాత్రులు, (3 రాత్రుల్లో ఎ.సి.రూం చార్జి ఒక్కరికి రూ.1500 అదనం ) సింగిల్స్ వచ్చిన్నప్పుడు ఇతర సింగిల్స్ లేకుంటే సింగిల్ పర్సన్ రూం కోసం రూ.2000 అదనం.నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం.డ్రైవర్ టిప్ అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కరికి రూ.150 ఇవ్వవలెను.
4) పెండింగ్ బ్యెలెన్స్ లు బై క్యాష్ గానే యాత్రలో పేచేయవలెను . ఒకరిద్దరు గూగుల్ పేలో పేచేయవచ్చును.
5) ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
6)**అందరు వెంట తెచ్చు కోవాల్సిన డాక్యుమెంట్స్…
..ఎ) అందరు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు+ఖచ్చితంగా 3 ఆధార్ జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి.జిరాక్స్ కాపీలు హోటల్ రూంలలలో ఖచ్చితంగా ఇవ్వాలి.హైదరాబాదులో బయలుదేరినప్పుడే ఆధార్ కు 3 జిరాక్స్ కాపీలు తప్పకుండా తీసుకుని బయలుదేరాలి.అక్కడికి పోయాక తీసుకుందాం అంటే వీలుకాదు,పొద్దున్నే షాపులు తీయరు.
బి) భూటాన్ లో ఎంట్రికోసం ఆధార్ ఒరిజినల్ తో పాటు ఖచ్చితంగా ఓటర్ ఐ.డికార్డు ఒరిజినల్ లేదా పాస్ పోర్టు ఒరిజినల్ తెచ్చుకొండి.4 నెలలుగా ఆధార్ ఒరిజినల్ ఉంటే భూటాన్ లో అనుమతిస్తున్నారు.కాని పోయినసారి వెళ్ళినప్పుడు ఆధార్ ఒరిజినల్ కార్డులోని క్యూ.ఆర్.కోడ్ ను స్కాన్ చేస్తే కొందరివి స్కాన్ కాక ఎంట్రి దగ్గరే అపారు.మీ మీ అధార్ కార్డుల మీద క్యూ.ఆర్ కోడ్ సరిగా లేకుంటే భూటాన్ లోకి అనుమతించరు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే ఆధార్ ఒరిజనల్ ఫుల్ సైజు ప్రభుత్వం ఇచ్చిన కార్డు(కలర్ జిరాక్స్ తీసి లామినేట్ చేసిన కార్డు కాదు.) తోపాటు ఓటర్ కార్డు ఒరిజినల్ కాని పాస్ పోర్టు ఒరిజినల్ కాని తెచ్చుకోండి ఏ ఇబ్బంది ఉండదు.
**7) అందరు వెంట తెచ్చు కోవాల్సిన వస్తువులు,ఇతర జాగ్రత్త సూచనలు.**
లగేజి జాగ్ర త్తలు.-వారం రోజుల యాత్రకు సరిపడ 5,6 జతల బట్టలు అదనంగా తెచ్చుకుంటే చాలు.అలాగే మీ లగేజిలో 2టవల్స్ ,బెడ్ షీట్(ట్రైన్ లో అవసరానికి)సోపు(2 చిన్న సోపులు,2టవల్స్ జంటగా వచ్చే లేడిస్, జెంట్స్ విడివిడిగా తెచ్చుకోండి.వాటి అవసరం భువనేశ్వర్,న్యూ జల్పాయిగురి లో కేవలం స్నానం కోసం హోటల్ రూంలలో లేడీస్ జెంట్స్ విడివిడిగా వెళ్ళినప్పడు అవసరం పడుతుంది),పేస్ట్, డైలి వేసుకునే మందులు, అలాగే ఇతర అత్యవసర టాబ్లెట్లు అంటే జ్వరానికి డోలో,మోషన్ కంట్రోల్, వాంప్టింగ్ కంట్రోల్ తదితర టాబ్లెట్స్ తెచ్చుకోండి.
లగేజి బ్యాగు ఒక్కరు 10 కిలోలు దాటకుండా మనిషికి ఒక్క బ్యాగు మాత్రమే తెచ్చుకోవాలి. విడిచిన బట్టలు వేసుకోవడానికి పెద్ద ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి.అలాగే ఇంట్లో ఉన్న మరికొన్ని ప్లాస్టిక్ కవర్స్ కూడా పెట్టుకోండి, మొబైల్ తడువకుండా, ఎక్కడైనా ప్రసాదాలు తీసుకున్న రకరకాల సందర్భాల్లో పనికి వస్తుంటాయి కాబట్టి…(వర్షకాలంలో ఐతే లగేజి లో ఒక గొడుగుకాని పల్చటి రేయిన్ కోటు కాని ఖచ్చితంగా తెచ్చుకోండి. గొడుగు సర్వవేళల మీతో పాటే ఉండాలి,అంతే తప్ప గొడుగు తెచ్చుకొని లగేజి బ్యాగులో పెట్టుకోరాదు.)
విలువైన బంగారు అభరణాలు తెచ్చుకోవద్దు,ట్రైన్ లోకిటికీలు తీసి లేడిస్ అటువైపు తలపెట్టి పడుకోవద్దు.అలాగే మని హ్యాండు బ్యాగుల్లో పెట్టి తలపక్కకు హ్యండు బ్యాగులు పెట్టి లేడీస్ కు పడుకోవడం అలవాటు.రాత్రి పూట దిగే ఏ ప్రయాణికుడో మీరు నిద్రలో ఉన్నప్పుడు వాటిని పట్టుకుని దిగుతారు కాబట్టి ఆ పొరపాట్లు చేయకండి.యాత్రలో సర్వవేళల్లో మీ బంగారం,డబ్బులు జాగ్తత్ర జాగ్రత్త అని ముందే 100 సార్లు చెపుతున్నాను.పిక్ పాకెటర్స్, బంగారం గొలుసులు కొట్టేసేవారు గుళ్ళకు పోయివచ్చేప్పుడు, రోడ్ మీద నడిచేప్పడు, ట్రైన్ ప్రయాణంలో ప్రతిదగ్గర ఉంటూనే ఉంటారు కాబట్టి ఎవరి జాగ్రత్తల్లోవారు నిరంతరం ఉండాలి.ఒక్కసారి డబ్బులో ,నగలో పోయిన తరువాత ఏ కంప్లైంట్ ఇచ్చిన ఏ ప్రయోజనం ఉండదు.కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారు ముందే ఉండాలి.
వెహికిల్ లో ఉదయం ఎక్కేప్పుడు ఒకసారి లగేజి ప్యాక్ చేసి ఎక్కించాక తిరిగి రాత్రి రైల్వేష్టేషన్ లేదా హోటల్ రూంలో దిగినప్పుడే ఆ లగేజి దింపబడుతుంది.మీకు డైలి అవసరాలు ఉండే టాబ్లెట్లు,స్నాక్స్ , గుళ్ళో పెట్టే వత్తులు, చీరెలు తదితర పూజ సామాగ్రి ఏదైన ఉంటే అవన్ని మీతో పాటే విడిగా హ్యండుబ్యాగులో మీసీటు కింద పెట్టుకోవాలి. అంతే తప్ప ఒక్కసారి వెహికిల్ పైకి ఎక్కించిన తరువాత వాటిని మళ్ళి కిందకు దించడం ఎట్టిపరిస్థుతుల్లోను ఉండదు.
*8)*** ఫుడ్ *****
ఏ యాత్రలో కూడా అప్ డౌన్ ట్రైన్,ఫ్లైట్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంటు ఉండదు. ట్రైన్ జర్నీలో లో మొదటి రోజు తినడానికి హోంఫుడ్ తెచ్చుకోండి. మర్నాడు భువనేశ్వర్ లో దిగిన తరువాత నుండి మళ్ళి రిటర్న్ లో గౌహతిలో ఫ్లైట్ ఎక్కే ముందు లంచ్ వరకు యాత్ర మొత్తంలో మా తరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉంటుంది.అప్ డౌన్ ట్రైన్స్ లలో మీరు అరెంజ్ చేసుకోవాలి.యాత్రలో ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం మీల్స్ తో కూడిన లంచ్,డైలి మధ్యహ్నం లంచ్ తో పాటు 1లీటర్ మినరల్ వాటర్ బాటిల్,(ఒక్కసారి మద్యహ్నం మాత్రమే) సాయంత్రం టీ,మరియు రాత్రి అల్పాహారం ఉంటుంది(అల్పాహరం అంటే ఏదేని టిఫిన్ ..డిన్నర్ అని కాదని గమనించగలరు) యాత్రలో ఇంటిదగ్గర తిన్నంత టైమ్ ప్రకారం తినడం వీలుపడదు ఒక్కోసారి కొంచెం ముందుగా, కొంచెం వెనుకగా తింటాం కాబట్టి షుగర్ టాబ్లెట్స్ లాంటివి వేసుకునేవారు ఖచ్చితంగా లైట్ స్నాక్స్,బిస్కెట్స్ తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి. అందరు మీకు ఇష్టమైన ఒక చిన్న పచ్చడి బాటిల్ పెట్టుకోండి.యాత్రలో మీకు సౌకర్యంగా ఉంటుంది.
*9)****మొబైల్ ఆప్ లు, డాటా రోమింగ్ సెట్టింగ్స్…*****
మీ మోబైల్ లో సెట్టింగ్స్ మీరు గాని పిల్లల ద్వారా గాని కొన్ని చేయించకోండి.అవి చాలామందికి మొబైల్ లో Data Roaming ఆన్ లో ఉండదు.బయటి రాష్ట్రాలకు వెళ్ళనప్పుడు డాటా రోమింగ్ ఆన్ లో ఉంటేనే మీ మొబైల్ లో ఇంటర్ నెట్, వాట్సప్, యుట్యూబ్ లు పనిచేస్తుంటాయి.చాలామంది మొబైల్ లో ఇది ఆన్ చేసి ఉండదు.కాబట్టి ఈరోజే మీరు గాని మీ పిల్లలతోకాని మొబైల్ లో సెట్టింగ్స్ లో కి వెళ్ళి Data Roaming ఆన్ చేయించుకోండ. అలాగే గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి Where is My Train అనే ఆప్ ను ఇన్ స్టాల్ చేయించుకోండి. దాంట్లే దేశంలోని ఏ ట్రైన్ అప్ డేట్ టైమింగ్ వివరాలను ఆ ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి స్పాట్ లో లైవ్ లో చెక్ చేసుకోవచ్చును.మన ప్రయాణంలో మొత్తం 6ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆప్ మీకు ఎంతగానే ఉపయోగ పడుతుంది.మనం ఎక్కాల్సిన ట్రైన్ మనం ఎక్కాల్సిన స్టేషన్ కు ఎంత సేపట్లో వస్తుంది ఇంకా ఏ ఫ్లాట్ ఫాం మీదకు వస్తుంది అలాగే మనం దిగాల్సిన స్టేషన్ ఎంత దూరంలో ఎంత సేపట్లో వస్తుంది అనేది ఎవరిని అడుగనవసరం లేకుండానే మీ అంతటే మీరే స్వయంగా ఈ ఆప్ లో చూసుకోవచ్చును. ట్రైన్ టైమింగ్స్ దీంట్లో కరెక్టుగా చూపించిన ఏ ఫ్లాట్ ఫాం మీదకు మనం ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది అనేది దీంట్లో నమ్మడానికి వీలు పడదు , ఒక్కోసారి సికింద్రాబాద్ లాంటి పెద్ద స్టేషన్ లలో స్పాట్ లో రైల్వేవారు ఫ్లాట్ ఫాంలను మారుస్తుంటారు.
*10)**ఫైనల్ సూచనలు.***
యాత్ర అంటే జీవితకాలం మధురైమన తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన విషయం.మనం వెళ్ళేది తీర్థయాత్ర కు తప్ప పంక్షన్ కు కాదు.చిన్న విషయాల దగ్గర పట్టించుకుని గొడవపెట్టడం చేయరాదు. తీర్థ యాత్ర అన్నాక యాత్రలో కామన్ గా కొన్ని ఇబ్బందులు సమయం సరిపోకపోవడం,టైం ప్రకారం యాత్ర పూర్తి చేయడం లాంటివి ఉంటాయి. వాటన్నింటిని ఒపికతో సర్దుకుపోవాలి.విడిగా ఏమైన ఇబ్బందులు ఉంటే నాతో విడిగా చెప్పాలి. యాత్రలో బస్ లో ట్రైన్ లో తిరిగేప్పుడు ప్రయాణంలో మనం చూసేది కేవలం టెంపుల్సే కాదు,అక్కడ ఉన్న పక్రుతి,నదులు,పల్లెలు ,పట్టణాలు,కొండలు,కోనలు, మార్గ మద్యంలో వచ్చే పంటలు,అడవులు,ప్రజలు, వారి డ్రెస్సింగ్,వారి ఆచార వ్యవహారాలు,వారి ఫుడ్ హాబిట్స్ ఇలా ప్రతిదాన్ని చూసి ఎంజాయ్ చేయాలే తప్ప మనం తరువాత వెళ్ళాల్సిన టెంపుల్ లేదా ఊరు ఇంకా ఎంత సేపట్లో వస్తుంది ఎప్పుడు చేరుకుంటాము అని ఎదురు చూడరాదు అలాగే మాటి మాటికి అడుగరాదు, దిగాల్సిన ఊరు టెంపుల్ వచ్చాక నేను ఎలాగు చెపుతాను కదా.యాత్రలో ప్రతిరోజు ఈ రోజు ఏమేం చూస్తాం , ఒకటి చూసిన తరువాత ఇప్పుడు తరువాత ఎక్కడికి వెళుతున్నాం అని ప్రతిసారి చెపుతాను..దిగాల్సింది ఎంతదూరం అని కుతుహలం ఉన్న గూగుల్ మ్యాప్ లో చూసుకోగలరు, కిలోమీటర్ల దూరం,టైంతో సహా కనపడుతుంది.
యాత్ర అంటేనే టైం మేనేజ్ మెంట్. గుళ్ళోకి వెళ్ళినప్పుడే అక్కడ మేము రెగ్యులర్ గా దర్శనానికి పట్టే టైం సుమారుగా లెక్కవేసుకునే రిటర్న్ వచ్చే టైం , రిటర్న్ లో వెహికిల్ ఎక్కాల్సిన ప్లేస్ చెపుతుంటాం.అవన్ని యాత్రికులు ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించి టైం ప్రకారం వెహికిల్ దగ్గరకు చేరుకోవాలి. ప్రతి యాత్రలో కేవలం ఒకరిద్దరి నిర్లక్షపూరిత లేట్ గా వెళ్ళే అలవాట్లు , మనం కాసేపు లేటుగా వెళితే ఏమవుతుందులే మనం కోసం వెహికిల్ ఆగదా అనే మనస్థత్వం కారణంగా యాత్ర ప్రొగ్రం మొత్తం తలకిందులు అవుతుంది.అలా లేట్ గా వచ్చేవారికోసం వెహికిల్,ట్రైన్ ఆగదు,ముందుకు వెళుతుంది,లేట్ కామర్స్ విడిగా వెహికిల్ లో రావాలి. ఏదేని గుళ్ళో మేయిన్ గుడి దర్శనం చేసుకుని రావాలి తప్ప మన హిందుటెంపుల్స్ లలో ప్రధాన గుడి కాకుండా ఆదే గుడి ప్రాంగాణంలోనే మరెన్నో ఉప దేవాలయాలు ఉంటాయి.వాటని అన్నింటిని దర్శనం చేసుకుని రావలంటే అక్కడే గంటలు పడుతుంది.అలాంటప్పుడు ఒకే రాష్ట్రం యాత్ర వారం పెట్టుకుంటే రోజుకో టెంపుల్ చొప్పున అది పాజిబుల్ అవుతుంది కాని మనలాంటి యాత్రలో 4 రాష్ట్రాలు 1దేశం తిరిగే యాత్రలో సెట్ కాదు.అలా తిరగాలంటే ఇదే యాత్ర కనీసం నెలరోజలు యాత్ర ఖర్చు 1 లక్షరుపాయలు అవుతుందని గమనించగలరు. కాబట్టి మన యాత్ర ప్రోగ్రాంలో ఉన్న టెంపుల్స్ విజిట్ మాత్రమే చూస్తాము తప్ప ఇతరాత్ర వీలుపడదు.
ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా, ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
ధన్యవాధములతో.. ఇట్లు..రవీందర్,శ్రీటూర్స్. 8985246542
Very nice