శ్రీటూర్స్ 3-6-24 నేపాల్ యాత్ర సూచనలు..రవీందర్,శ్రీటూర్స్-8985246542
- నేపాల్ యాత్రకు హైదరాబాదు ఏయిర్ పోర్టు నుండి జూన్ 3వ తేధిన ఇండిగో ఫ్లైట్ ఉదయం 7.45 కు బయలుదేరుతారు. ఉదయం 7.45 ఫ్లైట్ అంటే అంతా ఆలస్యం లేకుండా ఇంటిదగ్గర ఉదయం స్నానం చేసి బయలుదేరి ఉదయం 5.30 కల్లా ఖచ్చితంగా షంషాబాద్ ఏయిర్ పోర్టు చేరుకోవాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు +మీ మొబైల్ లో ఉన్న ఫ్లైట్ టికెట్ సెక్యూరిటికి చూపించి ఇండిగో కౌంటర్ వద్దకు చేరుకోండి. అక్కడ మీ లగేజి అప్పచెప్పండి(తక్కువ బరువున్న లగేజితో వస్తే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది) ఎవరు 10 కిలోలు బరువు దాటని బ్యాగులు మాత్రమే తెచ్చుకోండి.ఫ్లైట్ లో 15 కిలోలు అలౌ చేస్తారని 15 కిలోల బరువుతెస్తే డైలి వెహికిల్ లో ఆబ్యాగ్ మీరే వెహికిల్ పైకి ఎక్కించాలి దించుకోవాలని గమనించగలరు. ఇండిగో కౌంటర్ లో లగేజి అప్పచెప్పడంలో అరగంట గడుస్తుంది , తరువాత సెక్యూరిటి చెకింగ్ దగ్గర మరో అరగంట,గంట గడుస్తుంది, సెక్యూరిటి చెకింగ్ నుండి మీకు ఇచ్చిన బోర్డింగ్ పాస్ లో ఉన్న గేట్ దగ్గరకు వెళ్ళడానికి మరో పావుగంట గడుస్తుంది. గేట్ దగ్గర్నుండి ఫ్లైట్ ఎక్కడానికి మరో అరగంట గడుస్తుంది. అందుకే అంతా ఖచ్చితంగా 5.30 కల్లా ఏయిర్ పోర్టు చేరుకోవాలి. దేశంలో ఎక్కడికి ఫ్లైట్ ప్రయాణం ఉన్న ఖచ్చితంగా 2.30 టూ 3గంటల ముందు,ఇంటర్నేషనల్ ప్రయాణానికి 4గంటల ముందు చేరుకోవడం తప్పనిసరి. మార్నింగ్ ఫ్లైట్ లో లేదా ఏయిర్ పోర్టు లాంజ్ లో తినడానికి చపాతి లేదా పులిహోర,ఉప్మా లాంటి లైట్ ఫుడ్ తెచ్చుకోండి. మీరు బైధ్యానాధ్ చేరకున్న తరువాత మధ్యహ్నం నుండే మా తరుపున లంచ్ ప్రోగ్రాం ఉంటుందని గమనించగలరు. ఈ ఫ్లైట్ భైధ్యనాధ్ కు డైరెక్టు ఫ్లైట్ కాకుండా వయా డిల్లి లేఓవర్ అంటే డిల్లిలో మరో ఫ్లైట్ మారి ధియేగర్(భైధ్యనాధ్) చేరుకుంటారు. డిల్లి ఏయిర్ పోర్టు టెర్మినల్ 3లో ఫ్లైట్ చేంజ్ అవుతుంది. టెర్మినల్ 3లో ఫ్లైట్ దిగి ఏయిర్ పోర్టు బయటకు వెళ్ళకుండా ‘‘ ఏయర్ పోర్టు లోపలే ఉన్న ఇంటర్నల్ ట్రాన్స్ ఫర్ గేట్’’ ద్వారా మరో ఫ్లైట్ కు వెళ్లాలి. మరో ఫ్లైట్ ఎక్కేముందు కూడా సెక్యూరిటి చెకింగ్ మళ్ళి ఉంటుంది. కాబట్టి డిల్లి లో ఫ్లైట్ దిగగానే ఏ ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా గభా గభా ఇంటర్నల్ ట్రాన్స్ ఫర్ గేట్ లో నుండి మీ గేట్ దగ్గరకు చేరుకోండి. (హైదరాబాదు ఏయిర్ పోర్టులోనే 2 బోర్డింగ్ పాస్ లు ఇస్తారు 1) హైదరాబాదు టూ డిల్లి 2) డిల్లి టూ ధియోగర్..(ముఖ్య గమనిక**వితౌట్ ఎని ఇంటిమేషన్ ఫ్లైట్ ఎక్కే గేట్ నెంబర్స్ 2 ఏయిర్ పోర్టుల్లో కూడా చివరి టైంలో మారవచ్చును..అందుకే తప్పకుండా ఏయిర్ పోర్టుల్లోని డిస్ ప్లే బోర్డులు చూస్తుండండి.లేదా అక్కడ ఉన్న ఇండిగో స్టాఫ్ ను అడగండి.మీరు మధ్యహ్నం థియోగర్ ఏయర్ పోర్టులో దిగేసరికి నేను ఎయిర్ పోర్టులో బ్యాటరి ఆటోలతో రెడిగా ఉంటాను. ఏయిర్ పోర్టు టూ టెంపుల్ 5 కిలోమీటర్ల ప్రయాణం..(గమనిక ** జార్కండ్ భైధ్యానాద్ జ్యోతిర్లింగం దర్శనంలో టెంపుల్ దగ్గరి వరకు బ్యాటరి ఆటోలు మాత్రమే చేరుకుంటాయి.పెద్ద వెహికిల్స్ అయితే టౌన్ అవతలే ఆపేస్తారు) భైధ్యానాద్ జ్యోతిర్లింగం దర్శనంకు అంతా స్పెషల్ దర్శనం టికెట్ రూ.250 అంతా తీసుకోవాలి. లేకుంటే ఉచిత దర్శనంకు లైన్ లో 4గంటలు పడుతుంది. స్పెషల్ దర్శనం టికెట్ తో అరగంటలో దర్శనం అవుతుంది. ఈ గుళ్ళో + యాత్ర మొత్తం మీద మీ డబ్బులు,బంగారం లాంటివి జాగ్రత్త అని మరి మరి 10 సార్లు హెచ్చరిస్తున్నాను. పిక్ పాకెటర్స్ ప్రతిదగ్గర ఉంటారు. మీ డబ్బులు,బంగారం జాగ్రత్త….అరగంటలో దర్శనం కాగానే మధ్యహ్నం లంచ్ చేసి 10 కిలోమీటర్ల దూరంలోని జైసిడి రైల్వేస్టేషన్కు బ్యాటరి అటోల్లోనే వెళుతాం. సాయంత్రం 4గంటలకు దర్బంగా కు ట్రైన్ ఉన్నది. నైట్ 10.50 కు దర్బంగా చేరకుని అక్కడే హోటల్ రూంలో నైట్ స్టే ఉంటాము. మర్నాడు ఉదయం అంటే జాన్ 4 న నేపాల్ లోని జనక్ పూర్ దర్శనం చేసుకుని నైట్ కల్లా రాజధాని ఖాట్మండు చేరుకుంటాం. మిగితా యాత్ర ప్రోగ్రాం అంతే ఏరోజుకు ఆరోజు ముందు రోజు + అదే రోజు ఉదయం వివరించడం జరుగుతుంది.రిటర్న్ ఫ్లైట్ 9న మధ్యహ్నం దర్బంగా నుండి హైదరాబాదుకు డైరెక్టుగా ఉన్నది.జూన్ 9 సాయంత్రం 5గంటలకు హైదరాబాదులో ఉంటాము.
సీతమ్మ వారు భూమి స్వయంభువుగా , అయోజినిగా భూమినుండి ఉద్భవించిన పరమ పవిత్ర క్షేత్రం సీతమడి దర్శనం అదనంగా చూపించడం జరుగుతుంది. ఆ కారణంగా రిటర్న్ లో రాక్సల్ టూ దర్భంగాకు రిటర్న్ ట్రైన్ లో కాకుండా వెహికిల్ లో వచ్చి సీతమడి దర్శనం చేసుకుని దర్భంగాలో ఏయిర్ పోర్టుకు వెళుతాము..
2) నేపాల్ యాత్రలో దర్శించుకునే క్షేత్రాలు **
1)ముక్తినాధ్ క్షేత్రం
2)పోకారా-బిందబాసిని టెంపుల్,
3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,
4)పీవాలేక్,
5)మనోకామన దేవి
*ఖాట్మండ్ నగర దర్శనం*
6) పశుపతినాధ్ టెంపుల్,
7)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్),
8)గుహ్యేశ్వరి శక్తిపీఠం భౌధ్దస్తూప (యునెస్కో సైట్)
9) స్వయంభునాధ్ టెంపుల్,
10) జనకపురి (జనక్ మహల్- సీతాదేవి చిన్నప్పటి నుండి పెరిగిన క్షేత్రం, జనకమహారాజు సీతాదేవి స్వయంవరం జరిపిన ప్రదేశం)
(*నేపాల్ దేశ యాత్రకు ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. )
- నేపాల్ యాత్రలో గమనించాల్సినవి…. ఇండియన్ రూపికి నేపాలి రూపి కరెన్సి డిఫరెన్స్ ఒక్క ఇండియన్ రూపికి నేపాలి 1.60 పైసలు.. అంటే 50 ఇండియన్ రూపీస్ = 80 నేపాలి రూపీస్…100 ఇండియన్ రూపీస్ = 160 నేపాలి రూపీస్ ,,,500 ఇండియన్ రూపిస్ = 800 నేపాలి రూపీస్ ..1000 ఇండియన్ రూపీస్ = 1600 నేపాలి రూపీస్….
4)7రోజుల యాత్రకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్,రూ.25,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పేచేయాలి. (యాత్ర బేస్ ప్యాకేజి రూ.35,000తో పాటు అదనంగా దిగవున వర్తించే ఎ.సి.ట్రైన్స్,ఎ.సి.రూంలు, ఫ్లైట్స్ తదితర చార్జీలు ముందుగా యాత్ర అడ్వాన్స్ తో పాటే నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేయవలెను. ఫ్లైట్ రేటు అప్ డౌన్ రూ.11,000 దాటితే అదనం చార్జీలు యాత్రికులే భరించాలి.Impornant note- If Flight cost updown price crosesses Rs.11,000, additional price should pay by yatries only.
5) వెహికల్ లో డైలి ఒక సీటు చొప్పున అందరు ఒక వరుస వెనక్కి జరుగాలి.సీట్లు అందరకి రొటేషన్ మీద వస్తాయి.If any Health problem , seniors etc fixed front seates rs. 1000 extra each.
6*)హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.(for singles separate single room Rs.5000 extra.)నేపాల్ యాత్రలో నాన్ ఎ.సి.హోటల్ రూంలోలలో స్టే( దర్భంగా, ఖాట్మండు,పోకారా ఎ.సిరూంలకు(with lift) ఒక్కిరికి రూ.2000 అదనం. .
7*) (3*) యాత్రకు అంతా 5 జతల బట్టలు,బెడ్ షీట్, టవల్ ,సోపు,అవసరమైన టాబ్లెట్స్,మెడిసిన్స్, వెచ్చటి చలి దుస్తులు(స్వెట్టర్స్ లాంటివి) రేయిన్ కోట్ తదితరాలు తప్పకుండా తెచ్చుకోవాలి… నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం.
8*)యాత్రలో బస్,మిని బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, రోప్ వే,బోటింగ్ చార్జీలు, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.ఎంట్రన్స్ టికెట్స్,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం example. Mano kamana ropeway INR Rs700 , Muktinath permit charge INR Rs. 800 extra. Doli @ Mukthinath INR Rs.4000 Extra, Horse @ Mukthinath INR Rs.2000 Extra.
9) ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,రాత్రికి అల్పాహారం మేము కల్పించే ఫుడ్ నచ్చని వారికి ఫ్లాట్ గా ఫుడ్ అమౌంట్ రూ.2500 రిఫండ్ ఇవ్వబడును.దాంతో యాత్రికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. .
10) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో రావలెను. నేపాల్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు. లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా పాస్ పోర్టు తెచ్చుకోవాలి.
11)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..
12) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా ఇవ్వవలెను.
13) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం రోజులకన్నా లేటైతే అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలని గమనించగలరు. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
14. https://www.youtube.com/watch?v=5fbIuXdYcHw&t=138s
డైలి 1 గంట స్పీడ్ నడక, బ్రీతింగ్ ఎక్స్ ర్ సైజులు చేయండి. ముక్తినాధ్ 3000 మీటర్ల ఎత్తుపైనున్న క్షేత్రం కాబట్టి ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి…కర్పూరం బిల్లలు, వాము తెచ్చుకోండి , అక్సిజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు పీల్చుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు ఎలా చేయాలో చూపించే వీడియో ఇది.
Comment (0)