**వైష్ణోదేవి విత్ జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ యాత్ర తేధి 16-03-25 బై అప్ డౌన్ ఫ్లైట్* విత్ నాన్ ఎ.సి.హోటల్ రూం,ఫుడ్,వెహికిల్ తో ఒక్కరికి రూ.40,000 . సంప్రదించండి.శ్రీటూర్స్-8985246542.
(*బై అప్ డౌన్ ఫ్లైట్ (హైదరబాదు ఏయిర్ పోర్టు టూ అమ్రుత్ సర్ రిటర్న్ శ్రీనగర్ టూ హైదరాబాదు .) ముఖ్య గమనిక వైష్ణోదేవి దగ్గర కొండపైకి హెలికాప్టర్ బుకింగ్ కావల్సిన వారు త్వరగా బుక్ చేసుకోగలరు.
**1) జమ్ము- వైష్ణోదేవి,చినాబ్ రివర్, బాబా సిహాద్ వాటర్ ఫాల్స్.+జమ్ము-రఘునాధ టెంపుల్ (వైష్ణోదేవి విజిట్ 19-3-25న, హెలికాప్టర్ ఈ తేధికి సేమ్ డే అప్ డౌన్ బుక్ చేసుకోవాలి)
**యాత్రకు బుక్ చేసుకునే వారు గూగుల్ పే (from your google pay 8985246542 , ShreeTours ) కు రూ.30,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పేచేయగలరు.
**యాత్రలో హోటల్ రూంలలో 7 -నైట్స్ స్టే , @ 1 రాత్రి అమ్రుత్ సర్- పంజాబ్, 1 నైట్ చాముండా దేవి- హిమాచల్ ప్రదేశ్, వైష్ణోదేవి కాట్రలో 2 రాత్రులు- 2 నైట్స్ శ్రీనగర్. 1 నైట్ పహల్ గాం,నాన్ ఏ.సి.రూంలు(అక్కడ చల్లదనం కారణంగా ఎ.సి.అవసరం ఉండదు)
హోటల్ రూం డబుల్ షేరింగ్(రూంకు ఇద్దరు) యాత్ర ప్యాకేజి రూ.40,000, సింగిల్ షేరింగ్ యాత్ర ప్యాకేజి రూ.45,000. *అమౌంట్ పేచేసిన పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు మీ ఆధార్ కార్డులను మా వాట్సప్ నెంబర్ 8985246542 కు పంపగలరు .బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.1000 అదనం,మిగితావారు మొదటి రోజు సీరియల్ లిస్ట్ ప్రకారం , మిగితా రోజుల్లో ప్రతిరోజు ఉదయం హోటల్ రూం ఖాళి చేసాక రోజు వారిగా పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ సీట్లు(ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా)
గమనిక* కొండకింద బాన్ గంగా నుండి భవన్ కు (టెంపుల్) 13 కీ.మీ. కొండమీదకు గుర్రాలు, లేదా డోలీల ద్వారనే వెళ్ళిరావలెను. హెలికాప్టర్ ద్వారా కొండపైకి వెళ్ళివద్దామనుకునేవారు ఆలస్యం లేకుంటే త్వరగా యాత్రకు బుక్ చేసుకోగలరు. హెలికాప్టర్ బుకింగ్ ఇనఫర్మేషన్ యాత్రకు బుక్ చేసుుకున్నవారికి విడిగా తెలియచేయబడుతుంది.
****వైష్ణోదేవి యాత్ర చేయడానికి సలహాలు,సూచనలు, టర్మ్స్ అండ్ కండీషన్స్.***
1. . ఆధార్ కార్డ్ ఒరిజినల్ +6 జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవలెను.
2) అన్ని రకాలుగా ముందే హోటల్ రూంలకు, వెహికిల్స్ కు పేమెంట్ చేసి బుక్ చేసి ఉంటాం కాబట్టి ఒక్కసారి నాన్ రిఫండబుల్ గా అడ్వాన్స్ పేచేసిన తరువాత మీరు బాధపడవద్దు, మమ్మల్ని బాధపెట్టవద్దు, అందుకు సిద్దపడ్డవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరని మరోసారి క్లియర్ గా చెపుతున్నాము…..**
4) ఫుడ్. ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం ఉంటుంది.
5) హోటల్ రూం 2గురికి 1 రూం,(ఫ్యామిలికి /లేదా భార్యభర్తలకు 1 రూం.) సింగిల్స్ వచ్చినప్పుడు సెపరేట్ రూంకోసం రూ.5000 అదనం చార్జీ తో ఈ ప్యాకేజి రూ.45,000.
6 ) వెహికిల్-యాత్రకు వచ్చే వారి సంఖ్యను బట్టి అన్నీ సీట్ల బస్ ఉంటుంది. * ( వెహికిల్ మరియు హోటల్ రూంలు నాన్ ఎ.సి. ఉంటాయి. కాశ్మీర్ లో చల్లదనం కారణంగా ఎ.సి.అవసరం ఉండదు. )
7) గుర్రం,డోలి, హెలికాప్టర్ ,షేరింగ్ ఆటో చార్జీలు తదితరాలు అదనం. 8)బస్ లేదా టెంపో ట్రావెలర్ వెళ్ళని చోట వర్తించే దగ్గర ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్, రోప్ వే , గుర్రం,డోలి,హెలికాప్టర్ తదితర చార్జీలు,పూజ అభిషేకాల చార్జీలు అదనం.యాత్రలో బస్ వెళ్ళడం వీలుపడని ప్రదేశాల్లో షేరింగ్ ఆటో ఖర్చులు ప్రయాణికులే భరించాలి..
9) యాత్రలో ఇతరాత్ర ఏ కారణాల కారణంగానైనా యాత్ర ప్రదేశాలు మార్చవలిసి వస్తే అందరి సౌకర్యం కోసం టూర్ ఇటినరిలో స్వల్ప మార్పులు చేసే అంతిమఅధికారం టూర్ ఆపరేటర్ కు ఉంటుంది. యాత్రకు వచ్చే ముందు వాకింగ్, బ్రీతింగ్ ప్రాణాయమం నెలముందు నుండి సాధనచేయాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు +5 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి.
10)యాత్రలో పక్రుతివిపత్తులు,ఆనారోగ్య సమస్యలు తదితర ఎలాంటి అనుహ్య సంధర్భాలు ఎదురైనా యాత్రికులు అదనపు ఖర్చులు భరించి తమ స్వంత బాధ్యతమీదనే యాత్రకు రావలెను.యాత్రలో ఒకవేళ ఏదైనా అకస్మాత్తుగా ఏర్పడే ఆనారోగ్యం, ఇతర విపత్కర పరిస్థితులకు అయ్యే అదనపు ఖర్చులన్ని యాత్రికులు, లేదా వారి తత్సంబందికులు, బంధువులు భరించాలి.టూర్ ఆపరేటర్ ప్రాధమిక విధి మీకు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేసి అన్ని ప్రదేశాలు చూపించడం మాత్రమే అని మర్చిపోరాదు.
11)యాత్రికుల ఆలస్యం చేయడం కారణంగా ఫ్లైట్ మిస్ కావడం తప్పిపోవడం కారణంగా ఒక వేళ యాత్రా రోజులు పొడిగించబడిన,యాత్ర నిర్ధారిత రోజులు దాటిన అదనంగా తిరిగి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సివచ్చిన అంతకు తగ్గ అదనపు ఖర్చును యాత్రికులే భరించవలెను. యాత్రలో టూర్ ఆపరేటర్ చెప్పిన దర్శనం సమయాలు సరిగ్గా పాటిస్తే అంతా సవ్యంగానే జరుగుతుంది.ఇందుకు సిద్దపడ్డవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోవలెను.
*****
యాత్రా ప్రదేశాలు – విశేశాలు.
వైష్ణోమాత దేవాలయం, కాట్ర,జమ్ము కాశ్మీర్.వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. ఈ కొండ ఎక్కినప్పుడు మీకు మీకు బాహుబలి సినిమాల లోని కొండలు లైవ్ గా కనపడుతాయి.దూరంగా మంచు, అతి ఎత్తైన కొండలు, భారి లోయలు,మరో ప్రపంచం మీకు ఇక్కడ దర్శనమిస్తుంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపుస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్రాలో ఉంది. ఈ ఆలయ వార్షికాదాయం వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. స్థల పురాణం జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేము. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు కొన్ని లక్షల సంవత్సరములుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతముగా ఋగ్వేదములో చెప్పబడిన పర్వతసమూహము ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదములో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది. ఆ జగజ్జనని ఆదిశక్తి స్వరూపమే వైష్ణోదేవి మాతగా ఇతిహాసం చెపుతుంది.దక్షినాన శ్రేవేంకటేశ్వర స్వామి ఆలయం ఎంత కిటకిటలాడుతుందో, ఉత్తరాన వైష్ణోదేవి ఆలయం భక్తులతో అంతగా కిటకిటలాడుతుంటుంది.కొండకింద బాన్ గంగా నుండి కొండమీద భవన్ అమ్మవారి టెంపుల్ వరకు సంవత్సరంలో 365 రోజులు, పగలు రాత్రి అని తేడా లేకుండా , పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అమ్మవారి దర్శనానికి నడుస్తూనే ఉంటారు. వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతములో ఉంది. కురుపాండవ సంగ్రామమునకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతము చెపుతోంది. ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాయి. ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి. దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు. 24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి. ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు. కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. దాన్నే డోలీ అంటారు.
జ్వాలాముఖి క్షేత్రం -అష్టాదశ శక్తి పీఠం…హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కల్గిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పిలవబడుతున్నదే జ్వాలాముఖీ క్షేత్రం. అలనాడు పార్వతీ దేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండడం విశేషం.హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.శక్తి పీఠాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశం నేటికీ ఓ మిస్టరీనే. ఈ మిస్టరీని తెల్సుకునేందుకు ప్రయత్నించినవారికి ఇది ఓ అంతబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోక పోవడం గమనార్హం. ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవడం గొప్ప విషయమని స్థానికులు చెబుతారు. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండడం వల్ల జ్వాలా దేవి అనే పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది.
వజ్రేశ్వరి దేవి – కాంగ్రా లోయ యిక్కడ వున్న వజ్రేశ్వరి దేవి మందిరం వల్ల దేశ వ్యాప్తంగా ప్రసిద్ది పొందింది . ఈ దేవిని కాంగ్రా దేవి అని కూడా అంటారు . .జ్వాలముఖి నుండి ధర్మశాల వెళ్ళేదారిలో కాంగ్ర వస్తుంది. కాంగ్ర జిల్లా కేంద్రం కూడా. లోపల మందిరం కొత్తగా కట్టిన కట్టడం . గదలు ధరించిన ద్వార పాలకులు , లోపల గర్భగుడిలో వజ్రేశ్వరి దేవి ‘ పిండి ‘ ( రాయి ) రూపంలో పూజలు అందుకుంటోంది కోవెల ప్రాంగణం లో చిన్న మందిరం ‘ భైరవనాధ్ ‘ కి సమర్పించబడింది . నాలుగు చేతుల దుర్గాదేవి సింహవాహనం మీద కూర్చుని వున్న విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది .
చింత పూర్ణిమ దేవి – హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది.జ్వాలముఖి శక్తిపీఠం దగ్గరలో ఉన్న పవిత్రమైన శక్తిపీఠం. చింతపూర్ణి లో అమ్మవారి పాదాలు పడిన చోటు.
చాముండా దేవి – హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో హిందూ దేవత చాముండా దేవి యొక్క ప్రసిద్ధ ఆలయం ప్రతిష్టాత్మకంగా ఉంది . ఈ ఆలయం బానర్ నది ఒడ్డున ఉంది మరియు ఆధ్యాత్మికత మరియు దైవత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇది 16 వ శతాబ్దంలో నిర్మించబడిన పాత దేవాలయం మరియు ఇది దుర్గా స్వరూపమైన చాముండ దేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని “శివుడు” మరియు “శక్తి” నివాసస్థలం అని పిలుస్తారు కాబట్టి దీనిని “చాముండ నందికేశ్వర్ ధామ్” అని కూడా పిలుస్తారు .
Duration
8D/7N
Tour Type
Specific Tour
Group Size
40 people
Languages
Hindi, Telugu
Included/Excluded
Hyderabad to Srinagar Return to Hyderabad updown Flight, Non A.C Bus/Mini bus ,Non A.C Hotel Rooms 2 nights in Srinagar, 2 nights at Balthal Tents,Food.
1) Helicopter , Doli, Horse Vishnodevi
2)Entrance Tickets , small distance travel from Bus parking temple sharing auto charges, special entrance, pujas, abhishekas, Boating, Horse riding , Special Drinks , Mineral Water Etc.