4-09-2023 తమిళనాడు కు వస్తున్న యాత్రికులందరికి శ్రీటూర్స్ రవీందర్ హ్రుదయపూర్వక స్వాగతం.(ఫోన్.8985246542)

4-09-2023 తమిళనాడు  యాత్రకు సంబందించి ముఖ్య సూచనలు-జాగ్రత్తలు కింద జాగ్రత్తగా చదువగలరు.

ముఖ్య జాగ్రత్త** కింది సూచనల్లో ప్రతి పాయింట్ జాగ్రత్తగా చదివి ఆ ప్రకారంగా ఫాలో కావాలి.యూత్ర సూచనలు అంటే ఎవరికో టైంపాస్ కోసం పంపేవి కావు, మీ కోసమే టైం పెట్టి టైప్ చేసి పంపేవి ,కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరు చదవండి మీతో పాటు వచ్చే మీ సహ యాత్రికుల కు కూడా వాట్సప్ లో పంపగలరు. టూర్ లో తిరిగేప్పడు టైం విషయంలో అందరు స్ట్రిక్ట్ గా టైం మేయింటేన్ చేయాలి. అప్పుడే మన యాత్ర ఏవి మిస్ కాకుండా అన్ని చూడగలం.టూర్ మేనేజర్ ముందు చెప్పిన టైం కల్లా అంతా ఆయా క్షేత్రాల దర్శనం,పొద్దున హోటల్ రూంనుండి బయలుదేరడం చేయాలి.కొందరి ఆలస్యం చేయబట్టి కొన్ని చూసే పుణ్యక్షేత్రాలు మిస్ అయితే ఆలస్యం చేసినవారే బాధ్యత వహించాలి.టూర్ ఆపరేటర్ చెప్పిన టైం చెప్పినట్లుగా ఫాలో అయితే ఏటెంపుల్ కూడా మిస్ కాదు.

·         సికింద్రాబాద్ స్టేషన్ లో అంతా జాగ్రత్తగా ట్రైన్ లో ఎక్కేంత వరకు మీ స్వంత బాధ్యత మీదనే ట్రైన్ ఎక్కగలరు. మీరు ఎక్కే ట్రైన్ నెంబర్ 12760 ,  ట్రైన్ నేమ్.  Charminar Exp  , ఈ ట్రైన్ నాంపల్లి నుండి బయలు దేరుతుంది. సికిద్రాబాదుకు  సాదారణంగా 1వ నెంబర్ ఫ్లాట్ ఫాం మీదకు 6.15 కు  వస్తుంది.  కాని ఒక్కోసారి ఫ్లైట్ ఫాం మారుతుంది. మీరు సాయంత్రం 5.30 కే సికింద్రాబాద్ స్టేషన్ కు ఖచ్చితంగా చేరుకోవాలి.   రైల్వేస్టేషన్ లో డిస్ ప్లే బోర్డులో చూసి లేదా ఎంక్వైరిలో అడిగా మాత్రమే ఏ ఫ్లాట్ మీదకు ట్రైన్ వస్తుందో తెలుసుకుని మాత్రమే ఆ ఫ్లాట్ ఫాం మీదకు వెళ్ళి మీ స్వంత బాధ్యత మీదనే ట్రైన్ లో మీ బెర్త్ లో  కూర్చోగలరు. అంతే తప్ప ట్రైన్ వచ్చిందని మరోసారి అందరికి ఫోన్ చేసి ట్రైన్ లో ఒక్కోక్కరికి విడిగా చెప్పడం, మీ భోగిలో ఎక్కించడం జరుగదు. ట్రైన్ వచ్చేది, ఏ ఫ్లాట్ ఫాం ప్రతి వివరం వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చిన మన Whatsapp group  Tamilandu 4-9-23 Yatra చూడగలరు. మీరు సాయంత్రం 5.30కు  సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చిన తరువాత టూర్ ఆపరేటర్ రవీందర్ నా నెంబర్ కు 8985246542 కాల్ చేస్తే మీ హజరును నేను నోట్ చేసుకుంటాను.

  • ***ఈ యాత్రకు 33  మంది యాత్రికులు బుక్ అయ్యారు.అన్ని సీట్ల బస్ నే వస్తుంది. . 4 -09-23 సాయంత్రం 6.30 కు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి మన ట్రైన్ బయలుదేరుతుంది. (ట్రైన్ నేమ్, నెం. 12720  HYB JP Exp , సాయంత్రం.5.30 కే  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి. అక్కడికి చేరుకున్నాక  డిస్ ప్లే బోర్డులో ట్రైన్ నెంబర్ చూస్తే అది  ఏ ఫ్లాట్ ఫాం మీదకు వస్తుంది  అనేది క్లియర్ గా   తెలుస్తుంది. ట్రైన్ ఎక్కాక  మీకు పంపిన మొబైల్ లో ఉన్న టికెట్ చూయించండి.  అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు ముందే అందరికి క్లియర్ గా చెప్పాం కాబట్టి నైట్ ట్రైన్ లో  తినడానికి హోంఫుడ్ పులిహోర,చపాతి లాంటివి తెచ్చుకోగలరు. మర్నాడు చెన్నైలో దిగినాక ఉదయం టిఫిన్ , టీ దగ్గర్నుండి మా ద్వార ఫుడ్ పోగ్రాం మొదలవుతుంది,యాత్రలో బయట హోటల్ లోనే తినడం జరుగుతుంది. .సిటిలో దూరంనుండి వచ్చేవారు సికింద్రాబాద్  రైల్వేస్టేషన్ కు ఎంటైమ్ కి చేరుకుంటామో సుమారు అంచానా వేసుకుని ఆప్రకారం ట్రైన్ టైం కంటే ఖచ్చితంగా గంట  ముందే ఉండగలరు. మద్యలో ట్రాఫిక్ జామ్ అయ్యిందండి టైమ్ కి చేరుకోలేకపోయాం అంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. మర్నాడు ఉదయం చైన్నై  రైల్వే స్టేషన్ దిగుతాము. చేరుకుంటాము.. ట్రైన్ లో కాని మర్నాడు బస్ ఎక్కాక కాని  మీ బ్యాలెన్స్ అమౌంట్ పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ ను క్యాష్ గానే పేచేయాలి.( నో గూగుల్ పే,ఫోన్ ఫే..  క్యాష్ పేమెంట్ మాత్రమే ) చెన్నైలో ఉదయం 7.00  ట్రైన్ దిగడానికి ముందే అంతా ఉదయమే 6.30 కల్లా లేచి కాలక్రుత్యాలు తీర్చుకుని టూత్ బ్రష్ చేసుకుని   ఉండాలి. ట్రైన్ దిగాక ఎక్కడైౌనా మార్గ మధ్యంలో  స్నానం చేస్తాము. హోటల్ రూంలో ప్రెషప్  స్నానం చేసే  చార్జీలు సుమారు రూ.150 అదనం(నైట్ హోటల్ రూంలో ఉండని దగ్గర ప్రెషప్ చార్జీలు ఏ యాత్రలోనైనా అదనంగా ఉంటాయి, ఉదయం హోటల్లో ఉండని సందర్భాలు చెన్నైలో ట్రైన్ దిగాక ఒక సారి, మదురైకి నైట్ ప్రయాణం చేసి చేరుకునే ముందు మరోసారి మొత్తం 2 సార్లు ఉంటాయి )  ట్రైన్ దిగేముందే ఒక ప్లాస్టిక్ కవర్ లో జత బట్టలు,టవల్ పెట్టుకోండి. మిగితా లగేజి అంతా ఒకాసారి బస్ లో ఎక్కించాక మళ్ళి మళ్ళి దించడం ఉండదు.అందుకే ఒక్కసారి ఉదయం వెహికిల్ పైకి పంపి ప్యాక్ చేయించిన లగేజి తిరిగి నైట్  హోటల్ రూం చేరుకునే వరకు వరకు ఎక్కడ దింపబడదు.మీకు డైలి అవసరం ఉండే ఆధార్ కార్డ్,టాబ్లెట్లు,మెడిసిన్స్,ఫుడ్ ఐటంస్, ఓరిజినల్ ఆధార్ కార్డ్,3,ఆధార్ జిరాక్స్ కాపీలు, గొడుగు లేదా రేయిన్ కోట్  తప్పకుండా మీతోపాటే హ్యాండ్ బ్యాగులో బస్ లో మీ సీటు దగ్గరే ఉంచుకోవాలి.
  • తమిళనాడు లో మనం రాత్రి హోటల్స్ కుంభకోణం, రామేశ్వరం,అరుణాచలంలో (తిరువాణ్ణమాలై )లో ఉంటాము. శ్రావణ మాసం సందర్భంగా హోటల్స్ లలో నాన్ ఎ.సి.రూంలు లభ్యం కాక రామేశ్వరంలో కాకుండా కుంభకోణం,అరుణాచలంలో అందరికి  ఎ.సి.రూంలే బుక్ చేయాల్సి వచ్చింది. 3రాత్రుల ఎ.సి.రూంలకు మాములుగా రూ.1500 అదనం,కాని మీరు అడుగక ముందే లభ్యత లేక ఎ.సి.రూంలు 2 ప్లేస్ ల్లో  బుక్ చేసిన కారణంగా కుంభకోణం,అరుణాచలంలో 2 నైట్స్ ఎ.సి.రూంలకు ఒక్కరు అదనంగా స్వల్ప చార్జి  ఒక్కిరికి రూ. 600 చొప్పున  పేచేయాలి(2 రాత్రులకు కలిపి) ఈ చార్జి అందరికి కామన్ గా వర్తిస్తుంది. 
  • వర్షాకాలం కాబట్టి అంతా ఖచ్చితంగా గొడుగు కాని ప్లాస్టిక్ రేయిన్ కోట్ కాని ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలి. వీటిని మీ బ్యాగులో బద్రపరుచడానికి కాద, ప్రతిసారి విడిగా మీతోపాటు బయటే విడిగా ఉంచుకోవాలి. అంతే తప్ప మా రేయిన్ కోట్ బస్ పైన ఎక్కించిన బ్యాగులో ఉన్నదండి అంటే ఏ లాభం లేద, వాటిని ప్రతిసారి ఖచ్చితంగా మీతో పాటే ఉంచుకోవాలి. ఇవన్ని ప్లానింగ్ తో ఇంటిదగ్గరే సర్దుకోండి. 4,5 పెద్ద సైజు ఖాళి ప్లాస్టిక్ కవర్స్ కూడా మీ బ్యాగులో పెట్టుకోండి. వాటితో చాలా అవసరం పడుతుంది. విడిచిన బట్టలు పెట్టుకోవడానికి, ఎక్కడైనా ప్రసాదం తీసుకుంటే పెట్టుకోవడానికి తదితర అవసరాలకు ప్లాస్టిక్ కవర్స్ పనికి వస్తాయి.
  •  టూర్ లో డైలి వైస్ ఆ రోజు ఏయే టెంపుల్స్ చూస్తామో ఉదయమే వివరించ బడుతుంది. 
  • వెహికిల్ వెళ్ళని చోట షేరింగ్ ఆటోచార్జీలుఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో పూజలు అభిషేకాలు చార్జీలు,నదులు,సముద్రాల్లో బోటింగ్ చార్జీలు డ్రైవర్,క్లీనర్ కు  కలిపి ఒక్కరు రూ.100 చొప్పున వారికి టిప్ ఇవ్వవలెను. హోటల్ రూంలో మీ బ్యాగులు  రూంబాయ్ ద్వారా మోయించుకుంటే వారికి అప్పటికప్పుడే   టిప్ లు ఇవ్వడం  కనీస దర్మం . అలాగే యాత్రలో ఎవరికేమైనా ఇబ్బంది ఎదురైతే టూర్ మేనేజర్ కు విడిగా వ్యక్తిగతంగా చెప్పాలి తప్ప యాత్రలో అందరి మూడ్ చెడిపోయేట్లు పెద్దగా అరవడం,గొడవ పెట్టడం చేయరాదు. ఇతరుల మూడ్ చెడగొట్టరాదు. మనం వెళ్ళేది పుణ్యక్షేత్రాల దైవ యాత్రకు కాని ఫంక్షన్ హాల్ కు కాదు దయచేసి అందరు గుర్తుంచుకోవాలి…యాత్ర అన్నాక ఎవో చిన్న చిన్న ఇబ్బందులు కామన్ గా ఉంటాయి.దైవ యాత్రలో శరీరం ఎంత అలసిపోతే అంత ఖర్మ పద్దు క్షయం అవుతుంది అనేది ఒక దైవ రహాస్యం…. ఒక యాత్రకు వెళ్ళివచ్చాక అది జీవిత కాల మధుర మైన గుర్తుగా మిగిలిపోవాలి. అంతే తప్ప గొడవలు పెట్టి అందరి మూడ్ చెడగొట్టి అదొక బ్యాడ్ మెమెరిగా ఎవరు ఎవరికి ఉంచరాదు.
  • అందరు మీరో మోయగలిగేంత లగేజి మాత్రమే తెచ్చుకోవాలి.కొందరు విడిచిన బట్టలు వేయడానికి మరో బ్యాగ్ తెచ్చుకుంటారు.అలా కాకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తెచ్చుకుంటే సరిపోతుంది.విడిచిన బట్టలు ఆ ప్లాస్టిక్ కవర్ లో వేసి ,అదే బ్యాగులో పెట్టుకోవాలి.
  • 5 జతల బట్టలు, 1 బెడ్ షీటు, 1 టవల్ ,సోపు తెచ్చుకోండి. మగవాళ్ళు ఒక  తెల్లటి పంచె , కండువ లేదా తెల్లటి టవల్  తెచ్చుకోండి,  త్రివెండ్రం పద్మనాభ స్వామి టెంపుల్  కోసం.  అభిషేకం చేసుకోవడానికి ఒక చిన్న స్టీల్ లేదా రాగి  చెంబు వెంట తెచ్చుకోండి. స్ర్తీలు దీపారాదన చేయడానికి దీపం ప్రమిదలువత్తులు,ఆయిల్ తెచ్చుకుంటే అక్కడ వీలైన దేవాలయాల్లో ముట్టించుకోవచ్చును.ఇలాంటి వాటిని బ్యాగుల్లో కాకుండా విడిగా హ్యండ్ బ్యాగులో లేదా ప్లాస్టిక్ కవర్లో  పెట్టుకోండి.
  • అలాగే మీ వెంట రెగ్యులర్ గా వాడుతున్న టాబ్లెట్స్,మెడిసిన్స్ ఎమున్నా తెచ్చుకోండి, విలువైన బంగారు అభరాణాలు ఎట్టిపరిస్తితుల్లో తెచ్చుకోవద్దు.మీ లగేజికి ట్రైన్ లో లాక్ చేయడానికి గొళుసులు,తాళం తెచ్చుకోండి.
  • యాత్రలో ప్రతిరోజు టీ,టిఫిన్(మార్నింగ్ 1 టిఫిన్ లిమిటెడ్)మధ్యహ్నం మీల్స్ భోజనం,సాయంత్రం టీరాత్రి అల్పాహారం(ఎని టిఫిన్) బయటి హోటల్స్ లలో ఉంటుంది.  మేము సమకూర్చే టిఫిన్స్ ,భోజనాలు నచ్చకుంటే మాకు అది బాగ లేదు ఇది బాగల ేదు అని గొడవ పెట్టరాదు, ఆలా గొడవ పెట్టితే వారికి డైలి ఫుడ్ అమౌంట్ రూ.300 చొప్పున రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది, దాంతో వారు తమకు నచ్చింది ఆర్డర్ చేసుకుని ఎక్కడైనా తినవచ్చును.
  •  అలాగే   వెహికిల్ లో కూర్చుని జర్నీ చేసేప్పుడు కూడా మనం తదుపరి వెళ్ళే ప్రదేశం ఇంకా ఎప్పుడు వస్తుంది , ఎన్ని గంటలకు వస్తుంది అని ఎదురు చూడడం కాకుండా మనం యాత్రలో తిరిగే ప్రతి  క్షణం , మన వెళుతుంటే పక్కన కనపడే పక్రుతికొండలు,వాగులు,నదులు అన్నింటిని చూస్తు ఎంజాయ్ చేయాలి.ఒక్కసారి వెళ్ళి చూసిన ప్రదేశం మళ్ళి జన్మలో వెళుతామో వెళ్ళమో తెలియదు. కాబట్టి పుణ్యక్షేత్రాల దర్శనమే కాదు వెహికిల్ లో జర్నీ చేస్తున్న ప్రదేశాలన్నింటి చూస్తు ఎంజా య్ చేసే మూడ్ తో ఉండాలి.
  • బస్ లో  1-5 వరుసలు రూ.500 పేమెంట్ చేసిన వారికి ఫిక్స్ డ్ సీట్లు ఉంటాయి. మిగితా అందరు  అందరు డైలి 1 వరుసల చొప్పున వెనక్కి   జరగాలి.అందరికి వెహికిల్ లో రొటోషన్ పద్దతిలో సీట్లు మారుతాయి.
  • యాత్ర దర్శన సమయాల్లో వాతావరణంపక్రుతి,ట్రాఫిక్ జాంలు,బంద్ లు ఇతర అనివార్య కారణాలతో కొన్ని ప్రదేశాలకు దర్శించకపోవడం జరిగవచ్చును. అప్పుడు సంధర్బానుసారంగా అందరి సౌకర్యం కోసం టూర్ ఆపరేటర్ తీసుకునే  నిర్ణయమే అంతిమం. అనివార్య కారణాల వలన ఒక టెంపుల్ దర్శనం కాకుంటే ఆ టెంపుల్ దర్శనం వదిలేసి తదుపరి టెంపుల్ దర్శనంకు వెళుతుంటాం. ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.ఎట్టి పరిస్థితుల్లోను బయలు దేరే ట్రైన్ కురిటర్న్ ట్రైన్ టైంకు 1 గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని గమనించండి. టూర్ ఆపరేటర్ ప్రాధమిక విధి మీకు యాత్ర సమయంలో అన్ని రకాలుగా ఫ్లైట్,బస్,ట్రైన్,హోట్ ల్ రూంలు,టీ,టిఫిన్,భోజన సదుపాయలు ఏర్పరచడం,అన్ని పుణ్యక్షేత్రాలదర్శనానికి మిమ్మల్ని సౌకర్యవంతంగా తీసుకెళ్ళడం  అని దయచేసి మర్చిపోవద్దు.
  • ఏ రోజున ఏమేం చూస్తాం అని ఒక రోజు ముందు చెప్పుకుంటాం,అదేరోజు ఉదయం కూడా ఆరోజు ఏంచూస్తామో వెహికిల్ లోనే అందరికి గ్రూపుగా ఒకేసారి చెప్పబడుతుంది.  పరమేశ్వరుని దీవెనలు ఆశిస్సులు అందాలని మన యాత్ర అందరికి ఆనందంగా పూర్తికావాలని ఆ పరమేశ్వరుడుని వేడుకుంటూ…ఓం నమశ్శివాయ..

 రవీందర్.శ్రీటూర్స్. 8985246542

మా ఇతర యాత్రల వివరాల కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. https://shreetours.in/