Gujarath & Madhapradesh Yatra with 4 Jyothirlingas , 2 DwarakasYatra 5D/4N by Up & Down Flight on 24-03-2025 Ujjain, Omkareshwer, Somnath, Nageshwer ,Dwaraka ,Bhavnagar Shivalingas in Sea, Rs. 25,000.

0 (No Review)
India
Gujarath & Madhapradesh Yatra with 4 Jyothirlingas , 2 DwarakasYatra 5D/4N by Up & Down Flight  on 24-03-2025 Ujjain, Omkareshwer, Somnath, Nageshwer ,Dwaraka ,Bhavnagar Shivalingas in Sea, Rs. 25,000.
From: ₹25,000
0
(0 review)
Check

Overview

Gujarath and M.P 4 Jyothirlingas Yatra 5D/4N by up down by flight  on 24- 3-25 . with  A.C . vehicle on 24-03-2025  with 4 Jyothirlingas, Somnath, Nageshwer,Ujjain, Omkareshwer Dwaraka , Betdwaraka,Muldwaraka, Bhavnagar Shivlingas in Sea, Sardar Patel Statue etc.Rs.25,000 Per Person. Call  Shree Tours – 8985246542         

     *గుజరాత్  మధ్యప్రదేశ్ 4 జ్యోతిర్లింగాల 5 రోజుల యాత్ర  సోమనాధ్, నాగేశ్వర్, ఉజ్జయిని, ఓంకారశ్వర్, 2 ద్వారకాలు. యాత్ర తేదీ.24-03-2025 updown Flight from Hyderabad  to Indore on 24-3-25 @ 5 a.m), Return Ahmedabad to Hyderabad on 28-3-25 at 9 pm,  Rs. 25,000 per Person, booking last date 7-3-25, late booking after 8-3-25 Increased flight cost applicable) (Vehicle లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు Daily 1 Row Seat back Side Rotation wise(ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా).-ఫుడ్- ఉదయం-టిఫిన్+టీ,మధ్యహ్నం భోజనం,1 Liter Mineral Bottle సాయంత్రం-టీ,రాత్రి -అల్పాహారం , (హోటల్ రూంలలో  3 నైట్ స్టేలు గుజరాత్ లో @ – ద్వారక,సోమనాధ్, Bhavnagar with A.C Rooms ,   నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా రూ.15,000 ముందుగా  పేచేయవలెను. యాత్రకు వచ్చిన రోజున బ్యాలెన్స్ అమౌంట్  Rs. 10,000 క్యాష్ గా పేచేయవలెను. యాత్రకు  సింగిల్ గా వచ్చేవారికి రూ.3000 అదనం(సింగిల్ పర్సన్ రూం అలాట్ మెంట్ కోసం) .సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542

For Tour   Non Refundable Advance  అమౌంట్ Rs. 15,000 send to Google Pay  8985246542  Shree Tours(Business account),  

బుకింగ్ కోసం కాల్ చేయండి.-శ్రీటూర్స్. 8985246542.

****గుజరాత్ యాత్రలో దర్శించే పుణ్య క్షేత్రాలు****

1. సోమనాధ్ జ్యోతిర్లింగం

2. నాగేశ్వర జ్యోతిర్లింగం

3. ద్వారక-ద్వారకాదీశ్(శ్రీక్రుష్ణ మందిరం),

4. బెట్ ద్వారక,(శ్రీక్రుష్ణడి అంతపురం , కుచేలుడు  శ్రీక్రుష్డుడిని కలిసి అటుకులు ఇచ్చి కలిసిన క్షేత్రం)

5. మూల ద్వారక (శ్రీక్రుష్ణడు ద్వారక నుండి సోమనాధ్ కు వెళ్తు కొద్దికాలం మద్యలో గడిపిన క్షేత్రం)

6. గోమతి నది అరేబియా సముద్ర సంగమం,(పాత ద్వారక మునిగిన ప్రదేశం)

7. సోమనాద్ -గీతామందిర్, (శ్రీక్రుష్ణడు స్వర్గారోహణ చెందిన ప్రదేశం)

8. సోమనాద్ – త్రివేణిసంగమం, (హిరణ్య,కశ్యప,సరస్వతి నదులు ఇక్కడ కలిసి అరేబియా సముద్రంలో కలుస్తాయి),

9. భావ్ నగర్ సముద్రంలో శివలింగాలు, నిష్కలంక మహాదేవ్ టెంపుల్ .

10.Sardhar Patel Statue.

మధ్య ప్రదేశ్ లో దర్శించే క్షేత్రాలు.

10.ఉజ్జయిని జ్యోతిర్లింగం.

11ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ( strictly 2 hours time for Darshan)

12.ఉజ్జయిని మహాకాళీ మందిరం.( అష్ట దశ శక్తిపీఠం )

13.హారసిద్ధి మాత టెంపుల్.

పూర్తి వివరాలకు మా వెబ్ సైట్ లింక్ మీద ఇక్కడ క్లిక్ చేయగలరు.  https://shreetours.in/st_tour/gujarath-m-p-yatra/

**గమనిక-యాత్ర సూచనలు-జాగ్రత్తలు,నియమ – నిబంధనలు.(టర్మ్ అండ్ కండీషన్స్)

1.  అన్ని టెంపుల్స్ దగ్గర time మైంటైన్ చేయాలి.

2) అడ్వాన్సుగా రూ.15,000 నాన్ రిఫండబుల్ అమౌంట్ గా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా  పేచేయవలెను. బ్యాలెన్స్ rs. 10,000  టూర్ కు వచ్చిన రోజున క్యాష్ గా పేచేయవలెను.  ( Google Pay – 8985246542 , Shree Tours Business Account )   బస్ వెళ్ళని చోట వర్తించే దగ్గర ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్,  పూజలు, ప్రత్యేక దర్శనాలు అభిషేకాలు , తదితర చార్జీలు అదనం.

3) బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం, సీట్ల రిజర్వ్ సీట్లు మినహా. బస్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్ చార్జీలు,(సముద్రం,నది.. వర్తించే దగ్గర),దేవాలయాల్లో పూజలు,అభిషేకాల చార్జీలు అదనం. 

4)  ఒరిజినల్ ఆధార్ కార్డు+3 జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా  తెచ్చుకొవాలి.(హోటల్ రూంలో అవసరం)

5) అందరికి  Non A.C ఎ.సి.హోటల్  రూంలలో  రాత్రి బస ఉంటుంది. నైట్ స్టేలు గుజరాత్ లో – ద్వారక,సోమనాధ్,.నైట్ హోటల్ రూంలో ఉండని దగ్గర,  స్నానం-  ప్రెషప్ చార్జీలు అదనం

6) డ్రైవర్,క్లీనర్ క ఒక్కరు రూ.100 చొప్పున టిప్ ఇవ్వవలెను. అలాగే హోటల్ రూంలలో రూం బాయ్ ల ద్వారా లగేజి మోయించుకున్నప్పుడు విడిగా బా య్ లకు విడిగా టిప్ లు పేచేయవలెను.(హోటల్ రూంలో లగేజి మోయించుకున్నవారు  మేయిన్ టేయిన్ చేయాల్సిన మినిమం కర్టసి)

7)  మీవెంట లైట్ లగేజి 5జతల బట్టలు,బెడ్ షీట్,టవల్, మీరు రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్స్ తెచ్చుకోండి. యాత్రకు వచ్చేప్పుడు విలువైన బంగారం అభరణాలు తెచ్చుకోవద్దు.ఎవరి లగేజికి,డబ్బుకు,నగధుకు వారే బాధ్యులు.లగేజి మిస్సింగ్ కు టూర్ ఆపరేటర్ బాధ్యత లేదు.ఎవరి లగేజి వారు జాగ్రత్తగా పెట్టుకోవలెను.

8) యాత్రలో సందర్భనుసారం ఎదురయ్యే పక్రుతి, లాక్ డౌన్ ,ఒక టెంపుల్ లో దర్శనం ఎక్కువ సమయం తీసుకోవడం  లాంటి  అనివార్య కారణాల రీత్యా యాత్రలో కొన్ని టెంపుల్స్ చూడక పోవడం జరగువచ్చును.అంతిమ నిర్ణయం టూర్ ఆపరేటర్ దే.  ఆకస్మాత్తుగా ఏర్పడే అనారోగ్యం, వైధ్య ఖర్చులు, తదితరాలన్నింటికి యాత్రికులు తమ స్వంత భాధ్యత మీదే బయలు దేరి రావలెను. యాత్ర నిర్ధారిత రోజులు దాటిన తరువాత ఏ కారణాల రీత్యనైనా యాత్రలో ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే అందుకు ఏర్పడే అధనం ఖర్చులు యాత్రికులే భరించవలెను.యాత్రలో ఏదేని ట్రైన్ కేన్సిల్ అయితే తదుపరి బస్ ద్వారా బుకింగ్ చేయాల్సి వస్తే అందుకయ్యే అదనం చార్జీలు యాత్రికులే భరించవలెను.

9) .యాత్ర రోజుల్లో  ఉదయం టిఫిన్ (లిమిటెడ్ 1 టిఫిన్) తో పాటు టీ, మధ్యహ్నం భోజనం,( Daily 1 Liter Mineral Bottle) సాయంత్రం టీ, నైట్ అల్పాహారం ఉంటును. . శ్రీటూర్స్ గుజరాత్,మధ్య ప్రధేశ్ యాత్ర రెగ్యులర్ గా మేయింటేన్ చేస్తారు కాబట్టి , హోటల్ కు తినడానికి వెళ్ళడానికి ముందే ఇంత మంది యాత్రికులం వస్తున్నాం అని హోటల్ వారికి కాల్ చేసి వెళుతాం , మేము వెళ్ళే రెగ్యులర్ హోటల్స్ లలో ఫుడ్ బాగానే ఉంటుంది.ఉదయం టిఫిన్ అక్కడి లోకల్ ఫుడ్ ఫోహా,డోక్లా,గాఠియా,పూరి ,పరోటా, ఇడ్లి లాంటివి ఉంటాయి. మధ్యహ్నం లంచ్ లో మీల్స్ ఉంటుంది. మేం కల్పించే ఫుడ్ నచ్చని వారికి ఫుడ్ అమౌంట్ డైలి రూ.300 చొప్పున రిఫండ్ ఇస్తాం(యాత్ర రోజుల్లో) ,దాంతో వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని హోటల్ లలో తినవచ్చును. 

10) యాత్రకు సింగిల్ గా (లేడిస్ లేదా జెంట్స్ ) వచ్చేవారికి గమనిక ,హోటల్ రూంల అలాట్ దగ్గర ఇతర సింగిల్స్ లేకుంటే ఒక్కరికే రూం అలాట్ కోసం  రూ.2000 చార్జి అదనంగా పేచేయాలి.

Before Pay the Advance must read our terms and conditions page,click this link to read it.

యాత్ర క్షేత్రాలు – వాటి విశేషాలు.

**గుజరాత్ లో దర్శించే పుణ్య క్షేత్రములు.*.        ****సోమనాథ్ జ్యోతర్లింగం,గుజరాత్. *–

***సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వీరావల్‌ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని “ప్రభాస తీర్థం” అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. ఈ ఆలయానికున్న చరిత్ర చెప్పనలవికాదు. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది.గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు.ఆరు మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగడ్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరియొక మంత్రి అయిన కే ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు, తన భార్యలు, అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.ఇక్కడ సాయంత్రం హరతి తరువాత గుడిమీద ప్రొజెక్ట్ చేసే  సౌండ్ అండ్ లైట్ షో (సోమనాథ్ ఇతర జ్యోతిర్లింగాల చరిత్ర)  చాలా అధ్బుతంగా ఉంటుంది.  భక్తి ప్రపత్తులతో ఇక్కడ శివుడిని దర్శించుకున్నవారికి ధీర్ఘ కాలిక మొండి వ్యాధులు నయం అవుతాయి.ఆత్మజా్నం కోసం పరితపించేవారికి జ్యోతిర్లింగ దర్శనం భాగ్యం వలన వారి యోగ సాధన త్వరగా పలిస్తుంది.జ్యోతిర్లింగం అంటే ఆ పరమేశ్వరుడు స్వయంభువుగా భూమిమీద వెలిసిన క్షేత్రాలు. ఈ జ్యోతిర్లింగాల గర్భగుడిలోకి అపార విశ్వ శక్తి ప్రసారం అవుతుంటుంది.

Somnath-Temple
Somnath-Temple

*నాగేశ్వర జ్యోతిర్లింగం, దారుకవనం,గుజరాత్.*

ద్వారకకు  పదిహేను కి.మీ. దూరంలో ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం పదవది. దారుకుడు అనే రాక్షసుడి బారి నుంచి మహా భక్తుడైన సుప్రియుడిని రక్షించాడు ఆ పరమ శివుడు.పూర్వం సుప్రియుడు అనే పేరుగల గొప్ప ధర్మాత్ముడు అయిన ఒక వైశ్యు శివ భక్తుడు ఉండేవాడు . సుప్రియుడు ఎప్పుడుశివుడి ఆరాధనలో మునిగితేలేతూ, తన సమస్త కర్మలు శివునికే అర్పిస్తూ మనోవాక్కాయ కర్మల ద్వారా పరిపూర్ణంగా శివ ద్యానంలోనే గడిపేవాడు . ఇతని శివ భక్తిని చూసి అదే ప్రాంతంలో ఉండే దారుకుడు అనే రాక్షసుడు సహించలేకపోయాడు . అతని శివ పూజలని ఎలాగైనా నిరోధించాలని చూస్తూ ఉంటాడు . ఒకసారి సుప్రియుడు ఒక పడవలో ప్రయాణం చేయడం దారకుడి కంట పడింది . అదే సరైన సమయం అనుకుని దారకుడు పడవను ముట్టడించి ,సుప్రియుడిని ,మిగిలిన యాత్రికులని భందీలుగా చేసి తన రాజధాని లోని కారాగారంలో బంధించాడు . అల బంధించడం వల్ల సుప్రియుడి శివ పూజలను నిరొధించగలిగాను అనుకుంటాడు . కాని సుప్రియుడు జైలులో ఉండి కూడా నియమ నిష్టలతో శివపూజ చేస్తుంటాడు.. అది తెలుసుకున్న దారకుడు కోపం పట్టలేక సుప్రియుడిని సంహరించబోతే శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు . ఆ అస్త్రం తో సుప్రియుడు దారకుడిని సంహరిస్తాడు . శివ భగవానుడి అదేశానుసారమే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది . అప్పటి నుండి శంకరుడు భక్తుల పూజలు అందుకుంటూ వారి  కోరికలను నెరవేరుస్తూ  వున్నాడు.ఇక్కడి ప్రాచీన దేవాలయం అంతా శిథిలావస్థకు చేరుకోంది. టి- సిరిస్ మ్యూజిక్ క్యాసెట్స్ అధిపతి గుల్షన్ కుమార్ ఈ మందిరాన్ని 2కోట్ల రూపాయల స్వంత ఖర్చుతో ఇటీవలే పునర్ నిర్మించాడు.నాగేశ్వర జ్యోతిర్లింగంలోనాగ ప్రతిమలతో పూజచేయడం ప్రతీతి. ఇక్కడి గర్భగుడిలో శివలింగం పక్కనే కూర్చుని శివుడికి అభిషేకం చేయవచ్చు.ఈ అభిషేకం టికెట్ జంటకు రూ.300 మరియు అభిషేకానికి తగిన పూజసామగ్రి కొనడానికి (సుమారు రూ.250 నుండి రూ.500 వరకు )అక్కడే గుడిలోపల కొనుక్కోవచ్చు.గర్బగుడిలోకి వెళ్ళేప్పుడు దొవతి దరించి పూజలో కూర్చోవాలి.ఎవరైనా దొవతి తెచ్చుకోవడం మర్చిపోతే దేవాలయం లోపలే గర్భగుడి పక్కనే రూమ్ లోకి వెళ్ళి పాంట్ అక్కడ విడిచి దేవస్థానం వారు అందుబాటులోఉంచిన దొవతిని ధరించి అభిషేకానికి కూర్చోవచ్చు.

use

అహ్మదాబాదు – సబర్మతి ఆశ్రమం.

మహాత్మగాంధి అహ్మదాబాదులో ఉన్న సబర్మతి నది ఒడ్డునే ఒక కుటీరంలో ఉండి స్వాతంత్రోధ్యమం నడిపాడు.సబర్మతి నది ఒడ్డున ఉన్న ఆశ్రమం కాబట్టి దీనికే సబర్మతి ఆశ్రమం అంటారు.మహాత్మ గాంధి గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించాడు( ద్వారక నుండి సోమనాధ్ వెళుతున్నప్పడు మనం పోర్ బందర్ బైపాస్ రోడుగుండానే వెళుతాం) అహ్మదాబాదు సబర్మతి ఆశ్రమంలో ఉండి స్వాతంత్ర ఉధ్యమం చేసాడు.డిల్లిలో నాధూరాం గాడ్సే ద్వారా హతమయ్యారు.డిల్లిలో మహత్మగాంధి సమాధికే రాజ్ ఘాట్ అని పేరు.

*ద్వారక,గుజరాత్.*

ద్వారక  నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహాలను ఎంచుకుని, ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి, పూర్తి చేసి, ప్రజలను శూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు.శ్రీక్రుష్ణుడు మహాభారత యుద్దం తరువాత ద్వారకకు వచ్చే రాజ్య పరిపాలన చేస్తాడు.5000 ఏళ్ళకిందట శ్రీక్రుష్ణుడు నిర్మించిన ద్వారక నగరం ప్రస్తుతం గోమతి నది  అరేబియా సముద్రంలో సంగమం అయ్యే ప్రదేశంలో ఉన్నది. ఇప్పటికి కూడా ద్వారకలో 4 వారాల శిక్షణ తీసుకున్న వారు సమద్ర గర్బంలోకి ప్రయాణించి ప్రాచీన ద్వారకను స్వయంగా చూడవచ్చును.క్రీ.పూ 400 సంవత్సరంలో శ్రీకృష్ణుని మునిమనుమడైన వజ్రనాభుని చేత నిర్మించబడిందని విశ్వసించబడింది. అయినప్పటికీ ప్రస్తుత నిర్మాణం క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్చమైన చాళుక్యుల శైలిలో నిర్మించబడింది. ఈ అద్భుత ఆలయం ఎత్తు 51.8 మీటర్లు. జగత్ మందిర్ అని కూడా పిలువబడుతున్న ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉన్నాయి. నిజశిఖరం అనబడే పెద్దశిఖరం గర్భాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నాడు. ఈ బృహత్తరమైన ఆలయంలో అద్భుతమైన శిల్పకళానైపుణ్యం కలిగిన 60 స్తంభాలు, అనేకశిల్పాలు ఉన్నాయి. 

శ్రీ క్రుష్ణడి ద్వారకాదీష్ మందిర్, గోమతి నడి ఒడ్డున,ద్వారక. గుజరాత్. ఈ గోమతి నది వెళ్ళి అరేబియా సముద్రంలో కలిసే చోటే సముద్రంలో ప్రాచీన ద్వారక ఉన్నది.

*బెట్ ద్వారక.*

బెట్ ద్వారక ప్రాచీన ద్వారకలో శ్రీ క్రుష్ణుని అంతపురం ప్రాంతం.  శ్రీ క్రుష్ణుని బాల్య మిత్రుడైన కుచేలుడు( సుదామ) పేదరికంతో బాధపడుతూ తన భార్య ఇచ్చిన అటుకుల మూటతో వచ్చి శ్రీ క్రుష్ణున్ని ఇక్కడే కలుస్తాడు. ఇక్కడ శ్రీ క్రుష్ణుడి,బలరామ మందిరాలతో పాటు , కుచేలుడి హాలు (సుదామ హాలు) దర్శనీయ స్థలాలు.

*మూల ద్వారక.* 

శ్రీక్రుష్ణుడు ద్వారక నుండి సోమనాధ్ వెళుతు కొద్దికాలం విశ్రమించిన మరో క్షేత్రమే మూల ల ద్వారక. పోర్ బందరు దగ్గరలో ఉంటుంది.

*గీతామందిర్,సోమనాథ్

శ్రీక్రుష్ణుడు స్వర్గారోహణ- మహా నిర్యాణం చెందిన  పుణ్యక్షేత్రం. గాంధారి శాపం కారణంగా శ్రీక్రుష్ణుల వారు పొరపాటున బోయవాడి బాణానికి గురై శరీరాన్ని విడి సర్గారోహణ చేసిన క్షేత్రం ఇక్కడ శ్రీక్రుష్డుడి వారి పాద ముద్రికలు ఉంటాయి.దిగువ ఫోటోలో కనపడుతున్న గోపురం మద్యలో పాద ముద్రికలు ఉంటాయి.పక్కనే శ్రీ క్రుష్ణుడి గీతా మందిరం ఉంటుంది.

*త్రివేణి సంగమం,సోమనాథ్.*

త్రివేణి సంగంలో హిరణ్య,కశ్యప,సరస్వతి నధులు ఇక్కడ సంగమించి,పక్కనే ఉన్న అరేబియా సముద్రంలో కలుస్తాయి.

 

*భావ్ నగర్ – సముద్రంలో శివలింగాలు-నిష్కలంక మహాదేవ్ టెంపుల్.

భావ్ నగర్ నుండి 25 కి.మీ.దూరంలో కొలియాక్ గ్రామంలో నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అరేబియా సముద్రం ప్రతిరోజు నిర్ణీత సమయంలో వెనకకు పోయిన తరువాత సముద్రం నీళ్ళు తిరిగి వచ్చే లోపు మద్యలో మిగిలే నాలుగు గంటల్లో ఇక్కడి సముద్ర గర్భంలో కిలోమీటర్ దూరం నడిచి ఇక్కడి నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ దర్శించుకోవాలి. ఇక్కడ విడిగా టెంపుల్ అంటూ ఉండదు .మహాభారత యుద్దం తరువాత   ఇక్కడ పర్యటించిన పంచపాండవులు  ప్రతిష్టించిన 5 శివలింగాలు ఒక పెద్ద బండరాయి మీద ఉంటాయి.సముద్రం వెనక్కూ పోయాక పూజరి ఇక్కడి వచ్చి నిత్యం పూజలు చేస్తాడు.అదే సమయంలో భక్తులు ఈ శివలింగాలను దర్శించుని పూజలు చేస్తుంటారు. మన కళ్ళముందే సముద్రం వెనక్కూ పోవడం,ముందుకు రావడం ఇక్కడ ప్రత్యక్షంగా దర్శించవచ్చును. సముద్ర గర్భంలో నడవడం యాత్రికులకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి.

 

Duration

5 Days 4 Nights

Tour Type

Specific Tour

Group Size

49 people

Languages

English, Hindi, Telugu

Included/Excluded

  • Up down flight, A.C.vehicle, A.C.Rooms.Food
  • Additional Services Entrance fees, special Darshan, Puja,Abhishek, Sharing Auto charges from Bus Parking Place,

Languages

English
Hindi
Telugu
From: ₹25,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

+91-8985246542

error: Content is protected !!