Maharastra Yatra 7Days/6Nights 4 Jyothirlingas+ Asta Ganapathulu With Shirdi , Nasik, Ellora, Kolhapur, Pandarpur, Tuljapur, on 21-12-2024

0 (No Review)
India
Maharastra  Yatra 7Days/6Nights 4 Jyothirlingas+ Asta Ganapathulu With Shirdi , Nasik, Ellora, Kolhapur, Pandarpur, Tuljapur,  on 21-12-2024
From: ₹15,000
0
(0 review)
Check

Overview

 Maharastra Yatra 7Days /6Nights   with 4 Jyothirlingas+Asta Ganapathulu With Shirdi , Nasik, Ellora, Kolhapur, Pandarpur, Tuljapur+ on 21 -12-2024   @Night  8.00 p.m. Train  from Kacheguda,  return on 27-12-24 at 10 am.    With 3AC  updown train , 40 Seater AC Bus, Non AC Rooms with  Food Rs.15,000 each .Call – Shree Tours-8985246542.

మహారాష్ట్ర 7D/6N యాత్ర 21 డిసెంబర్ – 2024 న- క్రిస్ మస్ హాలిడేస్ లో- రాత్రి 8గంటలకు కాచిగూడ  రైల్వేస్టేషన్ నుండి ఔరంగాబాద్ కు  రిటర్న్ 27-12-24న ఉదయం 10 గంటలకు కాచిగూడ. మహారాష్ట్ర యాత్ర- 4 జ్యోతిర్లింగాలు, పూణే చుట్టుపక్కల అష్టగణపతులు,  షిర్డి ,నాసిక్ ,ఎల్లోరా ,శని శింగనాపూర్, కొల్హాపూర్- మహాలక్ష్మీ, పండరిపూర్, తుల్జాపూర్+లోనావాల,  అప్ డౌన్ 3 ఎ.సి.ట్రైన్,(కాచిగూడ టూ ఔరంగాబాదు+రిటర్న్ కాచిగూడ) 40 సీటర్ ఎ.సి.పుష్ బ్యాక్ సీటర్ డీలక్స్ బస్.+ నాన్ ఎ.సి.హోటల్ రూంలు,భోజనం*తో ఒక్కరికి రూ.15,000.

సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542  శ్రీటూర్స్.8985246542.( Rs.10,000 non refundable advance to Google pay -8985246542 Shree Tours

** మహారాష్ట్రలో దర్శించే 4 జ్యోతిర్లింగాలు****

1) భీమశంకర్ జ్యొతిర్లింగం.

2) పర్లి వైద్యనాధ్ జ్యొతిర్లింగం.

3) త్రయంబక్ జ్యొతిర్లింగం.

4) ఘ్రిష్ణేశ్వర్ జ్యొతిర్లింగం.

+++++++

** మహారాష్ట్ర లో దర్శించే ఇతర పుణ్యక్షేత్రాలు. ** 

1) కొల్హాపూర్ – మహాలక్ష్మి మంధిరం( అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి)

2) పండరిపూర్- పండరి నాధ్ మంధిరం.

3) తుల్జాపూర్- తుల్జాభవాని మంధిరం.

4) షిర్డి- సాయిబాబా మంధిరం 

5) నాసిక్- పంచవటి, గోదావరి పుష్కర ఘాట్.

6) నాసిక్ –కాలారామ మందిరం,సీతగుహ.

7) ఎల్లోరా గుహలు – యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్.

8) దౌలతాబాద్ కోట (రన్నింగ్ లో మాత్రమే,నోహాల్టింగ్)

9) లోనావాల  -రాజమచి పాయింట్ , లోనవాల-ఖండాల- ఘాట్స్

                                                     **అష్టగణపతులు.**

మహారాష్ట్రలోని  పూణే చుట్టుపక్కల 200 కీ.మీ రేడియస్ లో ఉన్న అష్ట వినాయక (అష్ట గణపతి) క్షేత్రాలు .

  1. విఘ్నహరేశ్వర గణపతి- ఓజర్-ఇక్కడ గణపతి విఘ్నాలు తొలగించే దేవుడు.

  2. గిరిజాత్మజ గణపతి- లేన్యాద్రి -250 మెట్లున్న కొండపై 7వ గుహలో.కొండఎక్కలేనివారికి డోలీలు ఉంటాయి.

  3. మహాగణపతి- రంజన్గావ్- అత్యంత శక్తివంతమైన గణపతి దర్శనం.

  4. సిద్ధివినాయక గణపతి- సిద్ధటెక్ -ఇక్కడ గణపతి బుద్ధి, సిద్ధికి ప్రసిద్ధుడు.

  5. మయురేశ్వర్ గణపతి- మోరెగావ్ -మయూర పక్షిని అధిరోహించిన గణపతి మూర్తి .

  6. చింతామణి గణపతి- తేహుర్ -ఇక్కడ గణపతి భక్తుల చింతలను తీర్చే వాడు.

  7. వరద వినాయక గణపతి- మహద్ – వరం ప్రసాదించే గణపతి .

  8. బల్లాలేశ్వర్ గణపతి- పాలి – భక్తుడి పేరు మీద పేరు కలిగి ఉన్న గణపతి.

**యాత్రకోసం ముందుగా రూ.10,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా మీ గూగుల్ పే Google Pay Shree Tours 8985246542  .

********యాత్ర సూచనలు..టర్మ్స్ అండ్ కండీషన్స్. *************

1 )బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్  సీట్ల  వరుస ప్రకారంగా ఉంటుంది.  ,భోజనం- ఉదయం-టిఫిన్+టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం-టీ,రాత్రి -అల్పాహారం ,-గమనిక* అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్  ఉండదు,(హోటల్ రూంలలో  నైట్ స్టేలు ఇద్దరికి ఒక రూం(నాన్ ఎ.సి.) మహారాష్ట్రలో 4 రాత్రులు @ – షిర్డి,రంజన్ గావ్, పూణే/లోనావాల, కోల్హాపూర్)  నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా రూ.10,000 ముందుగా  పేచేయవలెను. (ఎ.సి.రూంస్ కు రూ.2000 అదనం.ఎ.సి.రూంలు కావల్సిన వారు ముందుగానే  పేచేయవలెను) యాత్రకు వచ్చిన రోజున బ్యాలెన్స్ అమౌంట్ క్యాష్ గా పేచేయవలెను. యాత్రకు  సింగిల్ గా వచ్చేవారికి రూ.2,000 అదనం(సింగిల్ పర్సన్ రూం అలాట్ మెంట్ కోసం)

2) ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం,సాయంత్రం టీ,  రాత్రి అల్పాహరం బయటి హోటల్స్ లలో  ఉంటుంది. మేము అరెంజ్ చేసే ఫుడ్ నచ్చని వారికి  డైలి రూ.300 చొప్పున యాత్ర మధ్యలో కల 5 రోజులకు రూ.1500 ఫుడ్ అమౌంట్ రిఫండ్ ఇవ్వబడును.అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు.

3) యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

4) హోటల్ రూంలలో  నైట్ స్టేలు ఇద్దరికి ఒక రూం(నాన్ ఎ.సి.). యాత్రకు సింగిల్ గా వచ్చేవారు ఇతర సింగిల్స్ లేకుంటే రూ.2000  అదనంగా రూం చార్జీ పేచేయలి. ఎ.సి. రూంల కోసం 4 నైట్స్ కలిపి ఒక్కిరికి రూ.2000 అదనం. 

5) ఆధార్ కార్డు ఒరిజినల్+ 4 జిరాక్స్ కాపీలతో  రావలెను.

6)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా బుజనా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను. జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

7) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100   ఇవ్వవలెను. .

యాత్ర విశేషాలు. 

1) భీమశంకర్ జ్యొతిర్లింగం.భీమశంకర క్షేత్రం- ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన 6వ భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం . భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. దూరంలో  వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపానది అయిన భీమానది ఇక్కడే పుట్టింది.

2) పర్లి వైద్యనాధ్ జ్యొతిర్లింగం. పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం,  ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైన పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి.1700లలో రాణి అహల్యాభాయి పర్లి వైజనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించిందని పర్లి వైజనాథ్ ఆలయ చరిత్ర చెబుతోంది.

3) త్రయంబక్ జ్యొతిర్లింగం.త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, త్రయంబకేశ్వర్ శివాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానం. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.ఇది నాసిక్ నుండి 30 కీ.మీ.దూరంలో ఉంది. ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేసిన దేవాలయం.

4) ఘ్రిష్ణేశ్వర్ జ్యొతిర్లింగం.

ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం ఈశ్వరుడి 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి.  ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగం (కాంతి లింగ) గా పరిగణించబడుతుంది. ఈ తీర్థయాత్ర ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్ అని కూడా పిలుస్తారు) వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.ఇది ఔరంగాబాద్ నగరం వాయువ్య దిశ నుండి 30 కి.మీ  దూరంలో ఉంది.

షిర్డి- సాయిబాబా మంధిరం

షిర్డీ సాయిబాబా (సెప్టెంబరు 28, 1835 – అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైనది “అందరికి ప్రభువు ఒక్కడే” (అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్). ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను  దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా కొలుస్తారు.

ఎల్లోరా గుహలు.

ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ కు 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు , సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం సా. శ. పూ. 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం సా. శ. పూ. 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

మహారాష్ట్రలో పుణె, అహ్మద్‌నగర్‌, రాయ్‌గఢ్‌ జిల్లాల్లో స్వయంభువులుగా పేర్కొనే ఎనిమిది వినాయక మందిరాలు ఉన్నాయి. మయూరేశ్వర్‌ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా ఈ ఎనిమిది మందిరాలను దర్శించుకోవడం ఆనవాయితీ. మహాగణపతి ఆలయం తర్వాత మళ్లీ మోరేశ్వర్‌ను దర్శించుకోవడంతో అష్ట వినాయక పరిక్రమ పూర్తవుతుంది. ఇలా చేస్తే అష్ట వినాయకుల అనుగ్రహంతో అష్టకష్టాలూ తొలగిపోయి, సకల శుభాలనూ పొందుతారనేది భక్తుల విశ్వాసం.

Ads by

మోరేశ్వరుడు

పుణె నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్‌గావ్‌లో కొలువుదీరిన గణపతి మోరేశ్వర్‌ లేదా మయూరేశ్వర్‌. ఈ పట్టణం ఒకప్పుడు నెమళ్ల (మయూరాలు)కు ప్రసిద్ధిచెందిందని, అందుకే మోర్‌గావ్‌ అనే పేరు వచ్చిందని అంటారు. అంతేకాకుండా, సాధారణంగా నెమలి కుమారస్వామి వాహనం. ఇక్కడ మాత్రం ఆయన అన్న గణపతి నెమలి వాహనుడై కొలువుదీరడం విశేషం. సింధువు అనే రాక్షసుణ్ని సంహరించడానికి గణపతి మయూరేశ్వరుడిగా అవతరించాడని కథ ప్రచారంలో ఉన్నది.

సిద్ధివినాయకుడు

ఈ ఆలయం అహ్మద్‌నగర్‌ జిల్లాలోని సిద్ధటేక్‌లో ఉంది. ఎనిమిది వినాయక మందిరాల్లో ఏడింటిలో వినాయకుడి తొండం ఎడమ వైపు తిరిగి ఉండగా, ఒక్క సిద్ధటేక్‌లో మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడి వినాయకుడు భక్తుల కోరికలను తీర్చే కామధేనువు.

బళ్లాలేశ్వరుడు

ఈ మందిరం రాయ్‌గఢ్‌ జిల్లా పాలి గ్రామంలో ఉంది. తన భక్తితో వినాయకుడిని మెప్పించిన బళ్లాలుడు అనే యువకుడి పేరుమీద ఇక్కడి స్వామికి, ‘బళ్లాలేశ్వర్‌’ అనే పేరు నిలిచిపోయింది. తమ కోరికలు నెరవేరడానికి అకుంఠిత భక్తితో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

వరద వినాయకుడు

పుణెకు దగ్గర్లో ఉన్న మహద్‌ గ్రామంలో కొలువుదీరిన మూర్తి వరద వినాయకుడు. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడి స్వామి తన దగ్గరికి వచ్చే భక్తులకు విజయాలను ప్రసాదిస్తాడు. ఇక్కడ ఆలయంలో నందాదీపంగా పిలిచే ఒక నూనె దీపం 1892 నుంచి అఖండంగా వెలుగుతూ ఉందని విశ్వసిస్తారు.

చింతామణి గణపతి

ఈ ఆలయం పుణె నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓసారి కపిల మహర్షి కోసం గణపతి గుణాసురుడితో పోరాడాల్సి వస్తుంది. భీకరమైన యుద్ధం తర్వాత చింతామణి సాయంతో అందులో వినాయకుడు గెలుస్తాడు. అందుకే చింతామణి గణపతి అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడి స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు.

గిరిజాత్మజుడు

పుణె సమీపంలోని లేన్యాద్రి గుహల్లో కొలువుదీరిన గణపతే గిరిజాత్మజుడు. గిరిజాదేవి పార్వతి కొడుకు కోసం ఇక్కడ తపస్సు చేసిందని ఐతిహ్యం. అందుకే ఇక్కడి స్వామికి గిరిజాత్మజుడు అనే పేరు వచ్చింది. మిగిలిన మూర్తులకు భిన్నంగా, గుహ కుడ్యానికి మలచిన రూపాన్ని కలిగి ఉంటాడు ఇక్కడి స్వామి. 18 గుహల సముదాయంలో 7వ గుహలో గిరిజాత్మజుడు కొలువై ఉన్నాడు.

విఘ్నహరేశ్వరుడు

పుణె నాసిక్‌ మార్గంలో ఓజార్‌ పట్టణంలో వెలసిన దేవుడు విఘ్నహరుడు. విఘ్నాసురుడు అందరికీ విఘ్నాలు కలిగించేవాడు. అయితే గణపతి చేతిలో ఓడిపోవడంతో విఘ్నాసురుడు క్షమించమని స్వామి కాళ్లమీద పడతాడు. తన పేరు గణపతితో కలిసి ఉండాలని వరం కోరుకుంటాడు. అలా ఇక్కడి దేవుడికి విఘ్నహరేశ్వరుడు అనే పేరు నిలిచిపోయింది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలనుకునే వాళ్లు విఘ్నహరుణ్ని పూజిస్తారు.

మహాగణపతి

పుణెకు 50 కిలోమీటర్ల దూరంలో రంజన్‌గావ్‌లో కొలువుదీరాడు. ఇక్కడి దేవుడిని మహాగణపతి రూపంలో కొలుస్తారు. త్రిపురాసుర సంహారానికి ముందు పరమేశ్వరుడు తనకు విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఇక్కడే తన కొడుకైన గణపతిని ప్రార్థించాడని స్థల పురాణం.

Duration

7Days 6Nights

Tour Type

Specific Tour

Group Size

40 people

Languages

Hindi, Telugu

Included/Excluded

  • 3 AC Class berth in Train from Hyderabad Rly Station to Parli Vaidhyanadh; Return to Hyderabad Rly Station, Non AC Bus/Mini Bus, Non AC Hotel -Rooms, Food( Morning Tiffin(limited) & Tea, After Noon Lunch+1 Ltr Mineral Bottle, Evening Tea, Night Light Food.
  • Sharing Auto Charges, Where Bus not goes, Entrance Tickets, Special Darshanas, Pooja,Abhishek Tickets, Etc.
  • Additional Services, Insurance

Tour Highlights

  • 4 జ్యోతిర్లింగాలు భీమాశంకర్, త్రయంబక్, పర్లివైధ్యనాధ్, ఘ్రిష్ణేశ్వర్, +అష్ట గణపతులు, షిర్డి ,నాసిక్, కొల్హాపూర్,పండిరిపూర్,తుల్జాపూర్, ఎల్లోరా తదితరాలతో మహారాష్ట్ర యాత్ర . 3 టైర్ ఎ.సి. ట్రైన్, యాత్రలో 40 సీటర్ ఎ.సి. బస్, హోటల్ రూం,భోజనంతో రూ.15,000 మాత్రమే.Call శ్రీటూర్స్.8985246542.

Languages

Hindi
Telugu
From: ₹15,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

+91-8985246542

error: Content is protected !!